Featuredప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

ఆ విదేశియులు వెళ్ళిపోవాల్సిందే..

లైంగిక వేధింపులపై కఠిన చర్యలు

  • ఓవైసీ సోదరులను పక్కన పెట్టుకుని మతం గురించి మాట్లాడడమా?
  • కేసీఆర్‌ తీరుపై మండిపడ్డ కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌

చట్ట వ్యతిరేకంగా దేశానికి వచ్చిన వారిని.. తిరిగి పంపుతామని కేంద్ర ¬ంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఫోక్సో చట్టంలో అనేక మార్పులు తీసుకురాబోతున్నామని ప్రకటించారాయన. హైదరాబాద్‌ లో విూడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు కేంద్ర మంత్రి. తాము ఎక్కడా మతపరమైన ప్రచారం చేయలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రం ఓవైసీ సోదరులను చెరోపక్క కూర్చోబెట్టుకుని మతం గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. ఎక్కడెక్కడైతే విదేశీయులు ఉన్నారో వారందరినీ గుర్తించి గౌరవంగా వాళ్ల దేశానికి పంపిస్తామని చెప్పారు. సైబర్‌కైంపై కొత్త చట్టాలను తీసుకురాబోతున్నామని తెలిపారు. ఈ నెలాఖరులోగా దేశంలోని అన్ని పోలీస్‌ స్టేషన్ల వివరాలు నేరుగా తమకు చేరుతాయని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు.నిత్య విద్యార్థిలా ¬ంశాఖను స్టడీ చేస్తున్నానని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. టెర్రరిజం అంతం, మహిళా రక్షణకే తమ ప్రాధాన్యమన్నారు. బెంగాల్‌లో సీఎం మమతబెనర్జీ తప్పిదాల వల్లే బీజేపీ బలపడిందని పేర్కొన్నారు. మతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందనేది సరికాదని తోచిపుచ్చారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలతో ప్రజలు విసిగిపోయారని ఆయన విమర్శించారు. అసెంబ్లీలో ఎంఐఎం నేతలను పక్కన పెట్టుకుని.. టీఆర్‌ఎస్‌ మతం గురించి మాట్లాడటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయుల్ని వెనక్కి పంపిస్తామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు వేరు.. అసెంబ్లీ ఎన్నికలు వేరని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. విూడియా సమావేశంలో ఎమ్మెల్సీ రామచంద్రరావు తదితరులు పాలప్గొన్నారు.

సొంత నియోజకవర్గంపై ఫోకస్‌ తగ్గించని కిషన్‌ రెడ్డి

కేంద్రమంత్రి అయినా సొంత నియోజకవర్గంపై ఏ మాత్రం ఫోకస్‌ తగ్గించడం లేదు కిషన్‌ రెడ్డి. హైదరాబాద్‌ నగరంలో మరోసారి పర్యటించిన కిషన్‌రెడ్డి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఖైరతాబాద్‌ నియోజక వర్గంలోని ఇందిరానగర్‌ లో ఆయన పర్యటించారు. తన గెలుపునకు కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఉగ్రవాద నిర్మూలనలో ఎన్‌ఐఏ కీలక పాత్ర పోశిస్తుందని కిషన్‌ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఉన్న చట్టాన్ని మరింత బలోపేతం చేసేందుకే కొత్త చట్టం తీసుకు వచ్చినట్టు ఆయన తెలిపారు. అనంతరం కేశవ్‌ మెమోరియల్‌ సొసైటీ 79వ వార్షికోత్సవాల్లో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. నిజాం హయాంలో నిర్భందాలను ఎదుర్కొని వెంకటరామి రెడ్డి, భాగ్యరెడ్డి వర్మ లాంటి మహనీయులు పేదవారి కోసం విద్యా సంస్థలు ఏర్పాటు చేశారని కొనియాడారు. విద్యలో నూతన విధానం తీసుకొచ్చే దిశగా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కిషన్‌ రెడ్డి తెలిపారు..


Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close