Featuredరాజకీయ వార్తలు

‘నోట’ కరచిన ఓట్లు ఎన్నో..

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌):

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో నోటాకు 17,792 ఓట్లు పోలయ్యాయి. 2014 ఎన్నికలతో పోల్చితే 5,455 ఓట్లు అధికంగా పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, పాలేరు, ఖమ్మం, మధిర, సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లో నోటా ఓట్లు పెరిగాయి. పినపాక, భద్రా చలం నియోజకవర్గాల్లో మాత్రం తక్కువగా నమోదయ్యాయి. కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని జాతీయ స్థాయి పార్టీలను మించి నమోదు కావటం విశేషం.

కొత్తగూడెంలో 9మంది స్వతంత్య్ర అభ్యర్థులు, పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(పీపీవోఐ), లోక్‌తాంత్రిక్‌ సర్వజన్‌ సమాజ్‌ పార్టీ(ఎల్‌ఎల్‌ఎస్‌పీ), ఆమ్‌ఆద్మీ పార్టీ(ఏఏపీ), బహుజన్‌ ముక్తి పార్టీ (బీఎస్‌ఎంపీ) అభ్యర్థుల కంటే నోటాకు పడిన ఓట్లే ఎక్కువ. ఇల్లెందులో 12 మంది స్వత్రంత అభ్యర్థులు, ఆమ్‌ఆద్మీ పార్టీ అభ్యర్థి కంటే నోటాకే ఎక్కువ ఓట్లు పోలవ్వటం విశేషం. అశ్వారావుపేటలో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు, పీపీవోఐ, భాజపా, బహుజన సమాజ్‌ పార్టీ(బసపా), పాలేరులో అయిదుగురు స్వతంత్ర అభ్యర్థులు, భాజపా, బీఎస్పీ, పీపీవోఐ, తెలంగాణ కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(టీసీపీవోఐ), జై స్వరాజ్‌ పార్టీ(జేఎస్పీ) అభ్యర్థుల కంటే నోటాకు పడిన ఓట్లే అధికం. ఖమ్మంలో ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు, భాజపా, బీఎల్‌పీ, బీఎస్‌పీ, పీపీవోఐ అభ్యర్థుల కంటే నోటాకు పడిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. భాజపా అభ్యర్థి ఉప్పల శారద, బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి పాల్వంచ రామారావులకు నోటాకంటే తక్కువ ఓట్లు నమో దయ్యాయి. మధిరలో 3గురు ఇండిపెండెంట్లు, బసపా, పీపీవోఐ, టీసీపీవోఐ అభ్యర్థుల కంటే నోటాకే ఓట్లు అధికం.పినపాకలో చిన్న పార్టీలైన భారతీయ బహుజన్‌ క్రాంతిదళ్‌, తెలంగాణ ప్రజాపార్టీ, జీజీపీ, ఎల్‌ఎల్‌ఎస్‌పీ, బీఎంపీ, పీపీవోఐ, శివసేన అభ్యర్థులతోపాటు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులకంటే నోటాకే అధి కంగా ఓట్లు పోలయ్యాయి. సత్తుపల్లిలో భాజపా, పీపీవోఐ, బీఎ స్పీ, ఇండియా ప్రజాబంధు పార్టీ, జేఎస్పీ, ఇద్దరు స్వతంత్ర అభ్య ర్థుల కంటే అధికంగా నోటాకు ఓట్లు వచ్చాయి. వైరాలో బీఎస్పీ, భాజపా, పీపీవోఐ, బీఎంపీ, నలుగురు స్వతంత్ర అభ్యర్థు లకంటే నోటాకే ఓట్లు అధికంగా పోలయ్యాయి. భద్రాచలంలో ఇద్దరు స్వ తంత్ర అభ్యర్థులు, పీపీవోఐ, రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండి యా(ఎ), బీఎస్పీ, భాజపా అభ్యర్థులకు నోటాకంటే తక్కువ ఓట్లను పొం దారు. గోండ్వానా గణతంత్ర పార్టీ(జీజీపీ), బహుజన ముక్తి పార్టీ(బీఎంపీ) అభ్యర్థుల కంటే నోటాకు పడిన ఓట్లే అధికం.

