ఉభయ హైకోర్టుల న్యాయమూర్తులు వీరే..

0

తెలంగాణ సీజేగా టీబీ రాధాకష్ణన్‌ కొనసాగింపు

ఏపీ హైకోర్టుకు కొత్త సీజే జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ నియమితులయ్యారు. జనవరి 1న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ రాధాకష్ణన్‌ తెలంగాణ సీజేగా కొనసాగ నున్నారు. ఈ మేరకు కేంద్రం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరితో పాటు జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహన్‌, జస్టిస్‌ రామ సుబ్రమణియన్‌ను తెలంగా ణకు కేటాయిస్తున్నట్లు తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో తెలంగాణకు కేటాయించిన న్యాయమూర్తుల సంఖ్య 13కు చేరింది. ఉమ్మడి హైకోర్టును విభజిస్తూ రాష్ట్రపతి బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు విభజన, న్యాయమూర్తుల కేటాయింపు జరిగినప్పటికీ ప్రధాన న్యాయమూర్తి ఎవరనేది ఆ ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. ఈ నేపథ్యంలో ఈ నియామకాలు జరిగాయి. ఉమ్మడి హైకోర్టులో మొత్తం 27 మంది న్యాయ మూర్తులు సేవలందిస్తుండగా 14 మందిని ఏపీకి, 10 మందిని తెలంగాణకు కేటాయించారు. ఏపీకి కేటాయించిన వారిలో జస్టిస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఉన్నారు. వారందరిలో సీనియర్‌గా ఉన్న ఉన్న నేపథ్యంలో జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ను ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వులతో ఏపీలో 14 మంది, తెలంగాణలో 13 మంది న్యాయమూర్తులు సేవలందించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here