Featuredజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

నేటి బాలలే రేపటి పౌరులు

జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్

.మహబూబాబాద్(ఆదాబ్ హైదరాబాద్).నేటి విద్యార్థులను రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురుతరమైన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని జిల్లా కలెక్టర్  సిహెచ్ శివలింగయ్య పేర్కొన్నారు. గురువారం సాయంత్రం డాక్టర్ పల్లి రాధా కృష్ణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని నందన గార్డెన్స్ లో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గురుపూజోత్సవ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కుమారి బిందు, శాసన మండలి సభ్యురాలు సత్యవతి రాథోడ్, స్థానిక శాసనసభ్యులు శంకర్ నాయక్, లు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు శంకర్ నాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో  కలెక్టర్  సిహెచ్ శివలింగయ్య మాట్లాడుత సమాజంలో అత్యంత గౌరవం ఇచ్చే వ్యక్తి గురువే నని, దేశాభివృద్ధికి తోడ్పాటును అందించే భావిపౌరులను అందించే శక్తి గురువులకే ఉందన్నారు. తరగతి గదిలోనే సమాజాభివృద్ధికి అంకురార్పణ చేసే ధీ శాలి గురువని కొనియాడారు. సమాజంలో తల్లిదండ్రుల తర్వాత దైవాన్ని కంటే ముందు పూజించబడే అత్యున్నత పురస్కారం అందుకుంటున్న వ్యక్తి ఉపాధ్యాయుడు అని అన్నారు. ఉపాధ్యాయులు తాము చేస్తున్న పాఠశాలల్లో పాఠ్యాంశాలు బోధించడం తోపాటు విద్యార్థులకు కార్యాలు ఇస్తూ పాఠశాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ గురుతర మైన బాధ్యత నిర్వహించాలన్నారు.భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని ఉపాధ్యాయుల దినోత్సవం గా జరుపుకొంటూన్నామని వారి ఆశయాలకు అనుగుణంగా బోధించాలి అన్నారు.పోటీ సమాజంలో రాణించిన అప్పుడే విద్యార్థుల జీవితం బాగుపడుతుందని ఉపాధ్యాయుల ఆశయం నెరవేరుతుంది అన్నారు. జిల్లాలో అత్యధికంగా గిరిజనులు పేదరికం ఉన్నందున విద్యార్థి గతి తప్పకుండా ఉత్తీర్ణులు అయ్యేలా బోధించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. గత సంవత్సరం కొన్ని పాఠశాలల్లో వెనుకబడి ఉన్నామని, తెలుసుకొని వాటిని సవరించి వచ్చే సంవత్సరం పదవ తరగతిలో మంచి ఫలితాలు సాధించేలా తగు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. దీనికిగాను ఆరో తరగతి నుండే విద్యార్థుల సామర్థ్యం పెంపొందించడం తోపాటు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గత సంవత్సరం పదవ తరగతిలో టెన్ బై టెన్ ర్యాంకు సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు సన్మానించడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తారని నమ్మకాన్ని పిల్లల తల్లిదండ్రులు కలిగించి వారి భరోసాను వమ్ము చేయకుండా బోధించాలని కోరారు.నాణ్యమైన విద్య తో పాటు పోషకాహారాలు కూడా తుందన్నారు. విద్య తరిగిపోని ఇంత అందిస్తే అంత ఎదుగుతుందని కలెక్టర్ చెప్పారు.ఉపాధ్యాయుల నైపుణ్యాన్ని పెంపొందించు కొనుటకు జిల్లాస్థాయిలో సైన్స్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. అదేవిధంగా సబ్జెక్టుల వారిగా వర్క్ షాప్ లు కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు.
-జిల్లా పరిషత్ చైర్పర్సన్ కుమారి బిందు మాట్లాడుతూ.. క్రమశిక్షణ, నైతిక విలువలతో వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతూ ఎదుగుదలకు ప్రతిక్షణం అండగా నిలబడుతూ,ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ఉన్నతిని చూసి మురసిపోయే వ్యక్తియే ఉపాధ్యాయుడు అని కొనియాడారు.గురువులు అందించిన విద్య, ప్రోత్సాహం వల్ల నేడు ఈ స్థానంలో ఉన్నానని తెలిపారు. జిల్లాలో నాణ్యమైన విద్య అందించుటకు ఎల్లవేలల సహాయ సహకారాలు అందజేస్తానని అన్నారు.
-శాసన మండలి సభ్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. జిల్లాలోని విద్యార్థులకు నైతిక విలువల తో కూడిన గురుతారమైన బాధ్యత ఉపాధ్యులపై ఉందని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వా పాఠశాల లో నాణ్యమైన విద్య అందించడాం జరుగుతున్నదని అన్నారు. దేశంలో ఏక్కడ లేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసిందని అన్నారు. ఒకే రోజు 21 మహిళ డిగ్రీ కళాశాలలు మంజూరు చేసిన ఘనత కెసీఆర్కు దక్కుతుందన్నారు.
-శాసనసభ్యులు శంకర్ నాయక్ మాట్లాడుతూ…. అన్ని వర్గాల విద్యాభివృద్ధికి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటుచేసి నాణ్యమైన విద్య అందిస్తుందన్నారు. మట్టిలో ఉన్న నన్ను మాణిక్యం గా, శిలలో ఉన్న నన్ను శిల్పంగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను ఎల్లవేళలా రుణపడి ఉంటానని తెలిపారు. విద్యార్థులకు నైతిక, నాణ్యమైన విద్యను అందించి ఉన్నత శిఖరాలకు ఎదిగేలా చూడాల్సిన బాధ్యత గురువులపై ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సంవత్సరం పదవ తరగతిలో జిల్లాను అగ్రగామిగా నిలిపే విధంగా కృషి చేయాలని కోరారు. చదువుతోపాటు క్రీడల్లో కూడా విద్యార్థులు రాణించేలా ప్రణాళిక రచించి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో ఐదు కోట్ల రూపాయల వ్యయంతో స్టేడియంను త్వరలో నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు.అనంతరం విద్యారంగంలో జిల్లాలోని 47 మంది విశిష్ట సేవలందించిన ప్రభుత్వ ఉపాధ్యాయులకు జిల్లా కలెక్టర్, జెడ్పి చైర్ పర్సన్, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు ప్రశంసా పత్రాలతో పాటు, శాలువా కప్పి సన్మానించారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close