దేశాన్ని ముందుకు నడిపేలా కేబినెట్‌ ఉంది

0

2023 నాటికి తెలంగాణలో బీజేపీని బలోపేతం చేస్తాం

  • బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్‌

న్యూఢిల్లీ, దేశాన్ని ముందుకు నడిపేలా కేబినెట్‌ ఉందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. శాఖల కేటాయింపు ప్రధాని మోదీ పాలనపై ప్రజల్లో మరింత విశ్వాసాన్ని పెంచే విధంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ అహంకారానికి ప్రజలు బుద్ధి చెప్పారని హెచ్చరించారు. నాలుగు సీట్లు గెలిచినందుకు కేంద్రమంత్రి అమిత్‌ షా ప్రత్యేకంగా అభినందించారని, అనుకున్న దానికంటే ఎక్కువ ఓట్లు తెచ్చామన్నారు. 2023లో తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు చేసేలా.. బీజేపీని బలోపేతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెలంగాణలో సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ ల అహంకారానికి ప్రజలు బుద్ధిచెప్పిన విధంగా ఓటింగ్‌ జరిగిందని అన్నారు. తాజా ఫలితాలు చూసి టీఆర్‌ఎస్‌ నాయకుల్లో కలవరం మొదలైందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కేసీఆర్‌ ఏకపక్ష పాలనతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లక్ష్మణ్‌ విమర్శించారు. ఐదేళ్లు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ తెలంగాణలోని ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైందని, కేసీఆర్‌ ప్రభుత్వ తీరును ప్రజల్లో ఎండగట్టడం పూర్తిగా వైఫల్యం చెందిందని లక్ష్మణ్‌ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పని అయిపోయిందని, టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ పార్టీనే అని లక్ష్మణ్‌ అన్నారు. 2023న జరిగే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యేలా ప్రజల్లోకి వెళ్తామని లక్ష్మణ్‌ అన్నారు. ఇక, కేంద్రంలో కొలువుదీరిన కొత్త క్యాబినెట్‌ పైనా ఆయన స్పందించారు. శాఖల కేటాయింపు మోదీ మార్కు పాలనకు నిదర్శనమని అన్నారు. ఇది దేశాన్ని ముందుకు నడిపించే క్యాబినెట్‌ అని లక్ష్మణ్‌ అభివర్ణించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here