కాంగ్రెస్‌ను తరిమికొట్టండి

0
  • దేశ ప్రయోజనాలపై శ్రద్ధ లేదు
  • ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ

తమను కాపాడే కాపలాదారు కావాలో.. అవినీతి వారసుడు కావాలో ప్రజలు తేల్చుకోవాలని కోరారు. తమ హయాంలో గత ఐదేళ్లలో భారత్‌ సూపర్‌ పవర్‌గా ఎదిగిన విషయం ప్రపంచం గుర్తించిందన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ప్రధాని మోడీ షిర్డీ, అహ్మద్‌నగర్‌ ప్రచార ర్యాలీలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ పార్టీకి దేశ ప్రయోజనాలను కాపాడటంపై ఎటువంటి శ్రద్ధ లేదని మండిపడ్డారు. ‘పేదరికాన్ని పారదోలడానికి కాంగ్రెస్‌ను తరమికొట్టండి’ అని ఈ సందర్భంగా కొత్త నినాదాన్ని ఇచ్చారు. 21వ శతాబ్ధంలో జన్మించిన యువత ఇప్పుడు తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని దేశ భద్రత విషయంలో గత ప్రభుత్వాలు రాజీ పడటాన్ని మీరు అంగీకరిస్తారా అని వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అలాగే బాలాకోట్‌ వైమానిక దాడులను ప్రస్తావించకుండా కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్షాల మీద మండిపడ్డారు. సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఉండే ఉగ్రవాద స్థావరాల మీద దాడులు చేయడానికి అప్పటి యూపీఏ ప్రభుత్వం అనుమతివ్వలేదని ఆరోపించారు. జమ్ముకాశ్మీర్‌ను భారత్‌ నుంచి వేరు చేయాలని చూసే, దేశంలో ఇద్దరు ప్రధానులు ఉండాలని కోరుకునే పార్టీలకు మద్దతు ఇస్తున్నారని కాంగ్రెస్‌, శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్‌సీపీని ప్రధాని దుయ్యబట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here