కలాల గళాలు ఏకమవ్వాల్సిన సమయమిదే..

0

ప్రశ్నిస్తేనే జర్నలిస్టులకు దక్కనున్న హక్కులు.. ˜

అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్‌.. ˜

జర్నలిస్టుల దీక్షకు పలు ప్రజాసంఘాల మద్దతు..

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ప్రశ్నించే జర్నలిస్టు గొంతులను రోజురోజుకు అణిచివేస్తూ వారి హక్కులను కాలరాస్తున్నారని జర్నలిస్ట్‌ పోరం సేవ్‌ తెలంగాణ సీనియర్‌ జర్నలిస్టు అమర్‌ అన్నారు. ఇందిరాపార్క్‌ వద్ద రెండవ రోజు జరిగిన రిలే నిరాహార దీక్షలకు పలు ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. అనంతరం అమర్‌ మాట్లాడుతూ జర్నలిజం సంఘాలలో కాని, పత్రిక, ఎలక్ట్రానిక్‌ మీడియా రంగాలలో కాని కొంత మంది జర్నలిస్టులు అధికార పాపార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆ విధానాన్ని విడనాడి అందరూ ఐకమత్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పుడు జర్నలిస్టులపై జరుగుతున్న అణిచివేతం రేపు అందరికి జరిగి ఉనికిని కొల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఎవరికి వారు యమునా తీరు గా కాకుండా జర్నలిజం విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి జర్నలి స్టులపై ఉందన్నారు. రవిప్రకాష్‌ వ్యక్తిగతంగా వదిలేస్తే వ్యవస్థప రంగా జర్నలిజానికి ఒక రూపురేఖలు తెచ్చిన వ్యక్తిగా అందరూ గుర్తుంచు కోవాల్సిన అవసరం ఉందన్నారు. రెండు రోజులు జరిగిన జర్నలిస్టుల రిలే నిరాహార దీక్షలు ముగిసాయని తదుపరి కార్యాచరణతో రాష్ట్రవ్యాప్తంగా ముందుకు వస్తామన్నారు. రవిప్రకాశ్‌కు ఏమైనా హాని జరిగితే ప్రభుత్వమే అందుకు పూర్తి బాధ్యత వహించాలన్నారు.. జర్నలిస్టుల దీక్షకు మద్దతు ప్రకటించిన బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణ య్య మాట్లాడు తూ ప్రజాస్వామ్యాన్ని, పత్రికలను అణిచి వేయాలని చూసినా ఎంతోమంది కాలగర్భంలో కలిసిపో యారనే విషయాన్ని మన తెలంగాణ పాలకులు గుర్తుచే సుకుంటే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిత్యం ప్రజల గొంతుగా పోరాటం చేస్తూ వార్తా సేకరణలో తన జీవితాన్ని ఫణంగా పెడుతున్న జర్నలిస్టులపై కేసులు పెట్టడం వారి పతనానికే దారితీస్తుం దన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రజా సంఘాల గొంతులను అణిచివేసిందని, ఇప్పుడు పత్రికల గొంతులను కూడా తొక్కిపెడుతే తమను ప్రశ్నించేవారే లేరనే ఆలోచనలో కెసిఆర్‌ ఉన్నా రన్నారు. ఒక వ్యక్తిని, ఒక సంస్థను, ఒక సంఘాన్ని ఎంత తొక్కిపెడుతే అంతగా తిరుగుబాటుకు సిద్దమవుతారని ఆయన అన్నారు. సీనియర్‌ జర్నలిస్టు గోపి యాదవ్‌ మాట్లాడుతూ రవిప్రకాశ్‌పై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేసి జర్నలిస్టుల అభివృద్దికి ప్రభుత్వం కృషి చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలం గాణ ప్రభుత్వం ఏర్పడి ఆరు సంవత్సరాలు అవు తున్నా ఇప్పటివరకు ఒక్కరికి కూడా న్యాయంగా అందాల్సిన సదుపా యాలు ఒక్కటి అందలేద న్నారు. మండలాలు, జిల్లాల నుంచి ప్రారం భమైన జర్నలిస్టులపై కేసులు ఇప్పుడు రాష్ట్రస్థాయిలో పెరిగిపోయాయని దీన్ని ఇలాగే వదిలేస్తే భవిష్యత్తు లో జర్నలిజంలో పనిచేయాలన్నా ఒక రకమైన భయం ఏర్పాడే అవకాశం