Featuredరాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

తెలంగాణలో నేడే పురపోరు

  • 120 మున్సిపాల్టీలు, 9 కార్పోరేషన్లు
  • 7,961 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు
  • పోలింగ్‌కు 45వేల మంది సిబ్బంది
  • టెండర్‌ ఓటు వేస్తే రీ పోలింగ్‌
  • రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ వి.నాగిరెడ్డి

హైదరాబాద్‌

రాష్ట్ర వ్యాప్తంగా 120 పురపాలక సంఘాలు, 9 కార్పోరేషన్లలో బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7గంటలకు పోలింగ్‌ ప్రారంభమై సాయంత్రం 5గంటలకు ముగుస్తుంది. పోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. మంగళవారం సాయంత్రానికే ఎన్నికలు సిబ్బంది పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 7961 పోలింగ్‌ కేంద్రాలను సిద్ధంచేశారు. పోలింగ్‌కు 45వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. పట్టణ ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. మున్సిపాల్టీల్లో 2647 వార్డులకు 11,179 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. కార్పోరేషన్లలోని 382 వార్డుల్లో 1747 మంది పోటీ పడుతున్నారు. కరీంనగర్‌ కార్పోరేషన్‌లో 58 వార్డులకు 24న ఎన్నికలు నిర్వహిస్తారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టెండర్‌ ఓటు వేస్తే రీ పోలింగ్‌ తప్పనిసరి నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ వి.నాగిరెడ్డి అన్నారు. దొంగ ఓట్లు వేస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. మంగళవారం రాష్ట్ర ఎన్నికలు సంఘం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మున్సిపల్‌ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుందని ఆయన పేర్కొన్నారు. 120 మున్సిపాలిటీలు, 9 కార్పోరేషన్లకు ఎన్నికలు జరగనున్నట్లు ఎస్‌ఈసీ కమిషనర్‌ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించాలని సూచించారు. టెండర్‌ ఓటు ఒక్కటి పడినా ఆ ప్రాంతాల్లో రీ పోలింగ్‌ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. టెండర్‌ ఓటు వేసిన చోట ఓట్ల లెక్కింపు జరగనివ్వమని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో ధన ప్రవాహం అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు.

ఎన్నికల్లో అధికారులతో పాటు పార్టీల నేతలు కూడా సహకరించాలని ఆయన పేర్కొన్నారు. అభ్యర్థులు ఎన్నికల ఖర్చు వివరాల్లో తప్పుడు సమాచారం చూపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పోలింగ్‌ కేంద్రాల్లో పోటీ చేసే అభ్యర్థి వివరాలను నోటీసు బోర్డులో ఉంచుతామనీ.. అభ్యర్థుల గత చరిత్ర, నేర చరిత్ర, ఆస్తుల వివరాలు అందుబాటులో ఉంచుతామని ఆయన వెల్లడించారు. అభ్యర్థి వివరాలు తెలిస్తే ఎవరికి ఓటు వేయాలనే విషయాన్ని ఓటర్లు తెలుసుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ధన ప్రవాహం అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. ఎన్నికల్లో అధికారులతో పాటు పార్టీల నేతలు కూడా సహకరించాలని ఆయన పేర్కొన్నారు. అభ్యర్థులు ఎన్నికల ఖర్చు వివరాల్లో తప్పుడు సమాచారం చూపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పెద్దపల్లిలో డబ్బులు పంచుతున్న అభ్యర్థిని అరెస్ట్‌ చేశామని చెప్పారు. తొలిసారిగా తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో ఫేస్‌ రికగ్నైజింగ్‌ యాప్‌ను వాడుతున్నామని తెలిపారు. ఇప్పటి వరకు రూ.44,41,850 నగదు సీజ్‌ చేశామన్నారు. డబ్బు పంపిణీని వారి ఫోటోలను ప్రజలు తమ సెల్‌ ఫోన్స్‌తో నిఘా పెట్టాలని, ప్రజలు ఇచ్చిన ఫోటోలు ఆధారంగా ఎన్నికైన అభ్యర్థులను కూడా రద్దు చేస్తామని, అభ్యర్థులు తప్పుడు ఎన్నికల ఖర్చు చూపినా, ఆస్తులు తప్పుగా చూపినా ఎన్నికైన వ్యక్తిని రద్దు చేసే అవకాశముందన్నారు. ప్రజలు తమ ఓటును ఎవరైనా ముందే వేస్తే.. ఓటరు టెండర్‌ ఓటు కోసం డిమాండ్‌ చేయాలని నాగిరెడ్డి సూచించారు. టెండర్‌ ఓటు పడిన పోలింగ్‌ స్టేషన్లో రీ పోలింగ్‌కు అవకాశముంటుంద న్నారు. మెత్తం 2,647వార్డులకు, 382 డివిజన్లకు ఎన్నిక జరుగుతుందన్నారు. ఇప్పటికే 20 వార్డులు, 3 డివిజన్లకు ఎన్నిక ఏకగ్రీవం అయిందన్నారు. మున్సిపాలిటీల్లో మెత్తం అభ్యర్థులు 11,179 మంది ఉన్నారని, కార్పొరేషన్‌ మెత్తం 1,747 అభ్యర్థులు ఉన్నారని, మున్సిపాలిటీలో మెత్తం ఓటర్లు 40,36,346 మంది ఉండగా.. కార్పొరేషన్‌ ఓటర్లు – 13,13,909 మంది ఉన్నారని, ఎన్నికలకు మెత్తం 55వేల మంది సిబ్బందిని, 15వేల మంది భద్రత సిబ్బందిని వినియోగిస్తున్నామన్నారు. మున్సిపాలిటీల్లో మెత్తం 6,188, కార్పొరేషన్‌లో 1,773 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. భైంసాలో సాధారణ పరిస్థితులు ఉన్నాయని ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి పేర్కొన్నారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close