Featuredస్టేట్ న్యూస్

ముచ్చటగా మూడోస్సారీ..

  • మళ్లీ తెరమీదికి ఫెడరల్‌ ఫ్రంట్‌..
  • చక్రం తిప్పుతానంటున్న కెసిఆర్‌..
  • కేరళ సీిఎంతో మంతనాలు..

కేంద్రంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బిజెపిలకు బోటాబోటీ మెజారిటీ వస్తుంది.. అప్పుడు ప్రాంతీయ పార్టీలే కీలకం అవుతాయి.. అవకాశాన్ని బట్టి దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఏకమై చక్రం తిప్పి అధికారాన్ని చేపట్టాలి… రాష్ట్రాలపై కేంద్రాల బోడి పెత్తనం ఏందని మేమే పాలించుకుంటాం.. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ కెసిఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ను మళ్లీ తెరమీదకి తీసుకొచ్చారు.. ఇంతకు ముందు ఏం జరిగిందో, ఏమో తెలియదు కాని రైతు కాడను వదిలేసినట్టు, ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ను మధ్యలోనే వదిలేశారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో బిజి, బిజీగా మారిపోయిన గులాబీ బాస్‌ రాష్ట్రంలో మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకొన్నారు. రెండవసారి అధికారంలోకి వచ్చి ఐదారేళ్లు దాటిపోయింది. ఇప్పటివరకు ఫ్రంట్‌ మాటెత్తని కెసిఆర్‌ దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తూ మూలకు పడేసిన ఫెడరల్‌ ఫ్రంట్‌ను ముందుకు తీసుకొచ్చారు.. ఇన్నాళ్లు ఆ మాటే ఎత్తని గులాబీబాస్‌ కేంద్రంలో చక్రం తిప్పుతానంటూ రాష్ట్రాల పర్యటన చేపట్టారు. మొదటి విడతలో చేపట్టిన రాష్ట్రాల పర్యటన అనుకున్నంత ఫలితాలు ఇవ్వకపోవడంతో పట్టు వదలని విక్రమార్కుడిలా ఫ్రంట్‌ను మళ్లీ భుజాన నెత్తుకునిరాష్ట్రాల పర్యటనలు షురూ చేశారు.. ఎంతమందీ కెసిఆర్‌కు మద్దతు పలుకుతారో, అసలు ఫెడరల్‌ ఫ్రంట్‌ పురుడు పోసుకుంటుందా, మళ్లీ మధ్యలోనే ఆగిపోతుందో చూడాలంటే మే 23వరకు ఆగాల్సిందే…

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): కేంద్రంలో ఎవరు అధికారాన్ని చేపడుతారో, ఎవరు ప్రతిపక్షనాయకులుగా మిగిలిపోతారో తెలియదు.. దేశంలో ఉ న్న ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఏదో ఒక పార్టీకి మద్దతు పలుకుతూ ముందుకు వెళుతున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బిజెపిలు వారికి అనుకూలంగా ఉన్న రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టే పనిలో బిజీబిజీగా ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేస్తున్నారు. కొంతమంది డైరెక్ట్‌గానూ, మరికొంతమంది ఇన్‌డైరెక్ట్‌గానూ జాతీయ పార్టీలకు మద్దతు పలికే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న చంద్రబాబు కాంగ్రెస్‌కు మద్దతు పలుకగా, తెలంగాణలో ఉన్న కెసిఆర్‌ మాత్రం ఎవరికి సపోర్టు చేస్తున్నారో, ఎవరికి మద్దతు పలుకుతున్నారో ఇప్పటికి అర్ధమే కావడం లేదు. డిల్లీ వెళ్లి బిజెపి ఆగ్రనాయకులను మర్యాదపూర్వకంగా కలుస్తారు. తెలంగాణకు రాగానే బిజెపి నాయకులను మాటల తూటాలతో తూర్పారపడుతారు. ఆయన ఆలోచన ఏంటో, ఆయన వ్యూహం ఏంటో, ఎవరికి సపోర్టు చేస్తారనే విషయం ఇప్పటికి ఎవ్వరికి అంతుబట్టడమే లేదు. తెలంగాణలో రెండవ విడత అసెంబ్లీ ఎన్నికలు కాకముందు కేంద్ర రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్‌ ప్రంట్‌ ఏర్పాటు చేస్తామని రాష్ట్రాల వెంట తిరిగినా కెసిఆర్‌ అనుకోకుండా ప్రంట్‌ను మూసివేశారు.. ఇన్నిరోజులు ఖాళీగానే ఉన్న కెసిఆర్‌ కేంద్రంలో ప్రాంతీయ పార్టీలదే హవా నడవబోతుందని, కాంగ్రెస్‌, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్‌ ప్రంట్‌ను బలోపేతం చేస్తాననంటూ కేరళ పయనమయ్యారు.. ఇన్నిరోజులు ఫ్రంట్‌ మాటెత్తని కెసిఆర్‌ మళ్లీ ఫ్రంట్‌ అని ఎందుకు అంటున్నాడో అర్థం కావడం లేదు. ఇదీ కూడా నాలుగురోజుల హడావుడీ చేసి తీరా ఫలితాలు వచ్చే సమయంలో ఫ్రంట్‌ లేదు టెంట్‌ లేదంటూ మెజారిటీ వచ్చిన పార్టీవైపే సై అంటారా అని ఆరోఫణలున్నాయి.. ఇప్పటికే గత సంవత్సరం నుంచి దేశంలో ఉన్న ప్రధాన పార్టీలైన ఆయా రాష్ట్రాల ప్రాంతీయ నాయకులను కలిసి వచ్చారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన మమతాబెనర్జీ, ఒడిస్సా సిఎం కూడా ఫ్రంట్‌పై ఏలాంటి సంకేతాలు ఇవ్వకపోయేసరికి దాని మధ్యలోనే వదిలేశారు.

