Featuredజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలుస్టేట్ న్యూస్

వలసలో మనమే టాప్‌…

ఉపాధి కోసం వెళ్లేవారే ఎక్కువ..

చదువు పేరుతో మరికొంతమంది..

ఉపాధిని కల్పించలేని ప్రభుత్వాలు..

రెండు కోట్ల మంది బయటి దేశాల్లోనే..

ఉపాధి కోసం కొంతమంది, ఉన్నత చదువుల కోసం మరికొంతమంది, ఉద్యోగం పేరుతో ఇంకొంతమంది ఉన్న ఊరును, కన్నతల్లిని విడిచివెళ్లిపోతూనే ఉన్నారు.. పల్లెను విడిచి పట్నం పోతున్నవారి కన్నా ఇప్పుడు దేశాన్ని విడిచి వెళ్లేవారు సంఖ్య ఎక్కువైపోయింది. ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోతుంటే ఎక్కడికి పోతే ఏంటనే పరిస్థితి అందరిలో వస్తుందీ.. పల్లెలన్నీ ఉపాధి లేకుండా బీడుగా మారిపోతుంటే పొట్టచేత పట్టుకొని వలసలు పోవడం తప్ప మరో మార్గం కనబడడం లేదు. ఉన్నత చదువులు ఎన్ని చదివినా ఉద్యోగమే రావడం లేదని, బతకడానికి ఏదో ఒక పని చేద్దామనే ఆలోచన అందరిలో కనిపిస్తోంది. ప్రభుత్వాలు సరియైనా ఉపాధి కల్పించదు, ఉద్యోగ నియామకాలు చేపట్టదు. అందుకే వలసలు మన దేశం నుంచి ఇతర దేశాలకు పోయే వారు పెరుగుతున్నారని అర్థమవుతోంది. ఇతర దేశాల నుంచి చదువుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం మన దేశానికి వస్తూనే ఉన్నారు కాని వెళ్లేవారికన్నా వచ్చేవారు పదిశాతం కూడా ఉండడం లేదు. మనదేశంలో సరియైన మౌలిక సదుపాయాలు లేవని విషయం తెలుస్తోంది. మారుతున్న జీవన విధానంలో మనిషి బ్రతకడానికి ఎక్కడికైనా, ఎంత దూరమైనా వెళ్లడానికి వెనకాడడమే లేదు. జిల్లాలను వదిలి పక్క జిల్లాలోకి వెళ్లేవారి కన్నా, ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కాని ఇప్పుడు గ్రామాల్లో మనుషుల ఆలోచన సరళి మారిపోయింది. ఇతర దేశాలకు వెళ్లి కొన్ని సంవత్సరాలు కష్టపడుతే చాలని ఆలోచనలో ఉన్నారు. అందుకే ఇప్పుడు కుటుంబాన్ని, దేశాన్ని వదిలి ఇతర దేశాలకు వెళ్లేవారు పెరుగుతున్నారు. నాలుగు పైసలు సంపాదించుకోవడానికి, నమ్ముకున్న కుటుంబాన్ని కాపాడుకోవడానికి మరోక ప్రయత్నం కనిపించడం లేదంటున్నారు. కష్టమైనా, నష్టమైనా కొన్ని రోజులు ఇబ్బందులు పడుతే ఆ తర్వాత కుటుంబంతో ఆనందంగా ఉండాలనే ఆలోచనతో వలసపోయే వారు పెరుగుతున్నారు.. ఇప్పటికి వరకు ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి వెళ్లినవారి కంటే మన దేశం నుంచి ఇతర దేశాలకు బతకడానికి వలస వెళ్లిన వారి సంఖ్య అక్షరాలా రెండు కోట్లు.. ఈ సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది.. ఇక్కడి ప్రభుత్వాలు పనిచేద్దామనే వారికి సరియైన పని కల్పించడం లేదు. పనిచేసిన వారికి తగిన ప్రతిఫలం ఇవ్వడం లేదు. అందుకే మన దేశంలో వలసలు వరదలా పెరిగిపోతూ ఎక్కడో ఒక దగ్గర బతుకు బండిని లాగిస్తున్నారు.

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌..

