పట్టాభిషేకానికి వేళాయేనే..!

0

ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ పట్టాభిషేకానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం రాత్రి 7 గంటలకు మోడీ, మధ్యాహ్నం 12.23గంటల ముహూర్తానికి జగన్‌ ప్రమాణస్వీకారం చేస్తున్నారు. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి పదవీ బాధ్యతలను చేపట్టబోతున్నారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మోడీ చేత ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమంలో మోడీతో పాటు మరికొందరు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ విషయాన్ని రామ్‌నాథ్‌ కోవింద్‌ సైతం అధికారికంగా ట్వీట్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిచిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైయ్యారు. మంత్రి పదవులకు ఆశావాహులకు ఎక్కువగా ఉండటంతో ఈ పరిణామం జగన్‌కు తలనొప్పిగా మారే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో నేడు ఆయనొక్కరే ప్రమాణస్వీకారం చేయనున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించారు. జూన్‌ మొదటి వారంలో 18-20మంది సభ్యులను మంత్రివర్గంలో చేర్చుకుంటారని పార్టీలోని ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here