నేడు ఎమ్మెల్సీ ఎన్నికలు

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 12న మంగళవారం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్‌ అధికారి వి. నరసింహాచార్యులు పేర్క్నొనారు. అసెంబ్లీలోని కమిటీహాల్‌-1లో పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలు మంగళవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్నాయి. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు పక్రియ ప్రారంభమవుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఐదుస్థానాలకు గాను అధికార టిఆర్‌ఎస్‌ నలుగురిని నిలబెట్టగా మిత్రపక్షమైన ఎంఐఎంకు ఒక స్థానాన్ని కేటాయించింది. కాంగ్రెస్‌ ఒకస్థానంలో పోటీ చేస్తోంది. అయితే ఇటీవల కాంగ్రెస్‌,టిడిపిల నుంచి ఎమ్మె/-యేలు టిఆర్‌ఎస్‌లోకి వసల రావడంతో ఐదు స్థానాలను టిఆర్‌ఎస్‌, దాని మిత్రపక్షం గెల్చుకోవడం ఖాయమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here