ఘరానా స్నాచింగ్,దేవాలయాలు,మోటర్ల దొంగల అరెస్ట్…

0

గత కొన్ని సంవత్సరాలుగా కరీంనగర్ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలలో స్నాచింగ్స్,దేవాలయాల్లో దొంగతనాలు,కరంట్ మోటర్ల దొంగతనాలతో పాటు వివిధ రకాల దొంగతనాలు చేస్తున్న 6గురు సభ్యులు గల ఘరానా దొంగల ముఠాని అరెస్ట్ చేసిన కరీంనగర్ సీసీఎస్ పోలీసులు…

కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం శ్రీనివాసనగర్ కు చెందిన దురుముట్ల అనిల్,మియపురం ప్రణయ్,అనవేని రాజశేఖర్ శివరాత్రి కుమార్,కరీంనగర్ పట్టణంలోని హుస్సేనిపురా కు చెందిన తుంగపెల్లి శంకర్ మరియు సైదాపూర్ మండలం శివరాంపల్లి కి చెందిన చెన్నబోయిన శ్రీనివాస్ అనే 6గురు ఒక ముఠా గా ఏర్పడి చైన్ స్నాచింగ్స్, దేవాలయాల్లో దొంగతనాలు,కరెంట్ మోటర్ల దొంగతనాలు చేసుకుంటూ వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తూ,పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతుండగా,ఎలాగైనా వారిని పట్టుకోవాలనే కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి గారి ఆదేశాలతో రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు చక చక్యంగా వ్యవహరించి వారిని అరెస్ట్ చేసి,దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకొని,రిమాండ్ కి తరలించడం జరిగింది..

సిసి కెమెరాలతో నిందితుల గుర్తింపు

కరీంనగర్ జిల్లాలో వరుసగా జరుగుతున్న స్నాచింగ్,దొంగతనాలను సీరియస్ గా తీసుకున్న పోలీస్ కమిషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి ఎలాగైనా నిందితులను పట్టుకోవాలని సీసీఎస్ పోలీసులను అదేశించగా,రంగంలోకి దిగిన వారు నిందితుల కోసం గాలిస్తుండగా, గత నెల 28న కరీంనగర్ పట్టణంలోని లేబర్ అడ్డా దగ్గర ఇద్దరు వ్యక్తులు కూలి పని ఉన్నదని చెప్పి,గోపాలపూర్ కు చెందిన ఓరుగళ్ల ఒదమ్మ ను బైక్ పై ఎక్కించుకొని పెద్దపల్లి బైపాస్ రోడ్ లో గల ముళ్ళ పొద్దల్లోకి తీసుకెళ్లి,చంపుతామని బెదిరించి ఆమె వద్దగల బంగారు గోలుసును ఎత్తుకొని వెళ్లగా,ఇట్టి కేసులో ఎంక్వైరీ చేస్తూ,సీసీఎస్ పోలీసులు నిందితులు వెళ్లిన దారిలో విచారిస్తుండగా,ఈ మధ్య పోలీసులు ఏర్పరచిన సిసి కెమెరాలతో నిందితులు కనపడగా,తద్వారా నిందితులను గుర్తించి,వారి కోసం గాలింపు చేయడం జరిగింది…

స్నాచింగ్,దొంగతనాలు చేయు విధానం..

నిందితులు ఒకేరకమైన నేరాలు కాకుండా వివిధ రకాల నేరాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్నారు…స్నాచింగ్, దేవాలయాల్లో దొంగతనాలు,కరంట్ మోటార్ల దొంగతనాలతో పాటు వివిధ రకాల నేరాలు చేస్తున్నారు…

