Featuredరాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

నేడే క్యాబినేట్‌ సమావేశం

మున్సిపల్‌ బిల్లుకు ఆమోదం..!

  • కొత్తగా మూడు పాలసీలు
  • 20,21న చింతమడకకు సీఎం కేసీఆర్‌

తెలంగాణ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. కొత్త మున్సిపల్‌ బిల్లుకు క్యాబినేట్‌ అమోదం తెల్పనుంది. ఈ చట్టంలో మూడు పాలసీలు ఉన్నాయి. లంచాలు లేకుండా పురపాలన కొనసాగేలా చేయడమే ఈ కొత్త చట్టం లక్ష్యం. తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఈ నెల 18 న జరగనున్నాయి. కొత్త మున్సిపల్‌ చట్టం తీసుకువచ్చిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన క్యాబినేట్‌ సమావేశం ఏర్పాటు చేశారు. కొత్త పురపాలక చట్టంలో తెలంగాణ రూరల్‌, అర్బన్‌, రెవెన్యూ అనే మూడు పాలసీలను తీసుకువస్తుంది ప్రభుత్వం. ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు ఉపశమనం కలిగించడంతో పాటు ఉద్యోగులకు లంచాలు ఇచ్చే అవసరం లేకుండా చట్టం రూపొందించారు. కొత్త మున్సిపల్‌ చట్టం వల్ల పట్ణణ ప్రాంతంలో జరిగే గుణాత్మక మార్పుల గురించి మంత్రి వర్గంలో సిఎం కేసీఆర్‌ చర్చిస్తారు. ఆ తర్వాత బిల్లుకు క్యాబినేట్‌ అమోదం తెల్పతుంది. జిఎస్టీ, పంచాయితీ రాజ్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మొదటి సమావేశం ఏర్పాటు వంటి అర్డినెన్స్‌ లకు మంత్రివర్గం అమోద ముద్ర వేయనుంది.

ఈ నెల 20, 21న చింతమడకకు కేసీఆర్‌ పయనం

సీఎం కేసీఆర్‌ స్వగ్రామం చింతమడకకు ఈ నెల 20, 21న కేసీఆర్‌ పయనం కాబోతున్నారు. ఆ రోజు గ్రామంలో సీఎం సభ, సమావేశం నిర్వహించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. కుల వృత్తుల చేసుకునే వారికి యంత్రాలు, వాహనాలు మంజూరు చేయనున్నారు. బీసీ గురుకుల రెసిడెన్షియల్‌ పాఠశాల వసతి గృహానికి శంకుస్థాపన చేయనున్నారు. అక్కడి గ్రామస్తులతో సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. ఈ నేపధ్యంలో అక్కడి ఏర్పాట్లను సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌ రావు పరిశీలించారు. గ్రామంలోని ఐకేపీ గోదాం సీసీ ప్లాట్‌ఫామ్‌ వద్ద సీఎం సభ నిర్వహించాలని, 3,200 మంది గ్రామస్థులకు, 200 మంది అధికారులకు కుర్చీలు ఏర్పాటుచేయాలని, మరో 200 కుర్చీలతో ప్రెస్‌గ్యాలరీ ఏర్పాటుచేయాలని హరీష్‌ రావు అధికారులకు సూచించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close