Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలు

అంతు తేలని టీపీసీసీ చీఫ్‌ పదవి..

రేపురేపనడమే తప్ప నియామకమే లేదు..

రేవంత్‌ ఆశలు.. కుంతియా కామెంట్‌..

చక్రం తిప్పిన కాంగ్రెస్‌ సీనియర్లు

అహ్మద్‌ పటేల్‌తో సమావేశం

ఇంకొన్ని రోజులో తర్జనభర్జనలు

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవిపై సందిగ్ధం వీడడం లేదు.. నాకంటే నాకని వాదులాడుకోవడానికే సమయం సరిపోతుంది. తెలంగాణ కాంగ్రెస్‌లో కొద్ది రోజులుగా దీనిపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌ రెడ్డికి ఆ పదవి ఖాయం అయినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. తాజాగా మూడు రోజుల క్రితం రేవంత్‌ రెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి సోనియా గాంధీతో ప్రత్యేకంగా భేటీ కావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇంకేముంది రేవంత్‌ రెడ్డికి టీపీసీసీ చీఫ్‌ పదవి ఫిక్స్‌ అయిందని ప్రచారం సాగుతోంది. అధికారిక ప్రకటన వెలువడటమే ఆలస్యమని ఆయన అనుచరులు సంబరాలు చేసుకున్నారు. అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహరాల ఇంచార్జ్‌ కుంతియా ఓ షాకింగ్‌ న్యూస్‌ బయటపెట్టారు. అసలు టీపీసీసీ చీఫ్‌ పదవి పై ఎలాంటి చర్చ జరగలేదని ఆయన తెలిపారు. మరోవైపు ఈ పదవిపై తెలంగాణ నుంచి నలుగురు మంత్రులు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే రేవంత్‌ రెడ్డికి టీపీసీసీ పదవి దాదాపు ఖరారు కాగా, పార్టీ సీనియర్‌ నేతలు చివరి నిమిషంలో అడ్డుకున్నారని రేవంత్‌ రెడ్డి అనుచరులు వాపోతున్నారు. మరోవైపు పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నవారిని పక్కనపెట్టి.. వలస వచ్చిన వారికి పీసీసీ బాధ్యతలు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసం అని కొందరు సీనియర్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు రేవంత్‌ రెడ్డి గ్రాడ్యుయేషన్‌ చదువుతున్న సమయంలో అభిల భారత విద్యార్థి పరిషత్‌ నాయకుడిగా వ్యవహరించారు. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తరువాత పార్టీలోని ఇతర నాయకులతో విభేదాల కారణంగా టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఇలా పార్టీలు మారిన వ్యక్తికి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం కరెక్టు కాదని.. మొదటి నుంచి పార్టీ కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన వారు ఎంతోమంది ఉన్నారని.. పలువురు అభిప్రాయపడుతున్నారు.

చక్రం తిప్పిన కాంగ్రెస్‌ సీనియర్లు

గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ రథసారథిని మారుస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డికే ఈ బాధ్యతలు ఇస్తారన్న టాక్‌ వచ్చింది. రేవంత్‌కు పీసీసీ పగ్గాలు ఇవ్వడం, టీ కాంగ్రెస్‌లోనే చాలామందికి నచ్చడం లేదట. సీనియర్లుగా ఉన్న వారు బాహాటంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వి.హనుమంతరావు అయితే, రేవంత్‌ టార్గెట్‌గా సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ రెడ్డికి టీ పీపీసీ ఛీప్‌ ఇవ్వాలని హైకమాండ్‌ నిర్ణయం తీసుకోవడం వల్లే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ వంటి వాళ్లు పరోక్షంగా ఆయనపై విమర్శలు మొదలుపెట్టారనే టాక్‌ కూడా వినిపిస్తోంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఈ అంశంపై చర్చలు జరిపేందుకు ఢిల్లీ వెళ్లారని తెలుస్తోంది. రేవంత్‌ రెడ్డి సోనియాగాంధీతో కుటుంబ సమేతంగా ఫోటో దిగడంతో, ఒక్కసారిగా పీసీసీలో కల్లోలం రేగుతోంది. అసెంబ్లీ ఎన్నికల తరువాత ఎవ్వరికీ అపాయింట్‌ మెంట్‌ ఇవ్వని సోనియాగాంధీ, కేవలం రేవంత్‌ రెడ్డికి మాత్రమే ఎందుకు ఇచ్చారనే చర్చ, పార్టీలో జోరుగా సాగుతోంది. అధిష్టానం రేవంత్‌కు పీసీసీ పగ్గాలు అప్పగించాలని నిర్ణయం తీసుకోవడం వల్లే, సోనియగాంధీ, రేవంత్‌ కుటుంబంతో కలిసి ఫోటో దిగారనే ఊహాగానాలకు బలం చేకూరుతోంది. దీంతో పార్టీలో సీనియర్లంతా చివరి ప్రయత్నంగా రేవంత్‌కు పదవి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఇప్పటికే పార్టీ సీనియర్లంతా ఢిల్లీలో మకాం వేసినట్లు తెలుస్తోంది. సీనియర్లంతా పార్టీలో ఉన్న జీవన్‌ రెడ్డి, శ్రీధర్‌ బాబు, కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డిలకు ఇవ్వాలని డిమాండ్‌ తెస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి, టీ కాంగ్రెస్‌లో రేవంత్‌ రెడ్డి తుపాను ఎలా తీరం దాటుతుందో. రేవంత్‌ రెడ్డికి పీసీసీ చీఫ్‌ పదవి రాకుండా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొందరు సీనియర్లు చక్రం తిప్పారనే ప్రచారం కూడా సాగుతోంది. రేవంత్‌ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైన సమయంలో కాంగ్రెస్‌ సీనియర్లు ఈ విషయమై పార్టీ నాయకత్వం వద్ద తమ నిరసనను వ్యక్తం చేసినట్టుగా సమాచారం. దీంతో కొత్త పీసీసీ చీఫ్‌ నియామకం నిలిచిపోయింది. ఆఘమేఘాల విూద రాష్ట్ర ఇంచార్జీ కుంతియా కొత్త పీసీసీ నియామకం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ పీసీసీ చీఫ్‌ పదవికి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి రాజీనామా చేశాడు. తనకు బదులుగా మరొకరికి బాధ్యతలను ఇవ్వాలని పార్టీ నాయకత్వాన్ని కోరారు. ఇదే సమయంలో రాహుల్‌ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుండి తప్పుకోవడంతో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కొనసాగుతున్నారు. ఎఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ ప్రస్తుతం కొనసాగుతున్నారు. సంస్థాగత ఎన్నికల్లో భాగంగా అన్ని రాష్ట్రాలకు కొత్త పీసీసీ చీఫ్‌ లను నియమించే అవకాశం ఉంది. అయితే టీడీపీ నుండి కాంగ్రెస్‌ లో చేరిన కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డిని పీసీసీ చీఫ్‌ చేయాలని పార్టీ నాయకత్వం భావించినట్టుగా ప్రచారం సాగుతోంది. నాలుగు రోజుల క్రితం ఎంపీ రేవంత్‌ రెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ సోనియా గాంధీని కలిశారు. పీసీసీ చీఫ్‌ పదవిని రేవంత్‌ రెడ్డికి కట్టబెట్టాలని కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం దాదాపుగా నిర్ణయం తీసుకొన్న తరుణంలో అదే పార్టీకి చెందిన సీనియర్లు ఈ నిర్ణయం అమలు కాకుండా విజయవంతంగా నిలిపివేశారనే ప్రచారం ఆ పార్టీ వర్గాల్లో నెలకొంది.

