Featuredజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

ఇది ఇన్‌ఫ్రా బంధం..

కొత్త భారత్‌ను నిర్మిస్తున్నాం

  • అవినీతి లేని పాలనను సాగిస్తున్నాం
  • ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌లోనూ భారత్‌ది ప్రత్యేకస్థానం
  • యునెస్కో కేంద్ర కార్యాలయంలో ప్రధాని మోదీ

పారిస్‌: భారత్‌- ఫ్రాన్స్‌ సంబంధాలు ఈనాటివి కాదని.. కష్టనష్టాల్లో ఈ రెండు దేశాలూ పరస్పరం సహకరించుకుంటాయిన ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. నాలుగేళ్ల క్రితం తాను ఫ్రాన్స్‌ వచ్చినపుడు వేలాదిమంది భారతీయులు తనను అభినందించారని గుర్తు చేసుకున్నారు. ఆర్టికల్‌ 370 రద్దుపై మరోసారి ఫ్రాన్స్‌ బహిరంగంగా భారత్‌ కు మద్దతు తెలిసింది. రాజధాని పారిస్‌ లోని యునెస్కో హెడ్‌ క్వార్టర్స్‌ లో భారతీయ కమ్యూటినీ ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. 1950,1966లో ఫ్రాన్స్‌ లోని సెయింట్‌ గర్వైస్‌ లో రెండు వేర్వేరు ఎయిరిండియా విమాన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ,గ్రేట్‌ ఇండియన్‌ న్యూక్లియర్‌ ఫిజిసిస్ట్‌ ¬విూ బాబాకు సెల్యూట్‌ చేస్తున్నట్లు మోడీ తెలిపారు. భారత్‌-ఫ్రాన్స్‌ ల మధ్య స్నేహం ఈ నాటిది కాదని మోడీ అన్నారు. భారత్‌-ఫ్రాన్స్‌ బంధం విడదీయలేనిదన్నారు. కష్ట,నష్టాల్లో భారత్‌, ఫ్రాన్స్‌లు పరస్పరం సహరించుకుంటాయన్నారు. ఫుట్‌ బాల్‌ లవర్స్‌ ఉన్న దేశానికి తాను వచ్చానని, గోల్‌ ప్రాముఖ్యత గురించి ఫ్రాన్స్‌ ప్రజలకు బాగా తెలుసునని,అదే చివరి విజయమని, గతంలో పూర్తి చేయడం అసాధ్యం అనుకున్న గోల్స్‌ ని గడిచిన ఐదేళ్లలో తాము సెట్‌ చేశామని మోడీ అన్నారు. ఈ 21వ శతాబ్దంలో మనం ఇన్‌ ఫ్రా గురించి మాట్లాడుతున్నామని, ఇన్‌ఫ్రా అంటే తన దృష్టిలో ఇన్‌+ఫ్రా అని మోడీ అన్నారు. ఇన్‌ అంటే ఇండియా అని ఫ్రా అంటే ఫ్రాన్స్‌ అని ఇండియా, ఫ్రాన్స్‌ మధ్య సంబంధం అని దీనిర్థమని మోడీ అన్నారు. నవభారత్‌ నిర్మాణం కోసం తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని చెప్పారు. గత ఐదేళ్లలో దేశంలో ఎన్నో సానుకూల మార్పులు వచ్చాయని.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి గర్వకారణమన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగే కాదు.. ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌లోనూ భారత్‌కు ప్రత్యేక స్థానముందని చెప్పారు. అభివృద్ధి పథంలో భారత్‌ వేగంగా దూసుకెళ్తోందన్నారు. సేవ చేసేందుకు దేశ ప్రజలు తమకు మరోసారి అవకాశమిచ్చారని చెప్పారు. దేశంలో అవినీతికి తావు లేకుండా పాలన సాగిస్తున్నామన్నారు. మరోసారి కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చిన 75 రోజుల్లోనే అనేక బలమైన నిర్ణయాలు తీసుకున్నట్లు మోడీ తెలిపారు. సులభతర వాణిజ్యం, జీవన విధానం అమలుకు కృషి చేస్తున్నామని మోదీ చెప్పారు. 2030 నాటికి టీబీ నిర్మూలన ప్రపంచ లక్ష్యంగా ఉందని.. 2025 నాటికే ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు భారత్‌ కృషి చేస్తోందన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడగానే జలశక్తి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశామన్నారు. నీటి సంబంధ సమస్యల పరిష్కారంపై ఈ మంత్రిత్వ శాఖ పనిచేస్తుందన్నారు. దేశం క్రమంగా పేదరికం నుంచి బయటపడుతోందని చెప్పారు. ”భారత్‌ అంకుర సంస్థల రంగంలో వేగంగా దూసుకెళ్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడగానే జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేశాం. నీటి సంబంధ సమస్యల పరిష్కారంపై ఆ మంత్రిత్వ శాఖ పనిచేస్తోంది. పేదలు, చిరు వ్యాపారులు, రైతులకు పింఛనుపై నిర్ణయం తీసుకున్నాం” అని ప్రధాని వివరించారు.

