వాళ్ళకు ఒక్క సీటు కూడా రాదు..

0
  • ఇక నాలుగున్నరేళ్లు అభివృద్ధిపై దృష్టి
  • కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే
  • తెలంగాణలో బీజేపీకి స్థానం లేదు
  • పార్టీ ప్రధాన కార్యదర్శులను హెచ్చరించిన కేటీఆర్‌!

ఈ ఎన్నికలు అయ్యాక నాలుగున్నరేళ్లు అభివృద్ధిపై దృష్టి సారించే అవకాశముంటుందన్నారు? పటిష్టమైన మున్సిపల్‌ చట్టం తీసుకు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావిస్తున్నారని, అవినీతిని పారద్రోలాలనే ఈ చట్టం తీసుకువస్తోందని తెలిపారు కేటీఆర్‌.. ఇందుకు సంబంధించి అసెంబ్లీలో మున్సిపల్‌ బిల్లును ఆమోదం తీసుకోవాల్సి ఉందన్నారు.. లోక్‌సభ ఎన్నికల్లో 16 సీట్లు గెలిచి ఢిల్లీలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తామన్నారు కేటీఆర్‌.. టెక్నాలజీ తనవల్లే వచ్చిందని చెప్పుకునే చంద్రబాబు ఈవీఎంలు ట్యాంపరింగ్‌ అనటం హాస్యాస్పదంగా ఉందన్నారు? మే 23న ఏం జరుగుతుందో తేలిపోతుంది? ఒకవేళ పొరపాటున చంద్రబాబు గెలిస్తే ఈవీఎంలపై ఇప్పుడు చేస్తున్న ఆరోపణల సంగతేంటని ప్రశ్నించారు కేటీఆర్‌.. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే వస్తుందన్నారు? ప్రచారం చేస్తేనే ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రయత్నాలు చేసినట్టా? ఫెడరల్‌ ఫ్రంట్‌పై అందరితో కేసీఆర్‌ మాట్లాడుతూనే ఉన్నారని స్పష్టం చేశారు? తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని? ఒక్క సీటు కూడా రాదన్నారు కేటీఆర్‌..

రానున్న జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయ భేరి మోగిస్తుందన్నారు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల మాదిరే ఈ ఎన్నికల్లోను ప్రజలు పార్టీకి బ్రహ్మరథం పడతారని తెలిపారు. మొత్తం 32 జడ్పీ పీఠాలను, 530కి పైగా మండల పరిషత్‌లను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సన్నద్ధతపై తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు పంచాయతీరాజ్‌ వ్యవస్థకు ప్రాణప్రదమైనమని చెప్పారాయన. అన్ని జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లలో టీఆర్‌ఎస్‌ పాలకవర్గాలు ఉంటే పాలనాపరమైన సౌలభ్యాలుంటాయని తెలిపారు. పార్టీల ప్రాతిపదికనే ఎన్నికలు జరుగుతున్నందున వీటిని కూడా అందరూ కీలకంగా భావించాలని సూచించారు. ఇప్పటికే రెండు ఎన్నికలలో పాల్గొన్నామనే భావనతో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలూ నిర్లక్ష్యం చేయొద్దని పార్టీ ప్రధాన కార్యదర్శులను హెచ్చరించారు కేటీఆర్‌. వారం, 10 రోజుల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉందన్నారు కేటీఆర్‌. దీనికి అనుగుణంగా ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయాలని ప్రధాన కార్యదర్శులకు సూచించారాయన. గత నెల రోజులుగా పార్లమెంట్‌ అభ్యర్థుల గెలుపుకోసం పర్యటించిన విధంగానే, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేయాలని కోరారు కేటీఆర్‌. ప్రజాప్రతినిధులతో పాటు, మాజీ మంత్రులు, సీనియర్‌ నాయకుల సేవలను వినియోగించుకొని ముందుకెళ్లాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గ్రామగ్రామాన ప్రచారం చేయాలని దిశానిర్దేశం చేశారు కేటీఆర్‌.

