Featuredరాజకీయ వార్తలు

కాంగ్రెస్‌ లో గులాబీ కోవర్టులు..!

? ఆంధ్రాలో గిడుగు రుద్రరాజు

? తెలంగాణలో శ్రీధర్‌ బాబు

? బలహీన అభ్యర్థులకై ఢిల్లీలో పడిగాపులు

(రమ్యాచౌదరి, ఆదాబ్‌ హైదరాబాద్‌)

సుధీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో కొందరు కోవర్ట్‌ ఆపరేషన్‌ మొదలెట్టారు. బలహీనంగా ఆ పార్టీని తెలుగు రాష్ట్రాల్లో మరింత దెబ్బతీసే పథకరచన జరిగింది. ఈ మేరకు కొందరు సీనియర్‌ నాయకులు సరిపడా డబ్బు సంచులతో ఢిల్లీలో వాలిపోయి పడిగాపులు పడుతున్నారు. ఈగ్భ్భ్రాంతికరమైన విషయాలు నిజమైన కార్యకర్తలకు ‘సైనైడ్‌’ లాంటివే. అందుకే అసలు గుట్టు విప్పుతున్నాం. ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ అందిస్తున్న పరిశీలన కథనం.

అసలేం జరుగుతుంది:

తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీని ముసలి, ముతక ఆలోచనలతో మడతబెట్టరు. బాగానే డబ్బులు దండుకున్నారనే ఆడియోలు చక్కెర్లు కొట్టాయి. తాజాగా బలహీన పడ్డ కాంగ్రెస్‌ పార్టీని మరింత దెబ్బ… కోలుకోలేనంతగా కొట్టాలని అక్కడి ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

గట్టి నాయకులు ఎవరు.?

ఇప్పుడున్న పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి అధ్యక్ష పదవి పల్లంరాజుకే అవకశాలు ఉన్నాయి. తెలంగాణలో మిగిలింది ఒక్క రేవంత్‌ రెడ్డి మాత్రమే. ఈ ఇద్దరూ వస్తే.. మళ్ళీ కాంగ్రెస్‌ పుంజుకుంటుందనే అంతర్గత ఆందోళనలు రెండు రాష్ట్రాల అధిపతులకు సహజంగా ఉన్నాయి. ఇరు రాష్ట్రాల వారధిలా ఉండే కేవిపీ రామచందరావు లాంటి ఓ పెద్దమనిషిని రంగంలోకి కొందరు దించారు.

ఆయన పని ఏమిటంటే..:

ఆంధ్రప్రదేశ్‌ నుంచి పల్లంరాజు తెలంగాణ నుంచి రేవంత్‌ రెడ్డి లు తప్ప మరొక బలహీన అభ్యర్థులను ఎంపిక చేసే పని ఆ ‘ఆత్మ’కు అప్పగించారు.

వీళ్ళు అయితే..:

ఆంధ్రప్రదేశ్‌ పిసిసికి గిడుగు రుద్రరాజు, తెలంగాణ పిసిసికి శ్రీధర్‌ బాబు పేర్లను తెరవిూదకు తెచ్చారు. ఇందుకోసం ఓ ‘ఆత్మ’ అదే పనిగా ‘మెగా’ డబ్బు సంచులతో ఢిల్లీలో మకాం పెట్టారు. మరి సంచులు తీసుకొని బలహీనతలతో మన్ను తిన్న పాములా ఉంటారో… లేక సింహంలా గర్జించే నాయకులను ముందుకు తెచ్చి పగ్గాలు అప్పగిస్తారో వేచి చూడాలి.

‘మెగా’ 109 కోట్ల పంచాయతీ..:

ఎన్నికల సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ పారిశ్రామికవేత్త ఖాతా నుంచి ఓ జాతీయ పార్టీకి వందకోట్ల లావాదేవీలు జరిగినట్లు ఆదాయపన్ను శాఖ అధికారులు గుర్తించారు. ఆదే ‘మెఘా’ ఇక్కడ కూడా డబ్బు సర్థుతున్నారా..? అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఏదిఏమైనా కాంగ్రెస్‌ పార్టీ ఇకనైనా జాగ్రత్త పడకపోతే… భవిష్యత్తులో అంధకారం ఇప్పుడే అందుబాటులోకి వస్తుంది.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close