బదిలీలే ఆయనకు బహుమానం..

0

20 సంవత్సరాలలో 52 సార్లు ట్రాన్స్‌ ఫర్‌..

పిఎం చెప్పిన, సిఎం చెప్పిన మాట వినడు

అశోక్‌ ఖేర్కాపై ఆదాబ్‌ ప్రత్యేక కథనం..

చేస్తున్న ఉద్యోగానికి న్యాయం చేయాలి. ప్రజలు పన్నులతో ఇస్తున్న జీతానికి సక్రమంగా విధులు నిర్వహించాలి. ప్రధానమంత్రి ఐనా, ముఖ్యమంత్రి ఐనా ఎవరైనా కాని ప్రజలు సొమ్ముతో బతికే వారే, ప్రజల కష్టపడి కట్టే పన్నుల అందరికి జీతాలే అలాంటి జనాలకోసం పనిచేయాలి. అందరికి ప్రభువులు, నాయకులు ఈ ప్రజలే.. వాళ్లకు మాత్రమే మనం జవాబుదారులు. ఎవరెలా పని చేసిన, నేను మాత్రం నా విధులు నీతిగా, నిజాయితీగా నిర్వర్తిస్తాను. నా విధులకు ఎవ్వరూ ఆటంకం కలిగించినా ఊరుకునేది లేదు. ప్రజలకు సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వం బాధ్యత. నా బాధ్యతను నిర్వర్తించడంలో నేను ఎప్పుడు నిక్కచ్చిగా ఉంటాను. ప్రాణం పోయిన ఆబద్దమాడెదీ లేదు. అవినీతికి పాల్పడే అవకాశం లేదు. ఒక అధికారి మాట వినకుంటే బదిలీ చేస్తారెమో కాని విధుల నుంచి తప్పించే అధికారం ఎవ్వరికి లేదంటూ ముక్కుసూటిగా పనిచేస్తూ అవినీతిపరులను ఆటాడుకుంటున్న ఆ అధికారికి నిజంగా సెల్యూట్‌ కొట్టాలి. ఆయన నిజాయితీగా మెచ్చిన మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇరవై సంవత్సరాలలో 52 సార్లు బదిలీ చేసిందీ.. ఐనా మాట వినేదీ లేదు, చేసే పనిలో రాజీ పడే ప్రసక్తే లేదంటున్నారు సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి అశోక్‌ ఖేమ్కా…

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌..

నిజాయితీ అధికారులను దీపం పెట్టి వెతకాల్సి వస్తుందీ. ప్రతి నెల ప్రభుత్వం వేలకు వేలు జీతాలు ఇచ్చి, అనేక సదుపాయాలు కల్పిస్తే మళ్లీ అవినీతికే వంత పాడే వాళ్లే అధికంగా ఉన్నారు. డబ్బు సంపాదనే ధ్యేయంగా కొంతమంది ఉంటే, తప్పని పరిస్థితుల్లో కొంతమంది అలవాటుపడుతున్నారు. ఇంకొంతమంది ప్రళయం వచ్చిన మాట తప్పేదీ లేదు, తప్పు చేసేది లేదంటూ వారి పని వారూ చేస్తూ పోతున్నారు. అలాంటి కోవలో ఉండే అధికారులు తక్కువైనా నిక్కచ్చిగా ఉంటున్నారు. మోడీ ప్రభుత్వ హయాంలో అవినీతి అన్నది లేదని, కుంభకోణాలు అస్సలే జరగలేదనే మాట జోరుగా వినిపిస్తున్న వేళ, పలు అవినీతి కుంభకోణాలతో పాటు అత్యంత దుమారం లేపే రాఫెల్‌ స్కాం బయటికి వచ్చింది. కొందరైతే ఏకంగా బిజెపికి, కాంగ్రెస్‌ కు పెద్ద తేడా లేదని, రెండు పార్టీల పాలన ఓకేలా ఉందని మండిపడే వారు ఉన్నారు. దానికి తోడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ కాని, బిజెపి పార్టీ కాని నీతిగా, నిజాయితీగా, ముక్కుసూటిగా పనిచేసే అధికారులపై బదిలీ వేటు తప్పదని రెండు పార్టీలు, ఇద్దరూ నాయకులు నిరూపించారు. 1991 బ్యాచ్‌ కు చెందిన సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి అశోక్‌ ఖేమ్కా ఆయన చేసే విధుల్లో తప్పులేకుంటే ఎవ్వరి మాట వినరు. అలాంటి అధికారిని ఇప్పటివరకు 52 సార్లు బదిలీ చేశారు. ఆయన హర్యానా కేడర్లో పనిచేస్తున్నారు. తాజాగా జరిగిన తొమ్మిది మంది ఐఎఎస్‌ అధికారుల బదిలి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో ముక్కుసూటి మనిషిగా పేరున్న అశోక్‌ ఖేమ్కా పేరు కూడా ఉండడంతో అంత ఆసక్తికరంగా మారిపోయింది. ఆయన్ని ఎందుకు బదిలీ చేశారనే విషయం మళ్లీ చర్చనీయాంశమయింది. 1991 బ్యాచ్‌ కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అశోక్‌ ఖేమ్కా తాజాగా మరోసారి బదిలీ అయ్యారు. ఆయన ఇప్పటివరకూ 52 సార్లు బదిలీ అయ్యారు. హర్యానా కేడర్లో పని చేసే ఆయన తాజాగా తన కెరీర్‌ లో 52వ సారి బదిలీ అయ్యారు. తాజాగా తొమ్మిది మంది ఐఏఎస్‌ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా.. అందులో అశోక్‌ ఖేమ్కా పేరు ఉండటం ఆసక్తికరంగా మారింది.