ఓటమి భయంతోనే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈవీఎంల పని తీరును ప్రశ్నిస్తున్నారని, ఆయన ప్రవర్తనలో ఓటమి స్పష్టంగా కనిపిస్తోందని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. తెరాస భవన్‌లో ఆయన విూడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ప్రజల పట్ల నమ్మకం లేకనే ఆయన ఢిల్లీలో నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా తీర్పును స్వాగతించాలి కానీ చంద్రబాబులా గగ్గోలు పెట్టొద్దన్నారు. తాను గెలిస్తే భేష్‌ అని లేకపోతే ఈవీఎంల తప్పు అని ఎలా అంటారని ప్రశ్నంచారు. బాబు దారి తప్పి గెలిస్తే ఈవీఎంల తీర్పును ఏమంటారని అన్నారు. చంద్రబాబు ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలన్నారు. 2014 ఎన్నికల్లో ఈవీఎంలతో గెలిచిన బాబు.. నేడు మాత్రం వాటిని ప్రశ్నించటం హాస్యాస్పదమన్నారు. మంచి పథకాలను తీసుకురావటం కంటే... ఉన్నతమైన విధానాలకు రూపకల్పన చేసినప్పుడే అభివృద్ధి వేగంగా సాగుతుందని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఇందులో భాగంగా అవినీతి లేని సమాజం కోసం త్వరలో కొత్త మున్సిపల్‌ చట్టాన్ని తీసుకువచ్చే దిశగా చర్యలు సాగుతున్నాయని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో భాజపా, కాంగ్రెస్‌లకు డిపాజిట్లు గల్లంతవుతాయని జోస్యం చెప్పారు. కేంద్రంలోనూ సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని, అందులో స్థానిక పార్టీలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని కేటీఆర్‌ పేర్కొన్నారు. 

ఎన్నికల నియమావళి అమలులో ఉన్న సమయంలో భాజపా నేతలు తరలిస్తున్న రూ.8 కోట్లకు క్లీన్‌ చిట్‌ ఇవ్వటం పై స్పందించిన కేటీఆర్‌..సెల్ఫ్‌ చెక్‌ విూద ఇంత పెద్ద మొత్తం బ్యాంకులు ఎలా మంజూరు చేశాయని ప్రశ్నించారు. ఎలక్షన్‌ కమిషన్‌ పని తీరుపై స్పందిస్తూ.. ఎలక్షన్‌ కమిషన్‌ విషయంలో వేలు పెట్టే హక్కు తమకు లేదని, కానీ, ఈసీ పనితీరులో మాత్రం మార్పులు అవసరమని అభిప్రాయపడ్డారు. ఓట్ల గల్లంతు విషయంలో ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో తెరాస 16 స్థానాలను సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఒకటి రెండు పథకాలతో ఓట్లు పడవు

ఒకటి రెండు పథకాలతో ఓట్లు పడవని కేటీఆర్‌ అన్నారు. అన్ని సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు సంతృప్తి చెందితేనే ఓట్లు వేస్తరు. పార్లమెంట్‌ ఎన్నికల్లో 5 స్థానాల్లో కాంగ్రెస్‌ డిపాజిట్‌ గల్లంతు అవుతుంది. మరో ఐదు స్థానాల్లో కాంగ్రెస్‌ మూడో స్థానంలో ఉంటది. తెలంగాణ సమాజం బీజేపీని ఆదరిస్తారని అనుకోవడం లేదు. పారదర్శక పాలనను ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు స్వాగతిస్తాయని అనుకుంటున్నాం. రెవెన్యూలో మెజారిటీ ఉద్యోగులు మంచివారే.. కొంతమంది వల్లే సమస్యలు వస్తున్నాయి. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఏబీ వెంకటేశ్వర్‌రావు ఏం చేశారో అందరికీ తెలుసు. ఆంధ్రజ్యోతి పేపర్‌లో జాహ్నవి పేరుతో తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా కథనాలు రాశారు. అలాంటి అధికారులను బదిలీ చేస్తే చంద్రబాబుకు ఎందుకంత భయం. మా అంచనా ప్రకారం కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

