పారదర్శకమైన ఏకీకృత

0

ఖమ్మం,(ఆదాబ్‌ హైదరాబాద్‌):ఏ పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లిన ఒకేవిధమైన స్పందన, పారదర్శకమైన ఏకీకృత సేవలను విస్తరింపజేయడం పోలీసుల లక్ష్యమని పోలీస్‌ కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌ అన్నారు. ఖమ్మం రూరల్‌ డివిజన్‌లో 14 ఫంక్షనల్‌ వర్టికల్‌ ను పకడ్భందిగా అమలు చేయడంలో ప్రతిభ చూపిన పోలీస్‌ సిబ్బందిని ప్రోత్సాహించేదుకు శనివారంఖమ్మం రూరల్‌ డివిజన్‌ పోలీసుల ఆద్వర్యంలో రివార్డ్‌ మెళా..కు నగరంలోని రామ్‌ లీలా ఫంక్షన్‌ హల్‌లో ప్రత్యేక కార్యక్ర మం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి హజరైన పోలీస్‌ కమీషనర్‌ మాట్లాడుతూ ..ప్రజలు తమ అవసరాల కోసం ఏర్పరుచు కున్న ఈ పోలీస్‌ వ్యవస్థను వారి ఆశయాలకు అనుగుణంగా ప్రజల ఆత్మగౌరవనికి భంగం కలగకుండా సేవ చేయాలనే సమాజిక స్పహ ప్రతి ఒక్కరిలో వుండాలని సూచించారు. ”వన్‌ స్టేట్‌ -వన్‌ సర్వీస్‌ – వన్‌ ఎక్సిపిరేన్స్‌ ఫర్‌ అల్‌ సిటిజెన్‌ ఎట్‌ అల్‌ టైం..”.అనే విధానాన్ని జిల్లా వ్యాప్తంగా అమలు చేయాలని తద్వారా పోలీస్‌ వ్వవస్థ పై ప్రజలకు మరింత గౌరవం పెరుగుతుందన్నారు. ప్రతి పోలీస్‌ కానిస్టేబుల్‌ , హోంగార్డ్‌, పోలీస్‌ అధికారి లక్ష్యాన్ని సాధించలంటే కమిట్‌ మెంట్‌ తో పాటు రోల్‌ క్లారిటీ వుండాలని, అందుకు అవసరమైన 14 ఫంక్షనల్‌ వర్టికల్స్‌ ను సద్వినియోగం చేసుకొవాలని సూచించారు. ఇప్పటికే జిల్లా పోలీసుల సమిష్టి కృషితో పలు కీలకమైన కేసుల్లో నిందుతులకు శిక్షలు పడుతున్నాయని అన్నారు. పోలీస్‌ శాఖ లో పని చేస్తున్న ప్రతిఒక్కరికి పని విభజన చేసి ఖచ్చితమైన బాధ్యతలు అప్పగించటం, తద్వారా తనకు అప్పగించిన పని తానే చేయాలనే తపనతో పాటు మానసిక ధైర్యం, జవాబుదారీ తనం వ్యక్తిగత సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని అలాగే ప్రజల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించే నాయకత్వ లక్షణాలు అలవర్చుకొవాలనే తపన ప్రతి ఒక్కరిలో వస్తుందని అన్నారు. రాష్ట్ర డీజిపి ఆద్వర్యంలో గత ఐదేళ్ళలో ఎక్కడ కూడ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అంకితభావం, రిసోర్స్‌, టెక్నాలజీ, ఫీడ్‌ బ్యాక్‌ ద్వారా గణనీయమైన ఫలితాలు సాధించామని, ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ద్వారా డయల్‌ 100 కాల్స్‌కు వేగవంతంగా స్పందించి ఐదు నిమిషాలలో ఆయా గమ్యస్థానాలకు చేరుకొవడం ద్వారా ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించడానికి దోహదపడినట్లు తెలిపారు. ఆనంతరం 14 ఫంక్షనల్‌ వర్టికల్స్‌ ఆంశాలతో కూడిన పుస్తకాలను ఆవిష్కరించి సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా రిసెప్షన్‌ స్టాప్‌, స్టేషన్‌ రైటర్స్‌, క్రైమ్‌ రైటర్స్‌, బ్లూ కోల్ట్స్‌, పెట్రోలింగ్‌, కోర్టు డ్యూటీ ఆఫీసర్‌, టెక్నికల్‌ టీమ్‌, క్రైమ్‌ స్టాప్‌ తదితర 14ఫంక్షనల్‌ వర్టికల్స్‌ అమలులో ప్రతిభ చూపిన సిబ్బందికి పోలీస్‌ కమీషనర్‌ చేతుల మీదుగా రివార్డ్‌ లు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్‌ డిసిపి లా ఆర్డర్‌ మురళీధర్‌, రూరల్‌ ఏసిపి రామోజీ రమేష్‌, సిఐలు రమేష్‌, సాంబరాజు, మురళీ, శివసాంభిరెడ్డి పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here