Featuredప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలు

ఇది మంచి బడ్జెట్‌ : మోడీ

దిల్లీ: కేంద్ర బడ్జెట్పై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరిగాయని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆరోపించారు. మంగళవారం జరిగిన భాజపా పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని మోడీ ఎంపీలనుద్దేశించి ప్రసంగించారు. బడ్జెట్పై గందరగోళ పరిస్థితిని తీసుకురావాలని కొందరు యత్నించారని, అయితే ప్రస్తుత ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో ఇదే ఉత్తమ బడ్జెట్‌ అని ఇప్పుడు విమర్శకులు కూడా అంగీకరిస్తున్నారని మోడీ అన్నారు. ఈ సందర్భంగా బోడో ఒప్పందం గురించి కూడా మోడీ ప్రస్తావించారు. బోడో ఒప్పందంతో పాటు బ్రూ తెగల సమస్యల పరిష్కారానికి చేసుకున్న ఒప్పందాలు తమ ప్రభుత్వ చారిత్రక విజయాలని కొనియాడారు. దశాబ్దాలుగా రక్తపాతం, హింసతో అల్లాడిపోతున్న ఈశాన్య ప్రాంతంలో ఈ నిర్ణయాలు శాంతిని నెలకొల్పుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు, భాజపా ఎంపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన జేపీ నడ్డాను ప్రధాని మోడీ సన్మానించారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close