ఉందన్నారు. జర్నలిస్టులపై పెరుగు తున్న దాడులను ఆపి చిన్నా పత్రిక, పెద్ద పత్రిక అనే తేడా లేకుండా అందరికి సమానంగా గుర్తించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. సీనియర్‌ జర్నలిస్టు ముప్పారపు మధు మాట్లాడుతూ ఇప్పుడు చేస్తున్న ఈ పోరాటం ఏ ఒక్కరి కోసం కాదని, అందరూ ఏకమై ఉద్యమిస్తేనే హక్కులు సాధించుకోవచ్చన్నారు. గత ఐదారు సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం కాని కనీస హక్కులు సాధించుకోలేని పరిస్థితిలో మన తెలంగాణ జర్నలిస్టులు ఉన్నారన్నారు. మనం ఇలాగే ఎవరికి వారికి ఉంటే ప్రభుత్వానికి కూడా చిన్నచూపుగానే ఉంటుందన్నారు. అందరం ఏకమై కలాల గళాల బలమెంటో చూపాల్సిన అవసరం ఉందన్నారు.. సీని యర్‌ జర్నలిస్టు కమల్‌ సతీష్‌ మాట్లాడుతూ నిర్బంధాలతో ఏమి సాధిం చలేరని, ఉద్యమాలు, పోరాటాలు జర్నలిస్టులకు కొత్త కాదనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుకుతెచ్చుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్య మంలో రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని అలాంటి వారిని గుర్తించి సంక్షేమ పథకాలు అందించాల్సిందీ పోయి అణిచివేతకు గురిచే స్తున్నా ప్రభుత్వం ఇప్పటికైనా తన ప్రవర్తన మార్చుకోవాలన్నారు. రవిప్ర కాష్‌ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రశ్నించాడని కావాలనే అతనిపై కేసులు నమో దు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా ఆయనను బేషరతుగా విడుదల చేయాలన్నారు. సీనియర్‌ జర్నలిస్టు సంపత్‌ మాట్లాడుతూ బంగారు తెలంగాణ అని చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తుందీ కాని జర్నలిస్టుల ఆరోగ్య పథకం కూడా పనిచేయలేని దుస్థితిలో ఉందన్నారు. ఎప్పుడు అడిగినా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని చెప్పడం కాని చేసిందీ మాత్రం ఒక్కటి లేదన్నారు. రాష్ట్రంలో ప్రజలకు, విద్యార్థులకు, యువతకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించినందుకే రవిప్రకాష్‌పై అక్రమ కేసులు పెట్టారన్నారు. ఇది సరైన పద్దతి కాదని జర్నలిస్టులంతా ఏకమయ్యే రోజు దగ్గర్లోనే ఉందని ఆయన తెలిపారు. సీనియర్‌ జర్నలిస్టులు విజయ్‌ మాట్లాడుతూ విలువలకు కట్టు బడి ఉన్నా మీడియాలోకి మాఫియాను రప్పించి దాని స్వరూపాన్నే మార్చి వేయాలని చూస్తున్న ప్రభుత్వంపై జర్నలిస్టులంతా ఏకమై పోరాటం చేయా ల్సిన అవసరం ఉందన్నారు. జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తివేసి వారికి అందాల్సిన సదపాయాలను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంద న్నారు. రెండు రోజుల జర్నలిస్టు దీక్షలు ముగిశాయని తర్వాత తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీని యర్‌ జర్నలిస్టులు అంజనేయులు, కడారి బాలేశం, రాజేంద్ర పల్నాటి, విజయేంద్రరెడ్డి, ఎన్‌. మధు, సాయి, సతీష్‌, కిరణ్‌, రాజ్‌కిరణ్‌, సత్యం, వినయ్‌, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రెండవరోజు సాగిన జర్న లిస్టుల దీక్షకు ఓయూ జెఏసీ, నిరుద్యోగుల జెఎసి, అడ్వకేట్స్‌ల జెఏసీలతో పాటు ఇతర ప్రజాసంఘాలు తమ మద్దతు ప్రకటించాయి.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here