అసలు ఎవరీ అశోక్‌ ఖేర్క్‌

అశోక్‌ ఖేమ్కా అంటేనే అధికారంలో ఉన్న కేంద్ర నాయకులకు సైతం భయం. ఆయన ప్రజల మనిషి, ఆయనకు నచ్చినట్టే ఉంటాడు, నచ్చిందే చేస్తాడని పేరుంది. అందుకే అన్ని బదిలీలు ఆయనకు బహుమానంగా ఇస్తున్నారు. 2012లో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రాకు డిఎల్‌ఎఫ్‌ కు మధ్య కుదిరిన భూ ఒప్పందాన్ని రద్దు చేసి వార్తల్లో నిలిచారు. అధికారంలో ఉన్న పార్టీకి చెందిన కీలక వ్యక్తికి నష్టం జరిగేలా ఆయన నిర్ణయం ఉండడంతో సంచలనంగా మారిపోయింది. దీంతో అశోక్‌ పేరు పేరు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. నిజీయితీతో పాటు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునే సత్తా అశోక్‌ కు టన్నుల లెక్క ఉందని అందుకే ఆయనపై తరచూ బదిలీల వేటు పడుతుందని అంటుంటారు. అంకితభావంతో, నిబద్దతతో పనిచేస్తున్నందుకే ఆయనకు ట్రాన్స్‌ పర్స్‌ వస్తున్నాయని చెపుతున్నారు. తన కేరీర్‌ లో అత్యున్నత స్థాయి నేతల అవినీతి చిట్టాలతో పాటు. గలీజు ఒప్పందాలు, ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లే నిర్ణయాలపై ఆయన కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు. హర్యానా మాజీ భూపేందర్‌ సింగ్‌ హుడా పాలనలో చోటు చేసుకున్న అనేక కుంభకోణాలను బయటపెట్టిన అశోక్‌ ఖేర్కా తాజాగా ఆరావళీ పర్వత శ్రేణుల్లో భూఏకీకరణ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలకు బహుమానంగానే మళ్లీ బదిలీ వేటు పడినట్లు చెబుతారు. తన కెరీర్‌ లో ఎన్నో బదిలీ వేట్లను చూసిన అశోక్‌ ఖేర్కా బదిలీలు పరిణామం కొత్తేమి కాకున్నా, ముక్కుసూటిగా పని చేసే అధికారిని ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా భరించలేదన్న విషయం తాజాగా జరిగిన బదిలీతో స్పష్టమవుతోంది. రాజకీయ నాయకులు, పాలన ఎన్ని మారినా, ఎన్నికల ముందు ఎన్ని వాగ్దానాలు చేసిన గద్దెనెక్కాక వారి చేసే పనులు మాత్రం యథావిధిగా చేస్తూనే ఉన్నారు. అవినీతి నిర్మూలన, జవాబుదారీతనం మా పాలన యొక్క ప్రధాన లక్ష్యం అంటారు. కాని అధికారంలోకి వచ్చాక వారి మాట వినని అధికారులను పనికిమాలిన శాఖలకు పంపించడం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉంది. నేటి ప్రజలను పాలించే రాజకీయ నాయకులకు ప్రజలకోసం పనిచేసే అధికారులను ససేమిరా వద్దంటున్నారు. వారు చెపుతే వినేవాళ్లకు, వారు ఎక్కడ సంతకం పెట్టమంటే పెట్టేవారికే పెద్దపీట వేస్తున్నారు. ముక్కుసూటిగా, నిస్వార్థంగా, ప్రజల కోసం పనిచేసే అధికారులను ఎప్పుడూ ప్రజలకు సంబంధం శాఖలలో వేస్తూ, ప్రజలకు దూరంగానే ఉంచుతున్నారు. నాయకులు బహిర్గతంగా చెప్పెదొకటి, అంతర్గతంగా చేసెదోకటిగా మారిపోయింది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here