ఇదో ప్రత్యేకమైన అనుభూతి : రిషభ్‌ పంత్‌

0

జైపూర్‌ : సౌరవ్‌ గంగూలీ అభినందన ఎంతో ప్రత్యేకమైందని దిల్లీ క్యాపిటల్స్‌ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌ అన్నాడు. సోమవారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రిషభ్‌ పంత్‌ 36 బంతుల్లోనే 78 పరుగుల చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో పంత్‌ను అందరూ ప్రశంసల్లో ముంచెత్తారు. మ్యాచ్‌ ముగిసిన అనంతరం డగౌట్‌లో ఉన్న దిల్లీ సలహాదారు సౌరవ్‌ గంగూలీ సైతం మైదానంలోకి వచ్చి ఆనందంతో రిషభ్‌ను గాల్లోకి లేపాడు. అయితే, ఈ సంఘటన గురించి ప థ్వీ షాతో మాట్లాడుతూ ‘సౌరవ్‌ సర్‌ నన్ను ఎత్తుకొని అభినందించడం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన’ అని పంత్‌ చెప్పాడు. ఇదో ప్రత్యేకమైన అనుభూతి అని పేర్కొన్నాడు. పంత్‌ను ఎత్తుకున్న ఫొటోను దాదా తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశాడు. ‘రిషభ్‌.. యూ డిసర్వ్‌ ఇట్‌’ అంటూ రాసుకొచ్చాడు. ‘మ్యాచ్‌ మలుపు తిప్పిన ఇన్నింగ్స్‌ ఆడావు. దావన్‌ కూడా మరిచిపోలేని ప్రారంభం ఇచ్చాడు’ అని సచిన్‌ ట్విటర్‌లో పేర్కొన్నాడు. వీళ్లతోపాటు పాటు చాలా మంది మాజీ క్రికెటర్లు పంత్‌ను ఆకాశానికెత్తారు. ఈ విజయంతో దిల్లీ క్యాపిటల్స్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here