మే 20లోపు లోకల్‌ బాడీస్‌ ఎన్నికలు పూర్తి

మే 20 లోపు లోకల్‌ బాడీస్‌ ఎన్నికలు పూర్తచేయాలన్నది సీఎం కేసీఆర్‌ లక్ష్యమని కేటీఆర్‌ అన్నారు. ఎన్నికలు పూర్తయితే అభివృద్ధిలో ముందుకెళ్లొచ్చునని అభిప్రాయపడ్డారు. కొత్త మున్సిపల్‌ చట్టం తేవడం, రెవెన్యూ శాఖను ప్రక్షాలన చేయడం సీఎం కేసీఆర్‌ లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. లంచం,అవినీతి నిర్మూలించడమే టార్గెట్‌గా పెట్టుకొని తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

అంబేడ్కర్‌ అందరివాడు..

భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ అందరివాడని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. అంబేద్కర్‌ ఒక కులానికో..ఒక వర్గానికో పరిమితమైన వ్యక్తి కాదన్నారు. గాంధీ, నెహ్రూలకు ఏ మాత్రం తీసిపోని దార్శనికుడని కొనియాడారు. అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగం వల్లే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని తెలిపిన కేటీఆర్‌.. తెలంగాణ సాధనలో అంబేద్కర్‌ విధానాలతోనే కేసీఆర్‌ వెళ్లారని చెప్పారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం అంబేడ్కర్‌ 128వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌, మంత్రులు మహమూద్‌ అలీ, కొప్పుల ఈశ్వర్‌ పాల్గొని అంబేద్కర్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..శాసనసభ అనుమతి..శాసనసభ అప్రూవల్‌..అవసరం లేకుండానే భారత ప్రభుత్వం పార్లమెంట్‌లో నేరుగా బిల్లు పెట్టి కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయవచ్చని అనే అంశాన్ని పొందుపర్చడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శ్రీరామ రక్ష అయ్యిందన్నారు. ఉమ్మడి ఏపీ శాసనసభలో ఎంతటి ఇబ్బందికరమైన పరిస్థితి ఉందో అందరికీ తెలిసిందేన్నారు. అంబేద్కర్‌ తత్వం భారతదేశానికి అవసరం ఉందని..ఆయన రచించిన రాజ్యంగానికి గౌరవిస్తూ..అల్పాసంఖ్యాకులకు ప్రభుత్వాలు అండగా..రక్షణగా నిలిచి..వారి హక్కులను నిలబెట్టిన నాడే అంబేద్కర్‌కు నిజమైన నివాళి అని కేటీఆర్‌ వెల్లడించారు. పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్‌ విగ్రహ వివాదంపై ఆయన స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు.

అందుకే బావతో ఛాలెంజ్‌ చేశా

తాజాగా తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన విషయం తెలిసిందే కాగా ఈ నేపథ్యంలో తెలంగాణలో టీఆర్‌ఎస్‌ భారీ మెజరిటీతో విజయకేతనం ఎగురవేస్తుందని దీమా వ్యక్తం చేశారు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. అయితే అత్యధిక మెజరిటీలో మొదటి స్థానంలో మెదక్‌, రెండో స్థానంలో వరంగల్‌, ఇక మూడు లేదో నాలుగో స్థానంలో నిలుస్తాయన్నారు కేటీఆర్‌. ఆదివారం కేటీఆర్‌ విూడియా సమవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ అయితే లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రజలను మరింత ఉత్తేజపరచడానికే తన భావ హరీశ్‌ రావుతో సరదాగా ఛాలెంజ్‌ విసిరానని చెప్పారు. మెదక్‌ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇలాక అని, అక్కడ కచ్చితంగా టీఆర్‌ఎస్‌కు భారీ మెజారిటీ వస్తుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here