అడ్డు తగులుతున్న వృద్ద నాయకులు..

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ వి.హనుమంతరావులు బుధవారం నాడు రాత్రి కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ ను కలిశారు. పీసీసీ చీఫ్‌ నియామకం విషయమై ఆయనతో చర్చించారు. వేరే పార్టీ నుండి వచ్చిన వారికి పీసీసీ చీఫ్‌ ఎలా ఇస్తారని హనుమంతరావు రేవంత్‌ రెడ్డి గురించి పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నించినట్టుగా సమాచారం. అంతేకాదు రేవంత్‌ రెడ్డి ఏబీవీపీలో పనిచేశాడని, ఆర్‌ఎస్‌ఎస్‌తో కూడ ఆయనకు సంబంధాలు ఉన్న విషయాన్ని వి.హనుమంతరావు అహ్మద్‌ పటేల్‌ వద్ద ప్రస్తావించినట్టుగా సమాచారం. ఆయనకు ఆర్‌ఎస్‌ఎస్‌తోనూ సంబంధాలు ఉండేవని అహ్మద్‌ పటేల్‌ దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. అలాంట నాయకుడికి కాంగ్రెస్‌ పగ్గాలు ఎలా అప్పగిస్తారని అహ్మద్‌ పటేల్‌ను నిలదీసినట్టు తెలుస్తోంది. మొదట్లో బీజేపీ, ఆ తరువాత టీడీపీలో పని చేసిన రేవంత్‌ రెడ్డికి కాంగ్రెస్‌ రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తే… తాము కాంగ్రెస్‌లో కొనసాగబోమని కొందరు నేతలు అహ్మద్‌ పటేల్‌తో వ్యాఖ్యానించినట్టు సమాచారం.నిజమైన కాంగ్రెస్‌ వాదులకు కాకుండా ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి కీలకమైన పదవులను అప్పగించడం వల్ల ప్రయోజనం ఏమిటని కొందరు నేతలు ప్రశ్నించారు. ఈ పరిణామాలను అహ్మద్‌ పటేల్‌ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. ఈ పరిణామాలపై ఎఐసీసీ కార్యదర్శి వేణుగోపాల్‌, ఉత్తమ్‌ కుమార్‌, మల్లుభట్టి విక్రమార్కలు వార్‌ రూమ్‌ లో ఈ విషయమై చర్చించారని తెలుస్తోంది. అయితే ఈ సమావేశంలో కూడ పీసీసీ చీఫ్‌ పదవి మార్పు విషయమై చర్చించారు. పీసీసీ చీఫ్‌ ను మారిస్తే నిజమైన కాంగ్రెస్‌ వాదులకే ఈ పదవిని కట్టబెట్టాలని నేతలు కోరారు. ఈ సమావేశం తర్వాత కుంతియా న్యూఢిల్లీలో విూడియాతో మాట్లాడారు. పీసీసీ చీఫ్‌ మార్పు గురించి చర్చించలేదన్నారు. పీసీసీ చీఫ్‌ ను మార్చడం లేదన్నారు. వచ్చే మున్సిఫల్‌ ఎన్నికల్లో విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్టుగా కుంతియా విూడియాకు తెలిపారు. ఈ నెల రెండో వారంలో కాంగ్రెస్‌ సభ్యత్వ నమోదు విషయమై సమావేశంలో చర్చించామని కుంతియా తెలిపారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close