Featuredస్టేట్ న్యూస్

ప్రయాణీకుల ప్రాణాలు హరీ..

  • సందికి రాని ఆర్టీసీ సమ్మె..
  • అద్దె బస్సులలో పోతున్న ప్రాణాలు..
  • ప్రయాణమంటేనే వణుకుతున్న ప్రజలు
  • అత్మహత్యలుగా మారుతున్న తెలంగాణ..

సమ్మె ఎన్ని రోజులైనా చేసుకొండి.. ప్రభుత్వానికి సంబంధమే లేదు.. ప్రభుత్వంపైననే సమ్మె అంటూ తిరుగుబాటు చేస్తారా అని ప్రభుత్వం అగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆర్టీసీ వారిని చర్చలకు పిలిచే ప్రసక్తే లేదంటూ ప్రభుత్వం మొండికేసింది. ప్రజల కోసం, ఉద్యోగుల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వం తమ ఇష్టానుసారంగా మాట్లాడేసరికి ఆర్టీసీ ఉద్యోగులు వెనకడుగు వేయకుండా సమ్మెను మరింత ఉదృతం చేశారు. ప్రయాణీకులకు ఏలాంటి ఇబ్బందులు రావొద్దని ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను, అద్దె బస్సులను మరింతగా పెంచింది. బస్సులను ఎవ్వరూ ఆపిన కఠినచర్యలు తీసుకొవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇబ్బడిముబ్బడిగా బస్సులను నడుపుతున్న ప్రభుత్వ అధికారులు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. అభం, శుభం తెలియని ప్రయాణీకుల ప్రాణాలను తీస్తున్నారు. ఇరవై ఐదు రోజుల నుంచి కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెలో యాభైకి పైగా రోడ్డు ప్రమాదాలు జరిగి, పదులు సంఖ్యలో ప్రాణాలు కొల్పొయినట్లు తెలుస్తోంది. ప్రాణాలు కొల్పొయిన, రోడ్డు ప్రమాదాలకు గురైన ప్రయాణీకులను ఎవ్వరూ అదుకుంటారో ఇప్పుడు అర్థం కావడం లేదు. ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వం ప్రజలు ఇంతగా ఇబ్బందులు పడుతున్న తమకేమి సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తోందని ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరొపక్క ఉన్న ఉద్యోగం పోయిందని, మళ్లీ ఉద్యోగం వస్తుందో, రాదో అని భయంతో ప్రాణాలను బలితీసుకుంటున్న ఉద్యోగుల సంఖ్య పెరిగిపోతుంది. ప్రభుత్వ అనుసరిస్తున్న విధానంపై హైకోర్టు ఘాటుగా చురకలు వేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంది.

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌:

తెలంగాణలో ప్రజలు ఇంతగా ఇబ్బంది పడుతున్న, ప్రయాణం చేయడానికి భయపడుతున్న ప్రభుత్వంలో మాత్రం ఏలాంటి మార్పు రావడం లేదు. ఉద్యోగులు ఎవరెన్ని రోజులైనా సమ్మె చేసుకున్నా తమకు సంబంధమే లేదన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రయాణీకులు ఏలాంటి ఇబ్బందులకు గురికావద్దని తాత్కాలిక డ్రైవర్లతో ప్రభుత్వం బస్సులను నడిపిస్తూనే ఉంది. ప్రయాణీకులకు ఎంతో కొంత ఉపశమనం కలిగిందనుకుంటున్న సమయంలో తాత్కాలిక బస్సు డ్రైవర్లు అనుభవరాహిత్యానికి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆర్టీసీ బస్సుల డ్రైవింగ్‌ లపై అవగాహన లేకపోవడం, రూట్లు తెలియకపోవడం, చాలా మంది డ్రైవర్లు తాగి బస్సులు నడుపుతుండడంతో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. గత ఇరవై నాలుగు రోజుల్లోనే యాభై వరకు రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కొల్పొయారు, గాయాలపాలై మంచాలకే పరిమితమైనవారు ఉన్నారు. రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుగుతుండడంతో ప్రయాణాలు చేసే ప్రయాణీకులు బస్సు ఎక్కాలంటేనే భయపడుతున్నారు. మామూలు రోజుల్లో ఆర్టీసీ నడిచేటప్పుడు ప్రమాదాలు చాలా తక్కువ, ప్రతి లక్ష కిలోమీటర్‌ కు 0.06 శాతం మాత్రమే ప్రమాదాలు జరిగేవి. కాని ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఏదో ఒక రోజు ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్న ప్రభుత్వం మాత్రం వీటిపై ?స్పందించడమే లేదు. ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కేలేదని అందుకే తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పెరుగుతున్న ఆర్టీసీ బలిదానాలు..

