జట్టుపై నమ్మకం ఉంది : కోహ్లీ

0

ముంబయి : మా జట్టుపై నమ్మకం ఉందని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. మిగిలిన మ్యాచుల్లో విజయాలు సాధిస్తే ప్లేఆఫ్‌కు చేరుకునే అవకాశాలున్నాయని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఒత్తిడి నుంచి బయటపడి తిరిగి పుంజుకుంటామని అన్నాడు. సోమవారం ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. దీంతో బెంగళూరు తన ఖాతాలో ఏడో పరాజయాన్ని మూట కట్టుకుంది. అయితే గత మ్యాచ్‌లో 19వ ఓవర్‌ పవన్‌ నెగికి ఇవ్వడంపై స్పందించిన కోహ్లీ.. ఇద్దరూ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్‌ క్రీజులో ఉండటం వల్ల లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ను ప్రయోగించామని, కానీ అది సఫలం కాలేదని పేర్కొన్నాడు. క్రికెట్‌లో మొదట ఒత్తిడిని జయించాలని, అప్పుడే విజయాలు సొంతమవుతాయని అన్నాడు. గత రెండు మ్యాచుల్లోనూ మేము అదే సూత్రాన్ని పాటించామన్నాడు. మొదటి మ్యాచులో గెలిచినా.. రెండో మ్యాచులో కొద్ది తేడాతో ఓడిపోవాల్సి వచ్చిందన్నాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తన తర్వాతి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో తలపడనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here