రాజీవ్‌ వర్ధంతికి నివాళి

0

  • కార్యక్రమంలో పాల్గొన్న సోనియా, రాహుల్‌, ప్రణబ్‌ తదితరులు

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలో పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. రాజీవ్‌ స్మారకంవీర్‌భూమి వద్ద యూపీఏ ఛైర్‌ పర్సన్‌ సోనియా గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, మాజీ ఉపరాష్ట్రపతి హవిూద్‌ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ప్రియాంకా గాంధీ తదితరులు ఘనంగా నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా రాజీవ్‌కు నివాళి అర్పించారు. ప్రధాని మోడీ ట్విట్టర్‌లో నివాళి అర్పించారు. ఇదిలావుంటే మాజి ప్రధాని రాజీవ్‌ గాంధీ వర్ధంతి సందర్భంగా.. మంగళవారం ఉదయం పాలకొల్లు కాంగ్రెస్‌ కార్యాలయంలో రాజీవ్‌ గాంధీ చిత్రపటానికి పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షులు ఎడ్ల శివాజీ పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. పాలకొల్లు నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి వర్థిని డి.బాబీ మాట్లాడుతూ… రాజీవ్‌ హయాంలో జవహర్‌ రోజ్గార్‌ యోజన కింద పట్టణాలు, గ్రామాల్లో పక్కా రహదారులు వేసినట్లు చెప్పారు. కమ్యూనికేషన్స్‌ రంగంలో కూడా రాజీవ్‌ హయాంలోనే అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు కొలుకులూరి అర్జున్‌ రావు, భవనం వెంకట్రావు, కూర గంజి హరికిరణ్‌, దూడే సుబ్బారావు, మహమ్మద్‌ జానీ, ప్రజలు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ వెదురుకుప్పం మండల కేంద్రంలో రాజీవ్‌ గాంధీ వర్ధంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గ కాంగ్రెస్‌ ఎంఎల్‌ఎ అభ్యర్థి డాక్టర్‌ సోడెం నరసింహులు, డిసిసి ఉపాధ్యక్షుడు పోటుగారి భాస్కర్‌, హుమేష్‌, వెంకటేష్‌, విక్టర్‌, జయచంద్ర, దాసు పాల్గన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here