పౌరసత్వ బిల్లుకు

0

లోక్‌సభ ఆమోదం

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): కీలకమైన పౌరసత్వ బిల్లుకు మంగళవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేలా పౌరసత్వ సవరణ బిల్లును ఆమోదిం చింది. ఈ దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చిన వారికి భారత పౌరసత్వం కల్పించాలన్న ప్రతిపాదన ను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ముఖ్యం గా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పార్టీలు.. బీజేపీ మిత్రపక్షాలు కూడా ఈ బిల్లును తప్పుబట్టాయి. ఇది రాజ్యాంగంలోని ప్రాథమిక అంశాలకు విరుద్ధమైన బిల్లు అని వాదించాయి. అస్సాంలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతు న్నాయి. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న అసోం గణ పరిషద్‌ కూడా బిల్లును వ్యతిరేకిస్తూ కమలానికి దూరం జరిగింది. ఈ బిల్లును ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సభలో ప్రవేశపెట్టగానే కాంగ్రెస్‌ వాకౌట్‌ చేసింది. ఈ బిల్లు విభజనకు, హింసకు కారణమవుతుందని తృణమూల్‌ కాంగ్రెస్‌ వాదించింది. ముస్లింలు కాకుండా ఆరు ఇతర మతాల వాళ్లకు భారత పౌరసత్వం ఇవ్వాలన్నది ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. అయితే దేశంలో ఎవరు ఆశ్రయం కోరినా ఇవ్వాలని, ఇందులో ముస్లింలను కూడా చేర్చాలని టీఎంసీ డిమాండ్‌ చేసింది. పౌరసత్వ సవరణ బిల్లును ¬ం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమర్థించారు. ఇది దేశ పౌరుల ప్రయోజనాలను పరిరక్షిస్తుందని చెప్పారు. ఈ బిల్లు కేవలం అసోంకే పరిమితం కాదని, ఇతర రాష్ట్రాలకు కూడా వర్తిస్తుందని అన్నారు. వలసదార్లు పౌరసత్వం పొందకుండా అన్ని రాష్ట్రాలకూ చట్టం వర్తిస్తుందని స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ బిల్లును లోక్‌సభలో రాజ్‌నాథ్‌ మంగళవారం ప్రవేశపెట్టారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ బిల్లుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో లోక్‌సభలో కేంద్రం బిల్లు ప్రవేశపెట్టింది. బిల్లుపై టీఎంసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేయగా, కాంగ్రెస్‌ వాకౌట్‌ చేసింది. అప్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ నుంచి వచ్చిన ముస్లిమేతర శరణార్థులు దేశంలో ఆరేళ్ల పాటు నివసిస్తే తగిన డాక్యుమెంట్లు లేనప్పటికీ వారికి పౌరసత్వం కల్పించేదుకు ఈ బిల్లు ఉద్దేశించింది. సాధ్యమైనంత త్వరలో ఈ బిల్లుకు ఆమోదం లభించేలా చూస్తామని ఈనెల 4న ప్రధాని మోదీ ప్రకటించడంతో ఈ ఆందోళన మరింత పెరిగింది. కాగా, బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్‌నాథ్‌ సింగ్‌ లోక్‌సభలో మాట్లాడుతూ, ఎన్‌ఆర్‌సీకి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎన్‌ఆర్‌సీ అమలులో ఎలాంటి వివక్షకు తావులేదని చెప్పారు. అక్రమ వలసదారుల వ్యవహారాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని అన్నారు. సవరణ బిల్లు రూపకల్పన కోసం ఎన్జీఓలు, ఇతర గ్రూపులతో దేశవ్యాప్తంగా సర్వేలు కూడా నిర్వహించామని సభకు తెలిపారు.

గాంధీవిగ్రహం ముందు విపక్షాల ఆందోళన పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద విపక్షాలు ధర్నా నిర్వహించాయి. కాంగ్రెస్‌ సహా అన్ని విపక్షాల రాజ్యసభ సభ్యులు ధర్నాలో పాల్గొన్నారు. నోటిఫికేషన్‌, ముందస్తు సమాచారం లేకుండా రాజ్యసభ వాయిదా వేశారని విపక్ష ఎంపీలు ఈసందర్భంగా ఆరోపించారు. అజెండాలో ఏం పొందుపరుస్తున్నారనే విషయం కూడా చెప్పట్లేదని, వ్యవస్థలను నాశనం చేస్తున్నట్లే పార్లమెంట్‌ను చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజులుగా సభ జరుగుతున్నా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదన్నారు. ప్రభుత్వం అకస్మాత్తుగా కొత్త బిల్లులను సభ ముందకు తెచ్చిందని మండిపడ్డారు. గులాంనబీ అజాద్‌, డి.రాజా, కనిమొళి, కనకమేడల రవీంద్రకుమార్‌, టి.సుబ్బరామిరెడ్డితో పాటు పలువురు రాజ్యసభ సభ్యులు ధర్నాలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here