అంతర్జాతీయంగా భారత్‌ కీలకపాత్ర పోషించాలి

కశ్మీర్‌ విషయంలో మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని.. అది పూర్తిగా భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక అంశమని ఫ్రాన్స్‌ తన వైఖరిని మరోసారి పునరుద్ఘాటించింది. మూడు దేశాల పర్యటనలో భాగంగా ఫ్రాన్స్‌లో ఉన్న ప్రధాని మోదీతో భేటీ అయిన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌ వారి అభిప్రాయాన్ని సుస్పష్టం చేశారు. ఇరువురు గురువారం దాదాపు 90 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కశ్మీర్‌ అంశంతో పాటు ద్వైపాక్షిక, రక్షణ, ఉగ్రవాద నిర్మూలన చర్యలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం మెక్రాన్‌ విూడియాతో మాట్లాడుతూ.. ”ప్రధాని(మోదీ) కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితుల గురించి పూర్తిగా వివరించారు. అయితే కశ్మీర్‌ అంశం పూర్తిగా భారత్‌-పాక్‌ల అంతర్గత అంశమని.. ఎలాంటి ఆందోళన పరిస్థితులకు తావివ్వకుండా చర్చించుకోవాలని, మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని స్పష్టం చేశాను” అని తన వైఖరిని తెలిపారు. ఈ సందర్భంగా ఉగ్రవాద నిర్మూలన చర్యలపైనా ఇరుదేశాధినేతలు చర్చించారు. శాంతి స్థాపనకు ఇరు దేశాలు కలిసి పనిచేయాలన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామన్నారు. పారిస్‌ ఒప్పందంలో భారత్‌ పాత్ర ఎనలేదని కొనియాడిన ఫ్రాన్స్‌ అదే తరహాలో అంతర్జాతీయ అంశాల్లో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అంతకు ముందు మోదీ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య పలు అంశాల్లో బంధాన్ని బలోపేతం చేసే దిశగా ఈ చర్చలు సాగుతాయని స్పష్టం చేశారు. ఉభయ దేశాల ప్రజల సుభిక్షమే లక్ష్యంగా మైత్రి కొనసాగుతుందన్నారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ చేరుకున్నారు. అనంతరం ఛాటే డి చంటిల్లీ భవనంలో అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌తో మోదీ సమావేశమయ్యారు. ఇరువురు దాదాపు 90నిమిషాల పాటు సుదీర్ఘ మంతనాలు జరిపారు. మోదీ ఫ్రాన్స్‌తో పాటు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ), బహ్రెయిన్‌ దేశాల్లో అయిదు రోజుల పాటు ఈ నెల 26 వరకు పర్యటించనున్నారు. శనివారం బహ్రెయిన్‌ వెళతారు. ఆ దేశానికి వెళుతున్న తొలి భారత ప్రధాని మోదీయే కావడం విశేషం. 25న తిరిగి ఫ్రాన్స్‌ వచ్చి జీ-7 సదస్సులో పాల్గొంటారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close