అవన్నీ అబద్ధాలే అంటున్న హీరోయిన్‌ అమ్మగారు!

0

హీరోయిన్‌ త్రిష ఆరోగ్యం సరిగా లేదని గత రెండు మూడురోజులుగా కోలీవుడ్‌ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. త్రిష ప్రస్తుతం ‘రాంగీ’ అనే తమిళ చిత్రం షూటింగ్‌ లో పాల్గొంటోంది. అయితే రెండు రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్‌ సమయంలో త్రిష స్ప హ తప్పి పడిపోయిందట.. అక్కడి నుండి ఆమెను హాస్పిటల్‌ కు తీసుకెళ్ళారని..ఇంకా డిస్‌ ఛార్జ్‌ చెయ్యలేదని వార్తలు వచ్చాయి. త్రిషకు ఏదో తీవ్రమైన ఆరోగ్య సమస్య ఉందని కూడా ప్రచారం సాగింది. ఈ విషయంపై స్పందించిన త్రిష అమ్మగారు ఉమా క ష్ణన్‌ ఇవన్నీ పుకార్లు మాత్రమేనని కొట్టిపారేశారు. త్రిషకు ఎటువంటి ఆరోగ్య సమస్య లేదని ఇలాంటి అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని అభిమానులను కోరారు. ‘రాంగి’ షూటింగ్‌ ఎటువంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగుతోందని కూడా ఆమె తెలిపారు. దీంతో రెండు మూడు రోజులుగా త్రిష ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. త్రిష ప్రస్తుతం నటిస్తున్న ‘రాంగి’ సినిమాకు దర్శకుడు మురుగదాస్‌ శిష్యుడు శరవణన్‌. ఈ సినిమా కాకుండా ‘పరమపదం విలయాట్టు’.. ‘1818’ అనే సినిమాల్లో కూడా నటిస్తోంది. పోయినేడాది ’96’ లాంటి సూపర్‌ హిట్‌ సాధించిన త్రిష.. ఈ ఏడాది ‘పేట’ తో హిట్‌ సాధించింది. తెలుగులో త్రిష ఫేడ్‌ అవుట్‌ అయింది కానీ తమిళంలో మాత్రం చేతిలో ఆఫర్లు ఫుల్‌ గానే ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here