Featuredస్టేట్ న్యూస్

కొండంత రాగం తీసి…

వెనుకడుగు వేసిన యూనియన్లు..

˜ అంతమాత్రానికెందుకు సమ్మె..

˜ ఆగం చేసినా కార్మికుడి భవిష్యత్తు..

˜ డిమాండ్లు నేరవేరకుండానే విధుల్లోకి..

అరిచారు.. ఆవేశంతో హక్కులకోసం నినదించారు.. లాఠీదెబ్బలను భరించారు.. జీతం రాకున్నా కడుపు కాల్చుకున్నారు.. హక్కులు సాధించేవరకు వెనుకడుగు వేయమని అప్పులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు.. ప్రభుత్వం పనితీరు, ప్రభుత్వ యంత్రాంగం మాటలతో బాధ పెట్టినా ఓర్చుకున్నారు. ఆవేదన భరించలేని వారు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వ ఆర్టీసీ అంటేనే చులకనగా చేస్తుందని ఆరునూరైనా డిమాండ్లను నేరవేర్చవరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని భీష్మించుకున్నారు.. ఏమి జరిగినా, ఎన్ని ఒత్తిడులు ఎదురైనా, ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టినా సమ్మె బాట విడిచేదీ లేదన్నారు.. కాని ఏమి జరిగిందో, ఏమో తెలియదు కాని యూనియన్లనే నమ్ముకున్న వేలాది మంది కార్మికుల ఆశలను, ఆశయాలను మట్టిలో కలిసాయి. ప్రాణాలు కొల్పయిన ఉద్యోగుల ఆత్మను నిరంతరం ఘోషించేలా చేశారు. డిమాండ్లు నేరవేర్చలేనప్పుడు, పిడికిలి బిగించడం చాతకానప్పుడు సమ్మె ఎందుకు తలపెట్టానే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండు, మూడు నెలల నుంచి చిన్న జీతాలతో బతికే ఆర్టీసీ కార్మికులు అష్టకష్టాలు పడతారని ముందే తెలిసినప్పుడు సమ్మె ప్రారంభించిన వారంలోనే ముగింపు పలుకుతే బాగుండేంది. ఒక్కరూ కాదు ఇద్దరూ కాదు పదుల సంఖ్యలో ఆర్టీసీ ఉద్యోగుల ప్రాణాలు రాలిపోయాయి. ఎంతోమంది మహిళలపై లాఠీల నృత్యం చేసి రక్తాన్ని కళ్లార్రా చూశారు. ప్రతిరోజు వినూత్న కార్యక్రమాలు, నిరసనలతో తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు ఆచేతనంగా వెనుదిరిగారో అనాలో, నమ్ముకున్న యూనియన్లే వెనుదిరిగేలా చేశాయనే అనాలో అర్థం కావడం లేదు. అలుపెరగకుండా నిరంతరాయంగా సాగిన సమ్మె నిర్జీవంగా ఏలాంటి ఫలితాన్ని సాధించకుం డా ముగియడం వెనుక జరిగినా కారణాలు ఏమిటో తెలియదు కాని చివరకు ప్రభుత్వమే పైచేయి సాధించదని చెప్పవచ్చు. ఆర్టీసీ యూనియన్ల బెదిరింపులకు లంగేది లేదని, వారి డిమాండ్లకు ఒప్పుకునే ప్రసక్తే లేదని ఖరాఖండిగా చెప్పిన ప్రభుత్వం తన మాటనే నెగ్గించుకుం ది. ఉద్యోగం కావాలనుకునే వారు విధుల్లో చేరాలని చెప్పినా యూనియన్‌ నాయకులను నమ్ముకున్నా కార్మికులు మాటకు కట్టుబడి ఎవరూ ఉద్యోగాల్లో చేరలేదు. కార్మికులు మెట్టుదిగి వచ్చి విలీనా ప్రక్రియను వాయిదా వేసినా ప్రభుత్వంలో చలనం లేదు. ఇప్పుడు తామంతా ఉద్యోగాల్లో చేరబోతున్నామని, సమ్మెను ముగిస్తున్నామని యూనియన్‌ నాయకులు ప్రకటించినా ఇంకా ప్రభుత్వం నుంచి ఏలాంటి స్పందనే లేదు.. ఇన్నిరోజులు మద్దతు తెలిపినా ప్రతిపక్షాలకు, ప్రజాసంఘాలకు యూనియన్లు ఏం సమాధానం చెపుతారో తెలియదు..

