గురువారమే బలనిరూపణ

0

అసెంబ్లీలో ప్రకటించిన స్పీకర్‌

  • వెంటనే నిర్వహించాలని పట్టుబట్టిన బీజేపీ
  • నేడు వెలువడనున్న సుప్రీంకోర్టు తీర్పు
  • చివరిదశకు చేరుకున్న కర్ణాటక సంక్షోభం
  • రిసార్ట్‌లో ఎమ్మెల్యేలకు రాజభోగాలు

కర్ణాటక రాజకీయ సంక్షోభం ముదిరింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కుమారస్వామి బలపరీక్షకు సిద్ధమయ్యారు. ఇందుకు అధికార పక్షానికి సమయం ఇచ్చిన స్పీకర్‌ రమేష్‌ కుమార్‌.. ఈ నెల 18న విధానసభలో విశ్వాసపరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అయితే స్వయంగా కుమారస్వామినే బలపరీక్షకు సిద్ధమవ్వడంతో సోమవారమే విశ్వాసపరీక్ష పెట్టాలని బీజేపీ పట్టుబట్టింది. అయితే ఇందుకు స్పీకర్‌ నిరాకరించారు. ఎమ్మెల్యేల రాజీనామాలపై మంగళవారం సుప్రీం నుంచి తీర్పు వెలువడనుందని.. ఆ తరువాత విశ్వాసపరీక్ష నిర్వహిస్తామని రమేష్‌ వెల్లడించారు. కాగా ఈ విషయంపై సభలో గందరగోళ పరిస్థితి నెలకడంతో స్పీకర్‌ శాసనసభను వాయిదా వేశారు. అయితే కర్ణాటకలో మొత్తం 224మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 16మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఆ రాజీనామాలను ఆమోదించాలని సుప్రీం తీర్పునిస్తే.. సభలో ఎమ్మెల్యేల సంఖ్య 208కు అవుతుంది. అప్పుడు మ్యాజిక్‌ ఫిగర్‌ 105 అవుతుంది. ప్రస్తుతం శాసనసభలో బీజేపీ సంఖ్యా బలం 107 (ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో కలిపి)గా ఉంది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను తీసేస్తే సంకీర్ణ ప్రభుత్వ సంఖ్యా బలం101 (స్పీకర్‌తో కలిపి)గా ఉంది. ఇలాంటి నేపథ్యంలో విశ్వాస పరీక్ష జరిగితే కుమారస్వామి గెలుపు అసాధ్యంగానే కనిపిస్తోంది.

