కష్టానికే కష్టం..

0
  • ఊపిరి తీసిన ఉద్యోగం
  • సర్కార్‌ కొలువు సంపేసింది
  • భూపాల్‌ లో మరో వైనం
  • ‘తలాక్‌’ చెప్పాడని ఆత్మ త్యాగానికి సిద్ధం

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

‘సర్కారు కొలువు కదా’ అని ఆ ఆడకూతురు ఆశపడింది. కొలువస్తే ఆటో నడుపుకునే అయ్యకు తోడుగా ఉండి కష్టాలు పంచుకోవలనుకుంది. ఇద్దరు చెల్లెళ్ళకు నీడగా ఉండాలనుకుంది. ఆ ఆడకూతురి ఆరాటం బతుకు పోరాటంగా మారింది. బతుకు తెరువు ఎక్కడికైనా తీసుకెళుతుంది. చివరకు సర్కారు కొలువు కోసం చేసిన ప్రయత్నంలో ఆ పిచ్చి తల్లి ఊపిరే పోయింది. ఆ కుటుంబ రోదనలు మిన్నంటాయి. భూపాల్‌ లో ఏకంగా అమర జవాన్‌ భార్యను ఓ మోసగాడు మోసం చేయగా, రాజధాని నగరంలో ‘తలాక్‌’ చెప్పాడని మరో అభాగిని పిల్లాపాపలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వీటికి తోడుగా దేశవ్యాప్తంగా సోమవారం అర్థరాత్రి వరకు 27 సంఘటనలలో మహిళలు బాధితులుగా మారారు. ఈ అవాంఛనీయ సంఘటనలు చూస్తుంటే…. కష్టాలకే కష్టం వచ్చినట్లుంది. ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది.

1బబి ఃనీలీ:

ఇదీ జరిగింది:

కరీంనగర్లోని నగర పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్లో జరుగుతున్న పోలీస్‌ దేహదారుఢ్య పరీక్షల్లో అపశ్రుతి చోటుచేసుకుంది.పరీక్షలకు హాజరైన ఓ యువతి మృతి చెందింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని రామడుగు మండలం వెలిశాల గ్రామానికి చెందిన వి. మమత(20) సోమవారం పోలీస్‌ దేహదారుఢ్య పరీక్షలకు హాజరైంది. పరీక్షల్లో భాగంగా నిర్వహించే 100 విూటర్ల పరుగులో పాల్గొని ముగిసిన అనంతంరం కుప్పకూలిపోయింది. హూటాహుటిన అక్కడ ఉన్న పోలీసులు ప్రాథమిక చికిత్స అందించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అభ్యర్థి మృతి చెందింది. ఆసుపత్రికి కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ బి. కమల్హసన్‌ రెడ్డి చేరుకొని కుటుంబ సభ్యులకు అక్కడ జరిగిన సంఘటనను వివరించారు. వైద్య పరంగా అన్ని సహకరాలూ అందించామని, ప్రభుత్వ సాయం అందేలా ప్రయత్నిస్తామని తెలిపారు. అభ్యర్థులకు ఆరోగ్య సమస్యలు ఉంటే ముందే తెలిపితే గడువు పొడిగిస్తామని తెలిపారు.

2నిట ఃనీలీ:

అమర జవాను భార్యను దోచేశాడు

భోపాల్‌:

పుల్వామా ఉగ్రదాడిలో 43మంది సీఆర్పీఎఫ్‌ జవానుల మృతిపై దేశవ్యాప్తంగా ఉద్రిక్త వాతవరణం కొనసాగుతుండగానే మరో దారుణం వెలుగులోకి వచ్చింది. అమర జవాను భార్యను టార్గెట్‌ చేసిన ఓ దుర్మార్గుడు ప్రభుత్వం ఆమెకిచ్చిన పరిహార సొమ్మును కాజేశాడు. మధ్య ప్రదేశ్లోని సె¬ర్‌ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

పోలీసులు అందించిన సమాచారం ప్రకారం 2013 శ్రీనగర్లో జరిగిన టెర్రరిస్టుల దాడిలో మధ్యప్రదేశ్కు సీఆర్పీఎఫ్‌ జవాను ఓం ప్రకాశ్‌ మారదానియా అసువులు బాసారు. అయితే ఆయన భార్య కమల్‌ బాయికి ప్రభుత్వం రూ.8లక్షలను ఇచ్చింది. ఈ విషయాన్ని గమనించిన మిశ్రీలాల్‌ విూనా అనే వ్యక్తి కమలా బాయిని ఈ నెల (ఫిబ్రవరి) 11న కలిశాడు. తను సీఆర్పీఎఫ్కి చెందిన వ్యక్తినని, అమర జవానుల కుటుంబ సంక్షేమ సమాచారం నిమిత్తం ప్రభుత్వం తనను పంపించిందని చెప్పాడు. అలాగే ప్రభుత్వం మరో 34లక్షల రూపాయలను మంజూరు చేసిందని, ఇందుకు ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన 8లక్షల రూపాయలను బ్యాంకునుంచి విత్డ్రా చేయాలని ఆమెను నమ్మించాడు. అతని మాటల్ని విశ్వసించిన కమలా బాయి ఆ డబ్బులను విత్‌ డ్రా చేసి వాడికి ఇచ్చింది. అంతే ఇదే అదనుగా భావించిన అతగాడు అక్కడ్నుంచి ఉడాయించాడు.

3తీట ఃనీలీ:

భర్త తలాక్‌ చెప్పాడని.. పిల్లల కాళ్లు, చేతులు కట్టేసి..

హైదరాబాద్‌: తలాక్‌ ఇస్తానంటూ భర్త వేధించడంతో ఓ గృహిణి ఆత్మహత్యకు ప్రయత్నించింది. తన పిల్లలతో సహా ట్యాంక్బండ్లో దూకేందుకు యత్నించింది. పిల్లల కాళ్లు, చేతులు కట్టేసి నీటిలోకి దూకేందుకు వెళ్తున్న ఆమెను స్థానికులు అడ్డుకున్నారు. వారి సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న లేక్‌ పోలీసులు మహిళలను పోలీస్‌ స్టేషన్కు తరలించి కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు.

కాగా గత కొద్దిరోజులుగా తలాక్‌ ఇస్తానంటూ తన భర్త తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె పోలీసుల వద్ద వాపోయింది. ఆత్మహత్యయత్నానికి యత్నించిన మహిళను నగరంలోని టోలీచౌక్‌ ప్రాంతానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here