అప్పులను పెంచిన ఘనత వారిదే

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా టీపీసీపీ చీఫ్‌, ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి గాంధీ భవన్‌లో జాతీయ జెండా ఎగరవేశారు. యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ వలనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ ఎంపీలు పోరాటం చేయడం వల్లనే ప్రజల ఆకాంక్ష నెరవేరిందన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 60 ఏళ్లలో 69వేల కోట్లు అప్పు అయితే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2లక్షల 60 వేల కోట్ల అప్పు అయ్యిందన్నారు. కానీ దానికి తగిన అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ.. తరతరాల వరకు తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోతారని అన్నారు. ప్రస్తుత పాలకుల వల్ల రాష్ట్రం అప్పులపాలైందన్నారు. 60 వేల కోట్ల నుంచి లక్షా 85 వేల కోట్లకు అప్పులను పెంచిన ఘనత టీఆర్‌ఎస్‌ సర్కార్‌దేనన్నారు. విభజన చట్టంలో పెట్టిన ఏ హామీని కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిలబెట్టుకోలేదన్న ఉత్తమ్‌.. రాష్ట్రంలో నిరుద్యోగ యువత నైరాశ్యంలో ఉందన్నారు. ఏక కాలంలో రైతుల రుణమాఫీ చేయాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు. ”విభజన హామీలు అమలు చేయడం లో కేంద్రం విఫలమయ్యింది. గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్‌ వ్యాగన్‌ ఫ్యాక్టరీ. టీఎస్‌పీఎస్‌లో నమోదు చేసుకున్న నిరుద్యోగులే 12 లక్షల మంది ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులు అయిన నిరుద్యోగ భృతి విధి విధానాలు రూపొందించలేదు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయాలి. ప్రజాస్వామ్య బద్ధమైన రంగాలను ప్రభుత్వం అణచి వేస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్య బద్దంగా గెలిచిన ఎమ్మెల్యే లను కొనుగోలు చేస్తున్నారు. దీన్ని అందరూ ఖండించాలి. ముందస్తు ఎన్నికల్లో కంటే ఎంపీ ఎలక్షన్‌ లో మాకు మంచి రిజల్ట్స్‌ వచ్చాయి. బీజేపీ లక్కీ గా నాలుగు సీట్లు గెలిచింది. తెలంగాణ లో టీఆర్‌ఎస్‌ను ఓడించేది కాంగ్రెస్‌ పార్టీ ఒక్కటే” అని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here