Featuredస్టేట్ న్యూస్

గులాబీ ‘మిషన్‌ లోకల్‌’

  • ఢిల్లీలో చక్రం తిప్పేది మనమే
  • జెడ్పీ ఛైర్మన్‌ పదవులను క్లీన్‌ స్వీప్‌ చెయ్యాలి
  • 32జడ్పీ స్థానాల్లో మనమే గెలవాలి
  • రెవెన్యూ చట్టంలో మార్పులు తప్పవు
  • సమన్వయంతో ముందుకెళ్లాలి
  • ముగిసిన తెరాస కార్యవర్గం విస్తృతస్థాయి భేటీ
  • మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బాధ్యతలు
  • ఆసిఫాబాద్‌ జడ్పీ ఛైర్‌పర్స్‌ అభ్యర్థిగా కోవ లక్ష్మి
  • టీఆర్‌ఎస్‌ విస్తృతస్తాయి సమావేశంలో కెసిఆర్‌ దిశానిర్దేశం

లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాయో లేదో మళ్లీ రాష్ట్రంలో ఎన్నికల హడావుడి షురూ అయింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో లాగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రజలు టీఆర్‌ఎస్‌కి బ్రహ్మరథం పడతారని కేసీఆర్‌ అన్నారు. జెడ్పీ ఛైర్మన్‌ పదవులను క్లీన్‌ స్వీప్‌ చెయ్యాలన్నారు. స్థానిక సమరంలో టీఆర్‌ఎస్‌ దే గెలుపు కావాలన్నారు. 32 జడ్పీ పీఠాలను, 530కి పైగా మండల పరిషత్‌లను కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. నెల రోజులుగా పార్లమెంట్‌ అభ్యర్థుల గెలుపుకోసం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించామని, ఇదే తరహాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేయాలి అన్నారు. ప్రజాప్రతినిధులతో పాటు, మాజీ మంత్రులు, సీనియర్‌ నాయకుల సేవలను వినియోగించుకుని ముందుకెళ్లాలి అన్నారు. ప్రజలు మనవైపే ఉన్నారని అన్నారు. 90శాతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ గెలుచుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 2 జిల్లాకు ఒకరు చొప్పున మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్‌ బాధ్యతలు అప్పగించారు. లోక్‌ సభ ఎన్నికల ఫలితాలపై ఆందోళన అవసరం అన్న కేసీఆర్‌.. 16 లోక్‌ సభ సీట్లను మనమే గెలవబోతున్నామని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గ్రామగ్రామాన ప్రచారం చేయాలని, పార్టీ విజయానికి కృషి చేయాలని కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు.

