మోడీకి దీదీ సవాల్‌

0
  • బొగ్గు మాఫియాలో మా అభ్యర్థులు లేరు..
  • రుజువైతే అభ్యర్థులందరినీ ఉపసంహరించుకుంటా
  • చేయకుంటే ప్రజల ముందు 100 గుంజీళ్లు తీస్తారా?

కోల్‌కతా : సార్వత్రిక ఎన్నికల వేళ మాటలు తూటాలు పేలుతున్నాయి.. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని వర్సెస్‌ మోడీగా పశ్చిమబెంగాల్‌లో ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో బొగ్గు మాఫియాలో విూ అభ్యర్థులున్నారంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై సీఎం మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దమ్ముంటే రుజువుచెయ్యి అంటూ సవాల్‌ విసిరారు. గురువారం ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆమె మాట్లాడుతూ… ‘నేను ప్రధాని మోడీకి సవాలు విసురుతున్నానని, బొగ్గు మాఫియాలో మా 42 మంది లోక్‌సభ అభ్యర్థుల్లో ఎవరైనా ఉన్నట్లు విూరు రుజువు చేస్తే మా అభ్యర్థులందరినీ ఉపసంహరించుకుంటామన్నారు. రుజువు చేయడంలో విూరు విఫలమైతే ప్రజల ముందు విూ చెవి పట్టుకుని 100 గుంజిళ్లు తీయాలంటూ మమత సవాల్‌ విసిరారు. విూరు ఈ సవాలును స్వీకరిస్తారా అంటూ ప్రధాని మోడీని ప్రశ్నించారు. విూభార్య గురించి విూరు పట్టించుకున్నట్లయితే విూరు ఇతరుల సంక్షేమం గురించి కూడా పట్టించుకునే వారని, ఐదేళ్లలో 10 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని విూరు చెప్పారని, ఆ ఉద్యోగాలు ఎక్కడ అంటూ ప్రధానిని ప్రశ్నించారు. పార్లమెంట్‌ నివేదిక ప్రకారం పశ్చిమ బెంగాల్‌లో మేము నిరుద్యోగాన్ని 40శాతం తగ్గించామని, భారత చరిత్ర గురించి మోడీ నాతో చర్చ జరపాలని వ్యాఖ్యానించారు. నేను ప్రధాని మోడీని చెంపదెబ్బ కొడతానని ఎప్పుడూ అనలేదని, ప్రజాస్వామ్య దెబ్బ రుచి చూపెడతానని మాత్రమే అన్నానని మమత వివరణ ఇచ్చారు. భాషను సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండ.. ప్రజాస్వామ్య దెబ్బ అంటే ప్రజల నిర్ణయం అని అర్థం.. నేను ప్రధానిని ఎందుకు కొడతాను అంటూ మమతా బెనర్జీ ప్రశ్నించారు. కాగా ఇటీవల ఓ ర్యాలీలో మాట్లాడిన మమత.. మోడీకి ప్రజాస్వామ్య దెబ్బ అంటే ఏమిటో చూపిస్తామంటూ వ్యాఖ్యానించారు. గురువారం మోడీ.. పశ్చిమ బెంగాల్‌లో పర్యటించిన నేపథ్యంలో మాట్లాడుతూ.. ‘దీదీ చెంపదెబ్బ కూడా నాకు ఆశీర్వాదమే’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మమత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తప్పుడు వ్యాఖ్యలతో ప్రజలను గందరగోళంలో పడేయవద్దని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here