చాన్స్‌ఏ లేదు దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి

0

‘జెర్సీ’ని హిందీలో రీమేక్‌ చేయడం తన వల్ల కాదని అంటున్నారు దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి. నేచురల్‌ స్టార్‌ నాని కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోయే చిత్రాన్ని అందించిన దర్శకుడాయన. గత శుక్రవారం విడుదలైన ‘జెర్సీ’ చిత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్‌సీస్‌లోనూ మంచి టాక్‌ అందుకుంటోంది. ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా సినిమాకు ఫిదా అయిపోయారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా ‘జెర్సీ’ హిందీ రీమేక్‌ గురించి గౌతమ్‌ మాట్లాడారు. ‘ఇంత త్వరగా సినిమా రీమేక్‌ గురించి మాట్లాడలేం. ఇప్పటికైతే ఆ ఆలోచనలు లేవు’ అన్నారు. ఒకవేళ హిందీలో రీమేక్‌ చేస్తే దానికి కూడా మీరే దర్శకత్వం వహిస్తారా? అన్న ప్రశ్నకు.. ‘నా వల్ల కాదండి..’ అని బదులిచ్చారు గౌతమ్‌.

ఇప్పటికే తెలుగులో బ్లాక్‌బస్టర్‌ విజయాలు అందుకున్న సినిమాలు హిందీలో రీమేక్‌ అవుతున్నాయి. మాత కను తెరకెక్కించిన దర్శకులే.. రీమేక్‌లనూ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ‘అర్జున్‌ రెడ్డి’ సినిమా హిందీలో ‘కబీర్‌ సింగ్‌’ టైటిల్‌తో రీమేక్‌ అవుతోంది. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. మరోపక్క ‘ప్రస్థానం’ సినిమా కూడా బాలీవుడ్‌లో ఇదే టైటిల్‌తో రీమేక్‌ అవుతోంది. ఒరిజినల్‌ సినిమాను తెరకెక్కించిన దేవ కట్టా దీనికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here