మూడోవిడత ప్రాదేశిక పోరు

0

  • 161 జడ్పీటీసీలు, 1,738 ఎంపీటీసీలకు ఎన్నిక
  • ఎన్నికల బరిలో 5,723 మంది అభ్యర్థులు
  • ఉదయం 7నుంచి సాయంత్ర 5 వరకు పోలింగ్‌
  • అన్ని స్థానాలకు 27న జరుగనున్న కౌంటింగ్‌
  • పోలింగ్‌ కేంద్రాల దగ్గర 144 సెక్షన్‌ అమలు

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ప్రాదేశిక ఎన్నికల తుది అంకం మంగళవారం జరుగనుంది. మంగళవారం మూడో విడతతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోరు ముగియనుంది. తెలంగాణలో చివరి దశ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. చివరిదైన మూడవ దశలో 161 జడ్పీటీసీలు, 1,738 ఎంపీటీసీలకు మంగళవారం ఎన్నికలు జరుగనున్నాయి. ఉదయం ఏడింటి నుంచి సాయంత్రం ఐదు గంటలదాకా పోలింగ్‌ జరుగుతుంది. ప్రచారపర్వం ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. తుది రోజు కావడంతో అన్ని పార్టీల అభ్యర్ధులూ ప్రచారాన్ని ¬రెత్తించారు. పార్టీల ముఖ్య నేతలు కూడా చివరి రోజు పాల్గొని తమ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారాన్ని నిర్వహించారు. మూడో విడత ఎన్నికలు జరిగిన అనంతరం… అన్ని దశల్లో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీల ఓట్ల లెక్కింపు 27న జరగనుంది. ఫలితాలు అదే రోజు వెల్లడవుతాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్‌ జరుగుతుంది.మొదటి, రెండు విడతల్లో పోలింగ్‌ ను విజయవంతంగా నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. మూడో విడతకు అన్ని ఏర్పాట్లను దాదాపుగా పూర్తి చేసింది. మూడో విడతలో 27 జిల్లాల్లో 161 జడ్పీటీసీ స్థానాలకు 741 మంది.. 1,738 ఎంపీటీసీ స్థానాలకు 5,723 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మూడో విడతలో 30 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. కలెక్టర్ల విచారణ అనంతరం అధికారికంగా ప్రకటించనున్నారు. మూడోవిడత పరిషత్‌ ఎన్నికలకు ఈసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. జడ్పీటీసీ అభ్యర్థులకు తెలుపు రంగు బ్యాలెట్‌ పేపర్‌, ఎంపీటీసీ అభ్యర్థులకు గులాబీ రంగు బ్యాలెట్‌ పేపర్లను వాడుతున్నారు. ఓటర్ల ఎడమ చేతి మధ్య వేలుకు సిరా చుక్క పెట్టనున్నారు. పోలింగ్‌ జరిగే ప్రాంతాల్లో స్థానికేతరులు ఉండరాదని సూచించింది. ప్రచారం కోసం వచ్చిన స్థానికేతరులు ఆయా ప్రాంతాలను వదలి వెళ్లాలని ఆదేశించింది. ఎన్నికలు ముగిసే వరకు ఆయా ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూసిశారు. ఎలాంటి ఇబ్బందులకు తావు లేకుండా పోలింగ్‌ కేంద్రాల దగ్గర 144 సెక్షన్‌ ను విధించారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం, డబ్బు, ఇతర వస్తువులు పంపిణీ చేసేవారిపై నిఘా పెడుతున్నారు. పరిషత్‌ ఎన్నికల సందర్భంగా పోలింగ్‌ కేంద్రాల్లో ఫొటోలు తీసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. పోలింగ్‌ కేంద్రాల్లో ఫొటోలు తీసేవారికి రెండేండ్ల జైలు శిక్షతోపాటు రూ.2 వేల వరకు జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here