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే వచ్చే లాభాల గురించి అదే పనిగా ఏకరువు పెట్టే ఊపిరాడకుండా ఉపన్యాసం చెప్పిన నాయకుడు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌. ఉద్యమనేతగా అప్పట్లో ఆయన నోటి నుంచి వచ్చే మాటలు యావత్‌ తెలంగాణను ఒక ఊపు ఊపేసేవి. మన తెలంగాణలో మన ప్రభుత్వం అధికారంలో ఉంటే మన బిడ్డల కష్టాలు మనకు మించి బాగా మరెవరికి అర్థమవుతాయన్న మాటలు వినిపించేవి. అందరూ అనుకున్నట్లుగానే తెలంగాణ వచ్చింది. ప్రజలు కోరుకున్న ప్రభుత్వం కొలువు తీరింది. కాని అందరూ కలలుకన్నట్లుగానే ఒక్క కల నేరవేరిందీ లేదు. ఇరవైఐదు రోజులుగా తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తుంటే సర్కారు నుంచి సానుకూలత రాకపోగా షాకింగ్‌ వ్యాఖ్యలు సీఎం నోటి నుంచి వస్తున్న తీరు నోట మాట రాకుండా చేస్తోంది. తెలంగాణ ఉద్యమ వేళలో తాము కలలు కనే ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం బలిదానాలు చేసేవారు. ఇలాంటివేళ కేసీఆర్‌ నోట నిప్పుల్లాంటి మాటలు వచ్చేవి. దరిద్రపుగొట్టు రాష్ట్రంలో తమ వారిని పీక్కుతింటున్న రాబంధుల్లాంటి ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పు పట్టేవారు కేసీఆర్‌. అలాంటి ఆయనే ప్రభుత్వాధినేతగా మారటం తెలిసిందే. పోరాడి సాధించుకున్న తెలంగాణలో తాజాగా చేస్తున్న ఆర్టీసీ సమ్మె 24 రోజుకు చేరుకోవటమే కాదు ఇప్పటివరకే తమ భవిష్యత్తు మీద నిరాశ మేఘం కమ్ముకొని కొందరు ప్రాణత్యాగం చేస్తే, మరికొందరు తమ చావుతోనైనా ప్రభుత్వం కళ్లు తెరుస్తుందన్న ఉద్దేశంతో ఆత్మ బలిదానాలు చేసుకోవటం ప్రారంభమయ్యింది. అలాంటి ఉదంతమే మరొకటి ఖమ్మంలో చోటు చేసుకుంది. ఖమ్మం పట్టణానికి చెందిన డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డి బలవన్మరణ విషాదం నుంచి ఇంకా కోలుకోకముందే అదే జిల్లాకు చెందిన సత్తుపల్లి డిపోలో కండక్టర్‌ గా పని చేస్తున్న నీరజ తాజాగా ఆత్మహత్య చేసుకున్నారు. తాను పని చేస్తున్న ఉద్యోగం ఉంటుందో, ఉండదనో వేదనతో ఆమె ఇంట్లోనే ఉరి వేసుకొని తనువు చాలించారు. గడిచిన 24 రోజులుగా సమ్మెలో పాల్గొంటున్న ఆమె ఉద్యోగం ఉంటుందా? ఉండదా? అన్న భయాందోళనలకు గురైన ఆమె తాజాగా ఇంట్లో ఊరి వేసుకున్నారు. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఉదంతం తీవ్ర విషాదాన్ని నింపింది. పోరాడి సాధించుకొని తెచ్చుకున్న తమ రాష్ట్రంలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని సీఎం పట్టించుకోని వైనంపై వేదన చెందుతున్న కార్మికులు ఇలా బలిదానాలు చేసుకోవటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close