ప్రమాణ స్వీకారానికి ఐదుగురు గైర్హా జర్‌..

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): కొత్తగా కొలువుదీరిన తెలంగాణ రెండవ శాసనసభలో ఎన్నో కొత్త ప్రత్యేకతలు చోటుచేసుకున్నాయి. తెలంగాణ తొలి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన 76మంది ఎమ్మెల్యెలు తిరిగి ఎన్నికయ్యారు. 23మంది కొత్త శాసనసభ్యులు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యెలచేత ప్రోటెం స్పీకర్‌ ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. మొదటగా సిఎం కెసిఆర్‌ ఎమ్మెల్యెగా ప్రమాణం స్వీకారం చేయగా, ఆయన తర్వాత ఆరుగురు మహిళా సభ్యులు ఎమ్మెల్యెలుగా ప్రమాణం స్వీకారం చేయించారు. ఆనంతరం అక్షర క్రమంలో మిగతా సభ్యులు ప్రమాణ స్వీకారం రెండున్నర గంటలపాటు కొనసాగింది. మొత్తం 119మంది ఎమ్మెల్యెలలో 114మంది శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మిగతా ఐదుగురు ఎమ్మెల్యెలు గైర్హాజరయ్యారు. ఐతే వీరిలో ఐదుగురు సీనియర్లే కావడం విశేషం. ఎంఐఎం ఎమ్మెల్యెలు అక్బరుద్దీన్‌ ఓవైసీ, జాఫర్‌ హుస్సేన్‌, టిఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యె మాధవరం కృష్ణారావు, టిడిపి ఎమ్మెల్యె సండ్ర వెంకటవీరయ్య, బిజెపి ఎమ్మెల్యె రాజాసింగ్‌ సభకు హజరు కాలేదు. కాగా స్పీకర్‌ ఎన్నిక పూర్తయిన తర్వాతే తాను ప్రమాణం చేస్తానని రాజాసింగ్‌ ఇప్పటికే చెప్పారు. సర్పంచ్‌ ఎన్నికల బిజీ వలన తాను ప్రమాణ స్వీకారానికి రాలేకపోతున్నట్లు సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. శాసనసభ్యుడు ఎమ్మెల్యె సాయన్న ఆనారోగ్య సమస్య ఉండడంతో వీల్‌ చైర్‌లో ప్రమాణ స్వీకారం చేశారు.

 శాసనసభలో అత్యంత సీనియర్‌ సభ్యుడు ముఖ్యమంత్రి కెసిఆర్‌ కాగా తరువాతి స్థానాల్లో ఎర్రబెల్లి దయాకర్‌రావు, రెడ్యానాయక్‌, ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ సీనియర్లుగా ఉన్నారు. ఉప ఎన్నికలతో కలిపితే హరీశ్‌రావు, ఈటెల రాజేందర్‌, కొప్పులు ఈశ్వర్‌ ఆరుసార్లు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. సభలో కొత్తగూడెం ఎమ్మెల్యె వనమా వెంకటేశ్వరరావు ఎక్కువ వయసు కాగా, ఇల్లెందు ఎమ్మెల్యె బానోతు హరిప్రియ పిన్న వయస్కురాలు కావడం విశేషం, తెలంగాణ అసెంబ్లీ మొత్తం 119 శాసనసభ స్థానాలకు గాను 88 మంది తెరాస సభ్యులు, కాంగ్రెస్‌ పార్టీ నుంచి 19, మజ్లిస్‌ పార్టీ 7, భాజపా తరపున ఒకే సభ్యుడు ఉన్నారు. ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థిగా ఒకరు శాసనసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యుల్లో నలుగురు వేర్వేరు చట్ట సభలకు ప్రాతినిథ్యం వహించిన వారు ఉన్నారు. మేడ్చల్‌ నుంచి ఎన్నికైన మల్లారెడ్డి, చెన్నూరు నుంచి గెలిచిన బాల్క సుమన్‌ లోక్‌సభ సభ్యులుగా పనిచేశారు. మునుగోడు నుంచి ఎన్నికైన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి గతంలో లోక్‌సభ, శాసనమండలికి ప్రాతినిథ్యం వహించారు. కొడంగల్‌ నుంచి గెలుపొందిన పట్నం నరేందర్‌రెడ్డి కూడా మండలి సభ్యుడిగా పనిచేశారు. తెలంగాణ తొలి అసెంబ్లీలో లేని, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన 16మంది ఈ సారి మళ్లీ ఎన్నికయ్యారు. మొదటి శాసనసభకు నామినేట్‌ అయిన స్టీఫెన్‌సన్‌ మళ్లీ నామినేట్‌ అయ్యారు. 