ప్రాంతీయ పార్టీలదే కీలకం… నేడు జరుగుతున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే కీలకం కానుంది. జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్‌ హవా కొనసాగాలన్నా, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల మద్దతు తప్పనిసరి. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటూ మళ్లీ రాష్ట్రాల పర్యటన చేపట్టారు. కొన్ని విషయాల మీద కెసిఆర్‌ చాలా నిక్కచ్చిగా, సీరియస్‌గా మాట్లాడుతారు. కొత్త కొత్త విషయాలను తెరమీదకు తేవడంలో ఆయనకు ఆయనే సాటి. అలాంటి ఆలోచనతోనే ఫెడరల్‌ ఫ్రంట్‌ వ్యవహారం బయటికొచ్చింది. దేశంలో థర్డ్‌ప్రంట్‌ గురించిచర్చ జరుగుతున్న వేళ దానికి భిన్నంగా కెసిఆర్‌ మదిలో పుట్టింది ఫెడరల్‌ ఫ్రంట్‌. తాను జాతీయ రాజకీయాల్లో కీలకభూమిక పోషిస్తామని చెపుతున్న ఆయన అందుకు తగ్గట్లుగా ఒక్క అడుగు కూదా ముందుకు వేయరు. జాతీయ రాజకీయాల మీద తన గళాన్ని వినిపించాలన్నదే కెసిఆర్‌ లక్ష్యమైతే సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి మించిన వేదిక మరొకటి ఉండదు. కాని దేశంలో నాలుగు విడతల పోలింగ్‌ ముగిసి ఐదో విడత పోలింగ్‌ జరుగుతున్న వేళ ఫెడరల్‌ ఫ్రంట్‌ మాట కెసిఆర్‌ నోటి నుంచి మరోసారి వచ్చింది. తాజాగా ఆయన కేరళ పర్యటన వెళ్లారు. ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి అందరిని ఒక తాటిపైకి తీసుకొస్తామనే ఆలోచనతోనే ఉన్నామనే ఆలోచనతోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఫెడరల్‌ ఫ్రంట్‌ చర్చల కోసం కేరళకు వెళ్లటానికి ముందు గతంలో కెసిఆర్‌ ఒడిశా, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలకు వెళ్లి అక్కడ ముఖ్యమంత్రులను కలిశారు. ఆయా రాష్ట్రాల్లో పర్యటన సందర్భంగా మమత బెనర్జీ, నవీన్‌పట్నాయక్‌ కలిసినా ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి కీలక వ్యాఖ్యలు చేసిందీ మాత్రం ఏమి లేదు. అదే సమయంలో చర్చలతో పాటు, ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రఖ్యాత దేవాలయాలను సందర్శించారు. తాజాగా కేరళ పర్యటనలో కూడా ఆయన పాతవిధానాన్నే పాటించేలా ఉన్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో చర్చల అనంతరం రామేశ్వరం, శ్రీరంగం ఆలయాల్ని సందర్శించే కార్యక్రమం పెట్టుకున్నట్లు తెలిసింది. పశ్చిమబెంగాల్‌ వెళ్లినప్పుడు అమ్మవారి దేవాలయాన్ని సందర్శించారు. ఒడిశాలో పూరీ జగన్నాథ దేవాలయానికి వెళ్లారు. కెసిఆర్‌ పర్యటనలో అప్పట్లో ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌ మాట్లాడుతూ ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి తాము అస్సలు చర్చించలేదని దేవాలయాలు దర్శించుకోవటానికి వచ్చినట్లుగా ఆయన అప్పుడు చెప్పారు. ఇప్పుడు తాజా పర్యటన చూస్తుంటే కేరళ సిఎంతో చర్యలు ఆనంతరం దేవాలయాల సందర్శన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. చర్యల పేరు మీద దేవాలయాను చూస్తున్నారో లేదా దేవాలయాల పేరు మీద ఫ్రంట్‌ చర్చలు జరుపుతున్నారో అర్థమే కావడం లేదు. నిజంగా కెసిఆర్‌కు కేంద్రానికి దీటుగా ప్రత్నామ్యాయంగా ఎదగాలని ఆలోచనే ఉంటే ముందుగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న జగన్‌తో చర్యలు జరిపేవారు. గతంలో కూడా వైజాగ్‌ వెళ్లినప్పుడు జగన్‌ కలవకుండా, అధికారంలో ఉన్న చంద్రబాబును సంప్రదించకుండా ఇతర రాష్రాలకు పయనమవుతున్నారు. పక్కన వారిని వదిలేసి దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన నాయకులను కలుస్తున్నారు. ఇతర రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలకు చెందిన నాయకులు మాత్రం చర్చలు జరుపుతున్నారు కాని పెడరల్‌ ఫ్రంట్‌కు ఒక బలమైన మద్దతు ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఫెడరల్‌ ఫ్రంట్‌ బలంగా తయారు కావడానికి ఇంకెలాంటి వ్యూహాలు పన్నుతారో చూడాల్సిందే..

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close