మన దేశం ఎప్పుటికి అభివృద్ది చెందుతున్న దేశంగానే కనిపిస్తోంది. మన దేశంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది పాలకులు మారినా కాని దేశ ఆర్థిక స్థితిగతుల్లో, కింది స్థాయి సామాన్య జీవితాల్లో మాత్రం మనం అనుకున్నంత మార్పు రావడం లేదని చెప్పవచ్చు. స్వతంత్రం వచ్చి ఇంచుమించుగా ఎనభై సంవత్సరాలకు దగ్గరికొస్తున్న ప్రజల జీవితాల్లో మార్పులు కనబడడం లేదు. ఉన్నవారే మరీ ఉన్నతంగా ఎదుగుతూ ఉంటే, పేదవాళ్లు మరీ పేదవాళ్లగానే మిగిలిపోతున్నారు. ఇప్పుడు మనదేశంలో ప్రధానంగా జరుగుతున్నదీ అదే. ఇక్కడ ఉపాధి అవకాశాలు, ఉద్యోగ నియామకాలు తక్కువే అందుకే బతుకుదెరువు కోసం వలసలు పెరుగుతున్నాయి. ఆదాయం వచ్చే ఉద్యోగం ఎక్కడ ఉందని తెలిసినా రెక్కలు కట్టుకొని మరీ వాలిపోతున్నారు.. వలసపోవడంలో మన భారతీయులు రికార్డు సృష్టిస్తున్నారు. మన దేశం నుంచి ఇతర దేశాలకు వలసలు వెళ్తున్నవారి సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ప్రపంచంలోని ఇతర దేశాలకు బతుకు దెరువు నిమిత్తం, ఉద్యోగాలు, చదువుల నిమిత్తం పోతున్న వారు ఇరవై ఏడు కోట్ల మంది ఉన్నారు. ఎవరో ఒకరు ఏదో ఒక దేశానికో, ప్రాంతానికో వెళుతూ ఉన్నారు. వారిలో ఎక్కువమంది భారతీయులే ఉండడం గమనార్హంగా చెప్పుకోవచ్చు. రెండు కోట్ల మంది భారతీయులు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో విస్తరించి ఉన్నారు. తర్వాతి స్థానంలో మెక్సికో ఉంది. కోటి పద్దెనిమిది లక్షలమంది మంది మెక్సికోలు తన దేశం నుంచి ఇతర దేశాలకు బతకడానికి వలసలు పోయారు. తర్వాతి స్థానంలో చైనా, రష్యాలున్నాయి. మిగతా దేశాల వలసలతో పోలిస్తే మనవాళ్లకు అన్ని దేశాలు అందలం ఎక్కిస్తున్నాయి. మేథోశక్తిలో టాప్‌గా నిలుస్తూ వైద్యం, ఐటి, సాంకేతిక రంగాల్లో భారతీయులు దూసుకెళ్లడం వల్ల వేగంగా అన్ని దేశాల్లో ఆనందంగా ఉండగలుగుతున్నారు. వారి ఉనికిని కాపాడుతున్నారు. ప్రస్తుతం అత్యధిక ఉపాధిని సృష్టిస్తున్న ఐటి రంగంలో మన భారతీయులు టాప్‌లో ఉండటం దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక అమెరికా వలసలకు స్వర్గధామంగా రికార్డు సృష్టిస్తోంది. ప్రపంచలోని పందొమ్మిది శాతం వలసలు ఈ దేశానికే ఉద్యోగ నిమిత్తం, చదువు నిమిత్తం అధికంగా వెళుతున్నారు. వలసలదారులను ఎక్కువగా ఆకర్షించే దేశాల్లో అమెరికానే ముందు వరుసలో ఉంది. ఖండాల వారీగా చూస్తే ఐరోపా ఖండానికి అత్యధికంగా వలసలు పెరుగుతున్నాయి. చాలా దేశాల్లో పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఉపాధి సౌకర్యాలు కల్పించడంలో వెనుకబడిపోతున్నాయి. అక్కడి జీవన విధానానికి తగినంత వనరులు ఉండటం లేదు. ముఖ్యంగా మెక్సిక్‌, ఆఫ్రికన్‌ లాంటి దేశాల్లో తినడానికి కూడా తిండిలేని పరిస్థితులు ఉంటున్నాయి. అక్కడి ప్రభుత్వాలు ప్రజల అవసరాలను పట్టించుకున్న దాఖలాలు మాత్రం కనిపించడమే లేదు.

వలసపోవడమే కాని స్వీకరించడం లేదు..

మనదేశం నుంచి ఎప్పటికి ఇతర దేశాలకు వలసపోవడమే జరుగుతుందీ కాని స్వీకరించడం మాత్రం లేదు. భారతదేశంలో పనిచేసేందుకు అవకాశాలు ఉండడం లేదు. మనదేశం వారికి తగినంత ఉపాధి అవకాశాలు లేనప్పుడు విదేశీ వలసదారులు ఏలా వస్తారనేది ఇప్పుడు ప్రధాన అంశంగా తెలుస్తోంది. మనదేశంలో వలసలు లేవా అనే ప్రశ్నకు ఐక్యరాజ్యసమితి సమాధానం ఇచ్చింది. ఇండియా జనాభాలో 0.4 శాతం మంది వలసదారులే ఉన్నారు. వారి జీవనభృతి కోసం వివిధ దేశాలకు తిరుగుతూ ఉన్నారని తెలుస్తోంది. 2019 లెక్కల ప్రకారం 51 లక్షల మంది వలసదారులు మన దేశంలో ఉన్నారు. ఐతే వీరిలో అత్యధికులు పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌ నుంచి వచ్చిన వారే. మన దేశపు వలసల్లో నలభై ఎనిమిది శాతం మహిళలు ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇతర దేశాలకు వలస వెళ్లడంతో నంబర్‌ వన్‌ స్థానాల్లో భారతీయులు ఉన్నారు. కాని ఇతర దేశాల నుంచి వలసలు స్వీకరించడంలో మాత్రం టాప్‌ టెన్‌లో కూడా ఉండడం లేదు. ఆఫ్రికన్‌ దేశాల్లో కంటే అంతో కొంత ఇండియా అంతో, కొంత బెటర్‌గానే కనిపిస్తోంది కాని మరీ అంతగా అభివృద్ది చెందిన దేశం కాదనే తెలుస్తోంది. అందుకే ఇక్కడ వనరులు, ఖనిజాలు తగినంత ఉన్నా కాని అవి కిందిస్థాయిలో అందరికి సరియైన పని విధానాన్ని మాత్రం కల్పించడం లేదని చెప్పవచ్చు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close