‘నోటా’కు మళ్లీ 5వ స్థానమే.. : 2018 గజ్వేల్‌ శాసనసభ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సహా 13 మంది అభ్యర్థులు (నోటాతో కలిపి 14) బరిలో నిలిచారు. మొత్తం 2,33,207 ఓట్లకు ఈవీఎం యంత్రాల ద్వారా 2,06,707 ఓట్లు పోలవగా, పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా 813 ఓట్లు వచ్చాయి. మంగళవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో.. ‘నోటా’కు 1,624 మంది ఓటేశారు. దీంతో ‘నోటా’కు 5వ స్థానం వచ్చింది. ‘నోటా’ తర్వాత తొమ్మిది మంది అభ్యర్థులకు ఓట్లు తక్కువగా వచ్చాయి. వీరిలో ఐదుగురు స్వతంత్రులు, మరో నలుగురు వేరే పార్టీ అభ్యర్థులు ఉన్నారు. నోటా కంటే ముందు ఉన్న నలుగురిలో ఇద్దరు ప్రధాన పార్టీ అభ్యర్థులు కాగా, మరో ఇద్దరు స్వతంత్య్ర అభ్యర్థులు ఉన్నారు. 2014 శాసన సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సహా 11 మంది అభ్యర్థులు బరిలో నిలిచినప్పుడు కూడా ‘నోటా’కు 5వ స్థానం రావడం గమనార్హం

నోటాకు పెరిగిన వాటా.!

2014తో పోలిస్తే ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పలు స్థానాల్లో నోటా వాడకం ఎక్కువవడంతో దాని వాటా రెట్టింపైంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 12 స్థానాలు ఉన్నాయి. తాజాగా ఎన్నికల్లో పోలైన ఓట్లలో నోటా ఓట్లను పరిశీలిస్తే ఎక్కడా వెయ్యికి తగ్గకుం డా పడ్డాయి. స్వతంత్ర అభ్యర్థుల్లో వందలోపు ఓట్లు పడ్డవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు.

టాప్‌ ఫైవ్‌లో నోటా

అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన చాలామంది అభ్యర్థులపై ప్రజల్లో వ్యతిరేకత కనిపించింది. బరిలో ఉన్న ఆయా పార్టీల కొందరు అభ్యర్థులకు నేర చరిత్ర ఉంది. ఇంకొందరిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. పోటీలో ఉన్న ఎవరూ మంచి వారు కాదని భావిస్తే.. ‘నన్‌ ఆఫ్‌ ది ఎబౌ- నోటా’కు ఓటు వేయాలని ఎన్నికల సంఘం పేర్కొంది. నోటాకు ఈ ఎన్నికల్లో కొన్నిచోట్ల చెప్పుకోదగ్గస్థాయిలో ఓట్లు రావడం విశేషం. గ్రేటర్‌ పరిధిలోని 27 నియోజకవర్గాల్లో పోలైన మొత్తం ఓట్లలో నోటాకి దక్కినవి సగటున 1.1శాతం ఉన్నాయి. చార్మినార్‌ బరిలో 18 మంది నిలిచారు. ఎంఐఎం అభ్యర్థి మహ్మద్‌ అలీఖాన్‌కు 53,808, రెండో స్థానంలోని భాజపా అభ్యర్థి ఉమా మహీంద్రకు 21,222 ఓట్లు పడ్డాయి. ఇక్కడ 614 ఓట్లు నోటాకు నమోదయ్యాయి. నోటా 5వ స్థానంలో నిలిచింది. కూకట్‌పల్లిలో 21 మంది పోటీపడ్డారు. 1.11 లక్షల ఓట్లు తెరాస అభ్యర్థికి, 70,563 ఓట్లు తెదేపాకు పడ్డాయి. 2,134 మంది నోటాకు ఓటు వేశారు. ఇక్కడా 5వ స్థానం దక్కించుకుంది. కంటోన్మెంట్‌లో 20 మంది బరిలో ఉండగా.. నోటాకు 1571 ఓట్లు పడ్డాయి. 6వ స్థానం దక్కింది. సనత్‌నగర్‌లో 16మంది పోటీపడగా.. నోటాకు 1,464 ఓట్లతో 4వ స్థానానికి చేరింది. గోషామహల్‌లో 26 మంది బరిలో ఉండగా.. నోటా 709 ఓట్లతో 4వ స్థానంలో నిలిచింది. బర్కత్‌పురలో 10 మంది పోటీ చేయగా.. 1210 ఓట్లతో 5వ స్థానం.. అంబర్‌పేటలో 1462 ఓట్లు 4వ స్థానం, సికింద్రాబాద్‌ – 1582 ఓట్లు – 4వ స్థానం, నాంపల్లిలో 793 ఓట్లు 5వ స్థానం దక్కించుకుంది. ఇలా గ్రేటర్‌ పరిధిలో దాదాపు అన్నిచోట్ల 4 నుంచి 6లోపు స్థానాల్లోనే నోటా ఉండటం విశేషం.

