అనుమతివ్వకుంటే కోర్టుకు : తలసాని

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): వచ్చేనెల మూడో తేదీన గుంటూరు సమీపంలో తలపెట్టిన యాదవ గర్జన సభకు అనుమతి ఇవ్వకుండా ఏపీ పోలీసులు నాన్చుతున్నారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆరోపించారు. అనుమతి కోసం పోలీసులు వివిధ రకాల షరతులు పెట్టారని ఆయన ఆక్షేపించారు. తెలంగాణలో తెదేపా సభలు పెట్టినప్పుడు తాము ఎక్కడా వాళ్లకు ఆటంకం కలిగించలేదన్నారు. మిగిలిన పార్టీలు, సంఘాలకు కూడా ఇలాంటి షరతులు పెట్టారా అని తలసాని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడైనా సభ పెట్టుకునే హక్కు తమకు ఉందన్నారు. తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు తనను సనత్‌నగర్‌లో ఓడించేందుకు తీవ్రంగా ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. యాదవ గర్జన సభకు అనుమతివ్వకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని… లేదంటే రహదారిపైనే నిర్వహిస్తామని తలసాని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here