బెంగళూరు

కర్ణాటక సంక్షోభం క్లైమాక్స్‌కు చేరింది. ఈనెల 18న సంకీర్ణ ప్రభుత్వంపై బలపరీక్ష నిర్వహించనున్నట్లు స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ ప్రకటించారు. 18న ఉదయం 11 గంటలకు విధానసభలో విశ్వాసపరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అంతకు ముందు అసెంబ్లీలో భారతీయ జనతాపార్టీ నేతలు జేడీఎస్‌ – కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన నోటీసును స్పీకర్‌కు సమర్పించింది. కాగా స్పీకర్‌ 18న అవిశ్వాస పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. జేడీఎస్‌-కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామాలపై రాష్ట్ర రాజకీయాలు గందరగోళంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాను అధికారంలో కొనసాగలేనని, శాసనసభలో విశ్వాసపరీక్షకు సిద్ధంగా ఉన్నానని గత శుక్రవారం సీఎం కుమారస్వామి స్వయంగా ప్రకటించడంతో కర్ణాటక రాజకీయ సంక్షోభం కీలక మలుపు తిరిగింది. ఇదిలా ఉండగా.. స్వయంగా కుమారస్వామే బలపరీక్షను ఎదుర్కొంటానని చెప్పడంతో సోమవారమే విశ్వాస పరీక్ష పెట్టాలని భాజపా పట్టుబట్టింది. అయితే ఇందుకు స్పీకర్‌ నిరాకరించారు. ఎమ్మెల్యేల రాజీనామాలపై మంగళవారం సుప్రీం తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఆ తర్వాతే బలపరీక్ష పెడతామని, అందుకు అధికార పక్షం సిద్ధంగా ఉండాలని స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. స్పీకర్‌ నిర్ణయం పట్ల భాజపా నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పు కంటే ముందే బలపరీక్ష పెట్టాలని డిమాండ్‌ చేశారు. ప్లకార్డులు చేతబట్టి శాసనసభలో నిరసన తెలిపారు. దీంతో గందరగోళ వాతావరణం నెలకొనడంతో స్పీకర్‌ సభను మంగళవారానికి వాయిదా వేశారు. అనంతరం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్ధ రామయ్య మాట్లాడుతూ గురువారం తమ ప్రభుత్వం బలపరీక్ష ఎదుర్కోనుందని చెప్పారు. కర్ణాటకలో మొత్తం 224 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరిలో 16 మంది రాజీనామాలు చేశారు. వీరి రాజీనామాలు ఆమోదించాలని సుప్రీంకోర్టు రేపు తీర్పు వెల్లడిస్తే.. సభలో ఎమ్మెల్యేల సంఖ్య 208కి తగ్గుతుంది. అప్పుడు మ్యాజిక్‌ ఫిగర్‌ 105 అవుతుంది. శాసనసభలో భాజపా సంఖ్యా బలం 107(ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో కలిపి). రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను తీసేస్తే సంకీర్ణ ప్రభుత్వ సంఖ్యా బలం 101(స్పీకర్‌తో కలిపి). ఇలాంటి సమయంలో విశ్వాస పరీక్షలో కుమారస్వామి నెగ్గడం దాదాపు అసాధ్యంగానే కన్పిస్తోంది.

రిసార్ట్‌లో ఎమ్మెల్యేలకు రాజభోగాలు

కర్ణాటక రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది.. అనుక్షణం మారుతున్న పరిణామాలతో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపిస్తోంది.. రెబెల్‌ ఎమ్మెల్యే ఎంబీటీ నాగరాజు యూటర్న్‌ తీసుకోవడం సీన్‌ మొటికొచ్చింది. అటు బలపరీక్షకు సమయం దగ్గర పడుతుండటంతో కూటమి నేతలు కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు.. కూటమిని కాపాడుకునేందుకు నేతలు పాట్లు పడుతుంటే.. ఇటు రెబెల్స్‌ మాత్రం రిసార్టుల్లో ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తున్నారు.. సంక్షోభం పుణ్యమా అని రాజభోగాలు అనుభవిస్తున్నారు. కర్ణాటక రాజకీయలు క్షణానికో మలుపు తిరుగుతున్నాయి. కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ప్రకటించిన నాగరాజు యూటర్న్‌ తీసుకున్నారు. ముంబయిలో ఉన్న రెబల్‌ ఎమ్మెల్యేలని కలిసేందుకు అక్కడికి వెళ్లిపోయారు. ఈయనతో పాటు మరో ఎమ్మెల్యే సుధాకర్‌ కూడా వారితో చేరే అవకాశం ఉంది. శనివారం కూటమి పెద్దలందరితో సుధీర్ఘంగా చర్చలు జరిపిన నాగరాజు?. కాంగ్రెస్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కానీ అనూహ్యంగా? ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. దీంతో కూటమి నేతల చర్చలు వృథా అయ్యాయి. కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణం నిలుదొక్కుకోవాలన్నా, అధికారం కోసం ఎదురు చూస్తున్న బీజేపీ ఏకంగా పీఠమెక్కాలన్నా మిగిలింది కొన్ని గంటలు మాత్రమే. ఈ టైమ్‌ అత్యంత కీలకం. ఏ రోజైనా విశ్వాస పరీక్షను ఎదుర్కొంటానన్న సీఎం కుమారస్వామి తన అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. మంగళవారం అసమ్మతుల భవిష్యత్తును సుప్రీంకోర్టు నిర్ణయించనుండటంతో? ఆ రోజు జరిగే పరిణామాలు కూడా చాలా కీలకంగా మారాయి. అటు రెబెల్స్‌ను అనర్హత వేటు కూడా భయపెడుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here