హైదరాబాద్‌: ఢిల్లీలో చక్రం తిప్పేది మనమేనని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో 16 సీట్లు టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని, ఇప్పటికే 10 రిపోర్టుల్లో ఈ విషయంతేలిందని వెల్లడించారు. తెలంగాణ భవన్‌లో తెరాస విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం ముగిసింది. గులాబీ దళపతి కేసీఆర్‌ నేతృత్వంలో జరిగిన ఈ కీలక భేటీలో జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలపై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నాయకులకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. ఆసిఫాబాద్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌గా కోవా లక్ష్మి పేరును ఖరారు చేశారు. మిగతా స్థానాల్లో పేర్లను తర్వాత ఖరారు చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 16 స్థానాలు గెలవబోతున్నామని కేసీఆర్‌ విశ్వాసం వ్యక్తంచేశారు. రెవెన్యూ, మున్సిపల్‌ శాఖలను ప్రక్షాళన చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా సీఎం నేతలకు వివరించినట్టు తెలుస్తోంది. రెవెన్యూ చట్టంలో సమూల మార్పులు తప్పవని సీఎం అన్నారు. రాష్ట్రంలో మొత్తం 32 జడ్పీ, 530కి పైగా మండల పరిషత్‌ స్థానాలను కైవసం చేసుకోవాలని కేసీఆర్‌ సూచించారు. పరిషత్‌లకు పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ అప్పగించారు. రెండు జిల్లాలకు ఒక్కరు చొప్పున మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలను కో-ఆర్డినేటర్లుగా నియమించారు. ఈ సందర్భంగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కోవాలక్ష్మి పేరును ఆసిఫాబాద్‌ జెడ్పీచైర్మన్‌ పదవికి కేసీఆర్‌ ప్రకటించారు. నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, కొత్త వారికి అవకాశాలు వస్తాయని నేతలకు ఆయన హావిూ ఇచ్చారు. రెవెన్యూ, మున్సిపల్‌ శాఖలను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని కేసీఆర్‌ చెప్పారు. మండల పరిషత్‌లలో బాధ్యతలను ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు చూసుకోవాలని సూచించారు. అభ్యర్థుల ఎంపిక, కార్యవర్గం ఏర్పాటు తదితర ప్రక్రియ పూర్తయ్యేవరకూ అవసరమైన ఏర్పాట్లన్నీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలన్నారు. రెవెన్యూ, మున్సిపల్‌ చట్టాలపై సీఎం కీలకంగా చర్చించినట్టు తెలుస్తోంది. రెవెన్యూ వ్యవస్థను రద్దుచేస్తే ఎలా ఉంటుందనే అంశంపై సీఎం సీనియర్‌ నేతలతో అభిప్రాయం తీసుకున్నారు. రెవెన్యూ వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయని, వాటి స్థానంలో కొత్త చట్టం తీసుకురావడం మంచిదనివారు చెప్పినట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు సీఎం స్పష్టంచేసినట్టు సమాచారం. రాష్ట్రంలో 535 జెడ్పీటీసీ సభ్యుల స్థానాలకు, 5857 ఎంపీటీసీ సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిని పార్టీ ప్రాతిపదికన పార్టీల గుర్తులపై నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో.. జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సోమవారం నాటి సమావేశంలో విస్తృతంగా చర్చించారు. గత డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటర్లు విస్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఇటివల జరిగిన గ్రాపంచాయతీ ఎన్నికల్లో దాదాపు 80 శాతానికిపైగా టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ క్లీన్‌స్వీప్‌ చేస్తుందని సర్వేలు, నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరిషత్‌ ఎన్నికల్లోనూ ఏకపక్ష విజయం ద్వారా అన్ని స్థాయిల్లో టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు ఉంటే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సజావుగా, వేగంగా సాగుతాయని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఇందుకోసం పార్టీ నాయకులు అన్ని స్థానాలను కైవసం చేసుకునేలా కృషిచేయాలని ఈ సమావేశంలో దిశానిర్దేశం చేశారు.

ఆసిఫాబాద్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌గా కోవా లక్ష్మి పేరును ఖరారు చేశారు. మిగతా స్థానాల్లో పేర్లను తర్వాత ఖరారు చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 16 స్థానాలు గెలవబోతున్నామని కేసీఆర్‌ విశ్వాసం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో మొత్తం 32 జడ్పీ, 530కి పైగా మండల పరిషత్‌ స్థానాలను కైవసం చేసుకోవాలని కేసీఆర్‌ సూచించారు. ఒక్కో జిల్లా పరిషత్‌కు ఓ సీనియర్‌ నేతకు బాధ్యతలు అప్పగించారు. మండల పరిషత్‌లలో బాధ్యతలను ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు చూసుకోవాలని సూచించారు. అభ్యర్థుల ఎంపిక, కార్యవర్గం ఏర్పాటు తదితర పక్రియ పూర్తయ్యేవరకూ అవసరమైన ఏర్పాట్లన్నీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలన్నారు.రెవెన్యూ, మున్సిపల్‌ శాఖలను ప్రక్షాళన చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా సీఎం నేతలకు వివరించినట్టు తెలుస్తోంది. రెవెన్యూ చట్టంలో సమూల మార్పులు తప్పవని సీఎం అన్నారు. రెవెన్యూ, మున్సిపల్‌ చట్టాలపై సీఎం కీలకంగా చర్చించినట్టు తెలుస్తోంది. రెవెన్యూ వ్యవస్థను రద్దుచేస్తే ఎలా ఉంటుందనే అంశంపై సీఎం సీనియర్‌ నేతలతో అభిప్రాయం తీసుకున్నారు. రెవెన్యూ వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయని, వాటి స్థానంలో కొత్త చట్టం తీసుకురావడం మంచిదనివారు చెప్పినట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు సీఎం స్పష్టంచేసినట్టు సమాచారం.

ఈ కార్యవర్గ సమావేశానికి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, కార్యవర్గ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలుగా పోటీ చేసిన అభ్యర్థులు, రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై విస్తృతంగా చర్చించారు. జడ్పీ చైర్మెన్‌ ల ఎన్నికల బాధ్యతను మంత్రులకు అప్పగిస్తూ కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. మంత్రుల గెలుపు కోసం ఎమ్మెల్యేలు కష్టపడినట్లుగా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీలను ఊరూరా తిరిగి గెలిపించాలని మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు.
Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close