Featuredస్టేట్ న్యూస్

ట్రాన్స్ఫార్మర్ల రక్షణ కంచె పేరుతో… నిధులను మింగేసిన అక్రమార్కులు

చేయని పనులను చేసినట్లు చూపించి ప్రజాధనాన్ని లూటీ

బడ్జెట్‌లో రక్షణ పేరుతో నిధులు మార్కెట్‌లో స్క్వేర్‌ ఫీట్‌ రూ: 28 నుండి 34

అక్రమార్కులు చూపిస్తుంది రూ: 384.

హైదరాబాద్‌ (ఆదాబ్‌హైదరాబాద్‌): ట్రాన్స్ఫార్మర్స్‌ దగ్గర రక్షణ కంచె ఏర్పాటు పేరుతో నిధులను మింగేసిన అక్రమార్కులు. తెలంగాణ స్టేట్‌ సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ లో విద్యుత్‌ ఇంజనీర్లు గుత్తేదారులు కుమ్ముక్కై లక్షల్లో ప్రజా సొమ్మును గుడుక్కు మని స్వాహా చేసిన అధికారులు. మెదక్‌ డివిజన్‌లో స్క్వేర్‌ ఫీట్‌ 56 రూపాయలకు నామినేషన్‌ మీద వర్క్‌ ఆర్డర్‌ ఇవ్వడం జరిగింది. వర్క్‌ ఆర్డర్‌ ప్రకారం పనులను పూర్తిచేయడం జరిగింది. ఇదే పని వేరే డివిజన్‌లో ఇంజనీర్లు గుత్తి దారులతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని స్క్వేర్‌ ఫీట్‌ 125 రూపాయలకు నామినేషన్‌ పై వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చారు. అంటే సుమారు 69 రూపాయలను అధికంగా నిర్ణయిస్తూ పనులను ఇవ్వడం జరిగింది. తిరిగి ఇదే పనిని మరో డివిజన్‌లో స్క్వేర్‌ ఫిట్‌ 284 రూపాయలకు ఇచ్చారు. మేము ఎమైన తక్కువ తిన్నామా అని వికారాబాద్‌ ఇంజనీర్‌ స్క్వీర్‌ ఫీట్‌ 384 రూపాయలకు నామినేషన్‌ పై ఇచ్చారు.

అంటే అధికారులు ఒకే విధమైన పనులను వారి స్వార్థ ప్రయోజనాల కోసం గుత్తి దారుల తో కుమ్ముక్కై నామినేషన్ల పేరుతో వారికి అనుకూలమైన వ్యక్తులకు పనులను అప్ప చెప్తూ లక్షల రూపాయలు ప్రజాధనాన్ని దోచుకోవడం జరిగింది. సమాచార హక్కు చట్టం ద్వారా వీరి అవినీతి బాగోతం బట్ట బయ లైంది. కొన్ని చోట్ల గుత్తేదా రులు ఎలాంటి పనులు చేయకుండానే లక్షల రూపా యల బిల్లు పెట్టి నొక్కేశారు. మెదక్‌ లో 56 చద రపు అడుగుల కంచె ను ఏర్పాటు చేసి 14 58 అడు గులు కం చెను ఏర్పాటు చేసి నట్లు చూయించి 96 వేల రూపాయలు దండుకున్నారు. జోగిపేట సర్కి ల్లో కంచె వేయాల్సిన విస్తీర్ణ 616 గా చూపించి 90 వేల డబ్బులను కాజేశారు. అడ్డగోలుగా వారి ఇష్టం వచ్చినట్లు గుత్తేదారుల, ఇంజనీర్లు కలిసి ప్రజాధనాన్ని లూటీ చేశారు. వాస్తవంగా ఫెన్సింగ్‌ రాణి గంజ్‌లో కిలోల లెక్క ఉంటుంది. స్క్వేర్‌ ఫీట్‌ 28 నుండి 34 రూపాయలకు వస్తుంది. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసినా తెలియనట్లు నటిస్తూ పరోక్షంగా సహకరించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇంత జరుగుతున్న నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు వ్యవహరించడం పట్ల సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇకనైనా తెలంగాణ స్టేట్‌ సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ లో రక్షణ పేరుతో జరిగిన అవినీతిపై ప్రభుత్వం ప్రజాధనాన్ని లూటీ చేసిన అధికారులను తక్షణమే విధుల నుండి తొలగించి, వారి నుండి ప్రజా సొమ్మును రికవరీ చేయవలసిందిగా సంఘాలు కోరుతున్నాయి.

మరిన్ని విషయాలపై తెలంగాణ స్టేట్‌ సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌లో జరుగుతున్న అవినీతి అక్రమాల గుట్టుపై ప్రత్యేక కథనం త్వరలో మీ ఆదాబ్‌ హైదరాబాద్‌లో…

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close