Featuredప్రాంతీయ వార్తలుస్టేట్ న్యూస్

సకాలంలో మేయర్ స్పందించడంతో సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు

గత అర్థరాత్రి బంజారాహిల్స్ రోడ్ నెం-45 మార్గంలో ప్రమాదవషత్తు కారు ప్రమాదానికి గురికాగా అదే మార్గంలో ప్రయాణిస్తున్న నగర మేయర్ బొంతు రామ్మోహన్ సకాలంలో స్పందించడంతో కారులో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బయటపడ్డారు. వివరాలకు వస్తే…నగరంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు పనులను గత రాత్రి నగర మేయర్ బొంతు రామ్మోహన్ తనిఖీ నిర్వహిస్తున్నారు. అదే సమయంలో రోడ్ నెం-45లో ముగ్గురు ప్రయాణికులతో కూడిన ప్రైవేట్ ట్యాక్సీ కారు వేగంగా వెళుతూ అదే మార్గంలో దెబ్బతిన్న నాలాలో ఇరికిపోయింది. హైదరాబాద్ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆద్వర్యంలో పురోగతిలో ఉన్న ఈ రోడ్డు పునరుద్దరణ నాలాలో ఇరుక్కున్న కారును అదే మార్గంలో తనిఖీలు నిర్వహిస్తున్న మేయర్ రామ్మోహన్ వెంటనే గమనించి సమీపంలోని జె.సి.బి సహాయంతో కారును వెలికి తీయడంతో అందులో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి గురైన తమను సకాలంలో స్పందించి కాపడానిన మేయర్ రామ్మోహన్ కు కారులో ప్రయాణిస్తున్నవారు క్రుతజ్జతలు తెలిపారు

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close