నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్‌

0

ఆలయ నిర్మాణ పనుల పురోగతి పరిశీలిన

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా, అంతర్జాతీయ ఆధ్యాత్మిక దివ్యక్షేత్రంగా యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం పునర్నిర్మించడానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం శరవేగంతో జరుగుతోంది. అయితే పనుల పురోగతిని స్వయంగా పర్యవేక్షించటానికి సీఎం కేసీఆర్‌ స్వయంగా యాదాద్రి వెళ్లనున్నారు. ఏప్రిల్‌ 17 బుధవారం నాడు సీఎం కేసీఆర్‌ ఉదయం 5.30 నుండి 6.30 మధ్య యాదాద్రి చేరుకుంటారని తెలుస్తుంది. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆయన ఆలయ నిర్మాణ పనుల పురోగతిని పర్యవేక్షిస్తారు. యాదాద్రి పుణ్య క్షేత్రాన్ని సీఎం కేసీఆర్‌ చాలా అద్భుత క్షేత్రంగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. అందులో భాగంగా అద్భుత శిల్పకళా ప్రతిభతో శిల్పులు సర్వాంగ సుందరంగా ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. మనోహరమైన శిల్ప సంపదకు, ఆధ్యాత్మికత ఉట్టిపడే రూప నిర్మాణాలకు యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం నెలవుగా మారనుంది. గత రెండు నెలల క్రితం ఫిబ్రవరి 3 న యాదాద్రి పనులను పరిశీలించిన కేసీఆర్‌ నిర్మాణ పనుల్లో పలు సూచనలు చేశారు . అయితే అప్పటి నుండి పనులలో పెద్దగా పురోగతి లేనందున సీఎం కేసీఆర్‌ స్వయంగా నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here