సామ్రాజ్యం కోసం వాళ్లు, సాధికారత కోసం మేము

0

చెన్నై: బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న విపక్షాలపై ప్రధాని మోదీ మరోసారి నిప్పులు చెరిగారు. దేశం కోసం బీజేపీ పాటుపడుతుంటే, విపక్షాలు అవకాశవాద కూటమి కోసం వెంపర్లాడుతున్నా యని అన్నారు. సొంత సామ్రాజ్యాలు కట్టుకో వాలని కూటమి నేతలు ప్రయత్నాలు చేస్తుంటే, ప్రజల సాధికారతకు బీజేపీ కట్టుబడి పనిచేస్తోం దని చెప్పారు. తమిళనాడులోని ఐదు పార్లమెం టరీ నియోజకవర్గాలకు చెందిన బూత్‌ స్థాయి బీజేపీ కార్యకర్తలకు మోదీ ఆదివారంనాడు దిశానిర్దేశం చేశారు. ‘ఇతర పార్టీల్లా ఓటు బ్యాంకు రాజకీయాలు, విభజించి పాలించే రాజకీయాలకు బీజేపీ పాల్పడదు. వీలున్నంత మేరకు దేశానికి సేవ చేయడమే పార్టీ ఉద్దేశం. రాబోయే ఎన్నికలు బీజేపీకి, దేశానికి చాలా కీలకం. అభివృద్ధి అజెండాను ముందుకు తీసుకు వెళ్లడమే మన పని. అభివృద్ధి అజెం డాకూ, ఆనువంశిక పార్టీలు-అవకాశవాద కూటములకు మధ్య

ఈ ఎన్నికలు జరుగుతున్నాయి’ అని మోదీ పేర్కొన్నారు. మోదీ చెడ్డవాడు, ప్రభుత్వం పనిచేయలేదంటే ఈ కూటమి (ఏర్పాటు) ఎందుకు? విూ విూద విూకు నమ్మకం లేదా? మనది పనిచేసే ప్రభుత్వం అని వాళ్లకూ తెలుసు’ అని విపక్షాలను ఉద్దేశించి మోదీ చురకలు వేశారు. బీజేపీ ప్రభుత్వంతో యువకులు, రైతులు, మహిళలతో సహా సమాజంలోని అన్ని వర్గాలకూ ‘గట్టి బంధం’ పెనవేసుకుందని ప్రధాని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here