తెరపడింది. కానీ దేనికోసమైతే కార్మికులు సమ్మెబాట పట్టారో అందులో ఏ ఒక్క డిమాండ్‌ కూడా నేరవేర్చకుండా సమ్మెని ముగియడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గత నలభై ఏడు రోజులుగా అలుపెెరగకుండా నిరంతరాయంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెకు ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం అటు కోర్టుల్లోనూ చుక్కెదురవుతున్న నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెను కొనసాగించాలా వద్దా అనే అంశంపై కార్మిక సంఘాల నేతలు మల్లగుల్లాలు పడ్డారని ఇప్పటికి రెండు నెలలుగా జీతాలు లేకపోవడంతో ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని అంటున్నారు. కేసు లేబర్‌ కోర్టుకు చేరడం డిమాండ్లకు సంబంధించి హైకోర్టు ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో సమ్మె కొనసాగింపు విషయంలో కార్మికుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాలు విడివిడిగా కార్మికులతో సమావేశమై అభిప్రాయాలు సేకరించినట్లు తెలుస్తోంది. వారు సేకరించిన అభిప్రాయాలను బట్టి ఆర్టీసీ జెఎసీ నాయకులంతా చర్చించారని తెలుస్తోంది. అలాగే హైకోర్టు నుంచి అందిన తుది ఉత్తర్వు ప్రతిని పూర్తిగా పరిశీలించి న్యాయవాదులతో కూడా చర్చలు జరిపారని, ఆ తరువాతనే ఈ సమ్మెపై జెఎసీ నాయకులు కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెపుతున్నారు. ఇంకా కార్మికులు బాధను చూడలేమని, ఇప్పటికి ఆర్టీసీ ఉద్యోగులు కుటుంబాలు నానా అవస్థలు పడుతున్నట్లు సమాచారం మేరకే సమ్మెకు పుల్‌స్టాప్‌ పెడుతున్నట్లు జెఎసీ నేతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే కార్మికులను ఎలాంటి షరతులు లేకుండా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని జెఎసీ నాయకులు అంటున్నారు. ప్రభుత్వంలో విలీనాన్ని వదులుకోని డిమాండ్లను పరిశీలించాలని చెప్పిన ఆర్టీసీ నాయకులు, చివరకు వాటిని కూడా వదిలేసి విధుల్లోకి వెళతామని ప్రకటించడం వెనుక అంతర్యం ఏమిటో అర్థమే కావడం లేదు. విధుల్లోకి చేరుతున్న ఆర్టీసీ కార్మికులు ఏలాంటి షరతులపై సంతకాలు పెట్టరని కేవలం డ్యూటీఫాం మీద మాత్రమే సంతకం చేస్తారని అంటున్నారు. హైకోర్టు తీర్పును తాము గౌరవిస్తున్నామని ప్రభుత్వం కూడా కోర్టు తీర్పును గౌరవిస్తుందని ఆశిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. లేబర్‌ కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. దీనిపై ఇంకా ప్రభుత్వం స్పందిచలేదు. ఇప్పటికే సిఎం కెసిఆర్‌ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన రెండు అవకాశాలను ఉపయోగించుకోలేదు. ముఖ్యమంత్రి చెప్పకముందే ఆర్టీసీ నాయకులు సమ్మె ముగింపు ప్రకటన చేశారు. ఆర్టీసీ నాయకులు ప్రకటనతో ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఏలా స్పందిస్తారో, ఏలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close