వీరికన్నా నోటాయే నయం : తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో తెరాస అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ ఎన్నికల్లో జాతీయ పార్టీలు కూడా తక్కువ సీట్లకే పరిమితమయ్యాయి. అయితే కొన్ని పార్టీలకు పోలైన ఓట్ల కంటే ‘నోటా’ ఓట్లే ఎక్కువగా ఉండటం గమనార్హం. రాష్ట్ర ఓటర్లలో 1.1శాతం మంది అంటే 2,24,709 మంది నోటా మీటను నొక్కారు. సీపీఐ, సీపీఎం, తెజస పార్టీలకు పోలైన ఓట్ల కంటే ఈ మొత్తం ఎక్కువ. తాజా ఎన్నికల్లో తెజస పార్టీకి 0.5శాతం అంటే 95,364 ఓట్లు వచ్చాయి. సీపీఎంకు 0.4శాతం(91,009), సీపీఐకి 0.4శాతం(83,215), ఎన్‌సీపీకి 0.1శాతం(29,483) ఓట్లు పడ్డాయి. నియోజకవర్గాల వారీగా.. అత్యధికంగా వర్ధన్నపేట స్థానంలో నోటాకు 5,864ఓట్లు వచ్చాయి. అత్యల్పంగా చార్మినార్‌లో 614ఓట్లు పడ్డాయి. తెరాస అధినేత కేసీఆర్‌ పోటీ చేసిన గజ్వేల్‌ నియోజకవర్గంలో నోటాకు 1,624ఓట్లు వచ్చాయి. కేటీఆర్‌ పోటీ చేసిన సిరిసిల్లలో 2,321, హరీశ్‌రావు నియోజకవర్గం సిద్దిపేటలో 2,932, ఈటల రాజేందర్‌ పోటీచేసిన హుజూరాబాద్‌లో 2,867 మంది నోటా మీటను నొక్కారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పోటీ చేసిన హుజూర్‌నగర్‌లో 1,621, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి పోటీ చేసిన నాగార్జునసాగర్‌లో 1,325, రేవంత్‌రెడ్డి పోటీచేసిన కొడంగల్‌లో 1,472, డీకే అరుణ్‌ పోటీచేసిన గద్వాల్‌లో 1,319, భట్టి విక్రమార్క పోటీ చేసిన మధిరలో 1,011 ఓట్లు నోటాకు పడ్డాయి.

మెజార్టీ కంటే నోటాకే ఎక్కువ : జైపూర్‌: రాజస్థాన్‌లోని దాదాపు 15 నియోజకవర్గాల్లో నోటా అధిక ప్రభావం చూపించింది. ఈ నియోజక వర్గాల్లో గెలుపొందిన అభ్యర్థులు సాధించిన మెజార్టీ ఓట్ల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. అంటే ఆ ఓట్లు నోటాకు కాకుండా ప్రధాన పార్టీలకు పడి ఉంటే అభ్యర్థుల గెలుపులు మారే అవకాశం ఉండేది. నోటాకు ఓట్లు పడడం వల్ల దాదాపు ఏడు నుంచి ఎనిమిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ లేదా భాజపా గెలుపు అవకాశాలను కోల్పోయినట్లయ్యింది. మాలవీయ నగర్‌ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆరోగ్య మంత్రి కాళిచరణ్‌ 1704ఓట్ల తేడాతో విజయం సాధించారు. అక్కడ నోటాకు 2371 ఓట్లు పడ్డాయి. అసింద్‌ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి జబ్బార్‌ సింగ్‌ కేవలం 154ఓట్ల తేడాతో కాంగ్రెస్‌ అభ్యర్థిపై గెలిచారు. ఇక్కడ నోటాకు 2943ఓట్లు పోలవడం గమనార్హం. మార్వార్‌ జంక్షన్‌ సీటులో స్వతంత్ర అభ్యర్థి.. భాజపా తరఫున పోటీ చేసిన వ్యక్తిని 251ఓట్ల తేడాతో ఓడించారు. అక్కడ నోటా మీటను 2719 మంది నొక్కారు. మరో నియోజకవర్గం పిలిబంగలో భాజపా అభ్యర్థి ధర్మేంద్ర కుమార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిపై 278ఓట్ల తేడాతో గెలిచారు. ఇక్కడ నోటాకు వచ్చిన ఓట్లు 2441. ఇంకా పలు చోట్ల ఇలాంటి పరిస్థితే నెలకొంది. రాజస్థాన్‌లో 199 అసెంబ్లీ స్థానాలు ఉండగా కాంగ్రెస్‌ 99, దాని మిత్రపక్షమైన ఆర్‌ఎల్‌డీ ఒక చోట, భాజపా 73, బీఎస్పీ 6, సీపీఎం 2, స్వతంత్ర అభ్యర్థులు 13, ఇతర పార్టీలు 5చోట్ల గెలుపొందారు. కాంగ్రెస్‌, ఆర్‌ఎల్‌డీకి కలిపి 100 స్థానాలతో మెజార్టీ లభించడంతో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్‌ సిద్ధమైంది.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close