అనుకున్నట్లుగానే ప్రమాణం చేయని రాజాసింగ్‌

కొత్తగా కొలువుదీరిన తెలంగాణ రెండో శాసనసభలో ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకుంది. అన్నట్లుగానే గోషామహల్‌ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రమాణం చేయలేదు. నూతనంగా ఎన్నికైన సభ్యులచేత ప్రొటెం స్పీకర్‌ ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా నేటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇద్దరు ఎమ్మెల్యేలు గైర్వాజరయ్యారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, నగరంలోని గోషామహల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఈ ఇరువురు సభా సమావేశాలకు హాజరుకాలేదు. సర్పంచ్‌ ఎన్నికల బిజీ వల్ల రాలేకపోతున్నట్లు సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. స్పీకర్‌ ఎన్నిక పూర్తయిన తర్వాతే ప్రమాణం చేస్తానని రాజాసింగ్‌ ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే. ఇకపోతే ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌, టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా ప్రమాణ కార్యక్రమంలో పాల్గొనలేదు. జర్నలిస్ట్‌ క్రాంతి కిరణ్‌ తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆయన ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ టిక్కెట్‌పై మెదక్‌ జిల్లా ఆందోల్‌ నుంచి గెలుపొందారు. ప్రత్యర్థులు దామాఓదర రాజనర్సింహ, బాబూ మోహన్‌లపై గెలుపొందారు. ఉమ్మడి ఎపిలో ప్రజారాజ్యం నుంచి జర్నలిస్ట్‌ కన్నబాబు కూడా ఎమ్మెల్యేగా గెలుపొందారు. దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి కూడా పూర్వాశ్రమంలో జర్నలిస్ట్‌ కావడం విశేషం. ఇకపోతే మండలిలో సయ్యద్‌ జాఫ్రీ కూడా సీనియర్‌ జర్నలిస్ట్‌ కావడం విశేషం. ఇకపోతే రాష్ట్ర తొలి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన 76 మంది ఎమ్మెల్యేలు తిరిగి ఎన్నికయ్యారు. 23 మంది తొలిసారి శాసనసభలో అడుగు పెట్టారు. సభలో అత్యంత సీనియర్‌ సభ్యుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఇప్పటి వరకూ ఆయన ఉప ఎన్నికతో పాటు ఎనిమిది సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. తరువాతి స్థానంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు, రెడ్యానాయక్‌, ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ సీనియర్లుగా ఉన్నారు. ఉప ఎన్నికతో కలిపితే హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌ ఆరుసార్లు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. సభలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎక్కువ వయసు ఉన్న సభ్యుడు కాగా, ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ పిన్నవయస్కురాలు. తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 శాసనసభ స్థానాలకు గాను 88 మంది తెరాస సభ్యులు, కాంగ్రెస్‌ పార్టీ 19, మజ్లిస్‌ పార్టీ 7, తెదేపా 2, భాజపా తరఫున ఒక సభ్యుడు ఉన్నారు. ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ తరఫున ఒకరు, స్వతంత్ర అభ్యర్థిగా ఒకరు శాసనసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యుల్లో నలుగురు వేర్వేరు చట్టసభలకు ప్రాతినిథ్యం వహించిన వారు ఉన్నారు. మేడ్చల్‌ నుంచి ఎన్నికైన మల్లారెడ్డి, చెన్నూరు నుంచి గెలిచిన బాల్క సుమన్‌ లోక్‌సభ సభ్యులుగా పనిచేశారు. మునుగోడు నుంచి ఎన్నికైన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గతంలో లోక్‌సభ, శాసనమండలికి ప్రాతినిథ్యం వహించారు. కొడంగల్‌ నుంచి గెలుపొందిన పట్నం నరేందర్‌రెడ్డి కూడా మండలి సభ్యుడిగా పనిచేశారు. ఈనలుగురిని మినహాయిస్తే మిగతా 23 మంది మొట్టమొదటి సారి శాసనసభకు ఎన్నికయ్యారు. తెలంగాణ తొలి అసెంబ్లీలో లేని, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు ప్రాతినిథ్యం వహించిన 16 మంది మళ్లీ ఎన్నికయ్యారు. మొదటి శాసనసభకు నామినేట్‌ అయిన స్టీఫెన్‌సన్‌ మళ్లీ నామినేట్‌ అయ్యారు. దీంతో ఆయన కూడా గురువారమే ప్రమాణం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here