Featuredజాతీయ వార్తలు

ఆర్టికల్‌ 35ఎపై విచారణకు మూడు రోజుల షెడ్యూల్‌

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): దేశంలో అంతర్భాగమైన జమ్మూ కశ్మీర్‌ను ప్రత్యేకంగా పరిగణించే ఆర్టికల్‌ 35ఎ రాజ్యాంగ విరుద్ద మని, ఇది మహిళల పట్ల వివక్ష చూపేలా ఉంద ని పేర్కొంటూ 2014లో ఓ ఎన్జీఓ సహా కొంద రు సుప్రీంకోర్టులో సవాల్‌

చేశారు. జమ్మూ కశ్మీర్‌ పౌరులకు ప్రత్యేక హక్కులు, కొన్ని మినహాయింపులు కల్పించే ఆర్టికల్‌ 35-ఎ రద్దుచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సోమవారం విచారణ ప్రారంభించిన సర్వోన్నత న్యాయస్థానం ఇందుకు షెడ్యూల్‌ నిర్ణయించింది. ఈ కేసులో ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు వాదనలు వింటామని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆర్టికల్‌ 35-ఎలో కొన్ని సవరణలు చేయడానికి కేంద్రం మొగ్గు చూపుతోంది. ఇందుకు సంబంధించి సూచాయగా తన అభిప్రాయాన్ని వెల్లడించడంతో సుప్రీం తీర్పు కీలకం కానుంది. మరోవైపు గత రెండు రోజులుగా కశ్మీర్‌ లోయలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారీగా సైనిక బలగాలను మోహరించి, శ్రీనగర్‌లో 144 సెక్షన్‌ అమలుచేసింది. ప్రభుత్వం తన వైఖరి మార్చుకునే అవకాశం ఉందన్న ఊహాగానాలతో తీవ్ర భయాందోళనలు నెలకున్నాయి. ఆర్టికల్‌ 35ఎ ప్రకారం జమ్మూ కశ్మీర్‌లోని స్థానికేతరులు ఎలాంటి స్థిరాస్తులు కలిగి ఉండటం, కొనుగోలు చేయడం కుదరదు. అంతేకాదు, ప్రభుత్వ ఉద్యోగాలు, ఉపకారవేతనాలు పొందడానికి అర్హులు కారు. అయితే, ఇది మహిళల పట్ల వివక్షత చూపేలా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. స్థానికేతరుడ్ని మహిళలు వివాహం చేసుకుంటే వీరు కూడా స్థానిక అర్హత కోల్పోతారు. కానీ, 2002 అక్టోబరులో దీనిపై జమ్మూ కశ్మీర్‌ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జమ్మూ కశ్మీర్‌ మహిళలు స్థానికేతరులను వివాహం చేసుకున్నా వారు స్థానికులుగా పరిగణించబడతారని స్పష్టం చేసింది. కానీ, వారి పిల్లలకు మాత్రం వారసత్వపు హక్కు ఉండదని తెలిపింది. దేశంలో అంతర్భాగమైన జమ్మూ కశ్మీర్‌ను ప్రత్యేకంగా పరిగణించే ఆర్టికల్‌ 35ఎ రాజ్యాంగ విరుద్దమని పేర్కొంటూ 2014లో ఓ ఎన్జీఓ సుప్రీంకోర్టులో సవాల్‌ చేశాడు. దీన్ని ఆర్టికల్‌ 368 ప్రకారం సవరణ చేసి రాజ్యాంగంలో చేర్చలేదని, పార్లమెంటులో దీనిని ప్రవేశపెట్టలేదని పిటిషన్‌లో పేర్కొన్నాడు. అలాగే గతేడాది జులైలో కశ్మీర్‌కు చెందిన ఇద్దరు మహిళలు సైతం దీనిపై కోర్టును ఆశ్రయించారు. తమ పిల్లలకు వారసత్వపు హక్కులను దూరం చేస్తోన్న ఆర్టికల్‌కు సవరణలు చేయాలని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం కేంద్రం, జమ్మూ కశ్మీర్‌ ప్రభుత్వాలకు నాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేఎస్‌ ఖేర్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌లో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఇది చాలా సున్నితమైన అంశమని, దీనిపై విస్త త చర్చ జరగాలని కేంద్ర తరఫున హాజరైన సొలిసిటరీ జనరల్‌ కే వేణుగోపాల్‌ ధర్మాసనానికి వివరించారు. జమ్మూ కశ్మీర్‌ ప్రభుత్వం సైతం ఫిబ్రవరి 11న సుప్రీంలో హాజరైంది. ఆర్టికల్‌ 35ఎపై రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకోడానికి తమకు అనుమతి ఇవ్వాలని, ప్రస్తుతం ఎన్నికైన ప్రభుత్వం లేదు కాబట్టి విచారణను వాయిదా వేయాలని కోరింది. ఫిబ్రవరి 11న జమ్మూ కశ్మీర్‌ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టుకు హాజరైన న్యాయవాది షోయబ్‌ ఆలమ్‌, వచ్చే విచారణ వాయిదా వేయాలని అభ్యర్థించారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close