ఇట్టి నిందితులు అమాయక మహిళలను ఆసరాగా చేసుకుని వారిని నమ్మించి నిర్మానుష్య ప్రదేశాలకు తీసుకెళ్లి వారిని చంపుతామని బెదిరించి బంగారం ఎత్తుకెళ్లడం,రాత్రి సమయాలలో ఇంట్లోకి ప్రవేశించి నిద్రిస్తున్న వారిపై దాడి చేసి వారిని చంపుతామని బెదిరించి బంగారు నగలు ఎత్తుకెళ్లడం,ఒంటరిగా వెళ్తున్న మహిళలను గుర్తించి బైక్ పై వెళ్లి వారి మెడలోని బంగారు గోలుసులను అపహరించుకపోవడం అలాగే గ్రామ శివారులలో ఉన్న దేవాలయాల్లోకి ప్రవేశించి వారి వద్ద గల ఆయుధంతో హుండీ,తలుపులు పగలగొట్టి నగదు,బంగారం తీసుకెళ్లడం,వ్యవసాయ బావుల వద్ద గల కరెంట్ మోటర్లను ఎత్తుకెళ్లడం వంటి వాటితో పాటు ఇతర దొంగతనాలు చేస్తూ వచ్చిన డబ్బులను పంచుకొని,వాటి ద్వారా జల్సాలు చేస్తూ,వీటినే ప్రవృత్తి గా చేసుకొని జీవిస్తున్నారు…పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారు…

నిందితులు పట్టుబడిన విధానం…

కరీంనగర్ పట్టణంలోని లేబర్ అడ్డా దగ్గర ఒక మహిళను నమ్మించి తీసుకెళ్లి చైన్ స్నాచింగ్ చేసిన కేసులో సిసి కెమెరాల ద్వారా నిందితులను గుర్తించి వారి కోసం కరీంనగర్ 1 టౌన్,మానకొండూర్ మరియు సీసీఎస్ పోలీసులు గాలిస్తుండగా ఈరోజు నిందితులు కరీంనగర్ లోని టవర్ సర్కిల్ వద్ద బంగారాన్ని అమ్మడానికి వచ్చారన్న పక్క సమాచారం మేరకు వెళ్లి,నిందితులను చాక చక్యంగా అదుపులోకి తీసుకోవడం జరిగింది…

నిందితులు చేసిన నేరాల యొక్క వివరాలు…

1.కోహెడ మండలంలో విగ్రహాల దొంగతనం..

గత సంవత్సరం జులై నెల 13/14 తేదీ రాత్రి సమయంలో కోహెడ మండలం శ్రీరాములపల్లి లోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో దొంగతనం చేసి,4 బంగారు దేవత విగ్రహాలు దొంగిలించచడం జరిగింది…

2.హుజురాబాద్ లో స్నాచింగ్ ప్రయత్నం..

గత నెల 30న హుజురాబాద్ పట్టణంలోని కొత్తపల్లి లో నడుచుకుంటూ వెళ్తున్న చల్లూరి సువర్ణ అనే మహిళ మెడలోంచి గొలుసు స్నాచింగ్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది…

3.కరీంనగర్ పట్టణంలో స్నా చింగ్…

గత నెల 28న కరీంనగర్ పట్టణంలోని లేబర్ అడ్డ వద్ద కూలి పని కోసం వచ్చిన గోపాలపూర్ కి చెందిన ఓరుగళ్ల ఒదమ్మ ను పని ఉందని నమ్మించి బైక్ పై తీసుకెళ్లి నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో చంపుతామని బెదిరించి మెడలోని బంగారు గోలుసును తీసుకెళ్లడం జరిగింది…

4.సుల్తానాబాద్ లోని దేవాలయంలో దొంగతనం…

గత నెల 30న రాత్రి సమయంలో నీరుకుళ్ల గ్రామంలోని శ్రీ రంగనాయక స్వామి దేవాలయం లో హుండీ పగలగొట్టి 3200/- నగదు మరియు ఒక సిసి కెమెరాను దొంగతనం చేయడం జరిగింది..

5.తిమ్మాపూర్ మండల పరిధిలో స్నాచింగ్…

ఈ నెల 2న రాత్రి సమయంలో తిమ్మాపూర్ మండలం లోని కొత్తపల్లి గ్రామ శివారులో గల ఇనుకొండ వజ్రమ్మ ఇంటిలోకి వెళ్లి భార్యాభర్తలు ఇద్దరే ఉండగా,వారిని గాయపరిచి చంపుతామని బెదిరించి ఆమె మెడలో గల బంగారు మంగళ సూత్రాన్ని ఎత్తుకొనివెళ్లడం జరిగింది…

6.సైదాపూర్ పరిధిలో స్నాచింగ్…

ఈ నెల 3న రాత్రి సమయంలో సైదాపూర్ మండలంలోని శివరాంపల్లి గ్రామంలో ఇంట్లో నిద్రిస్తున్న ఠాకూర్ అన్నపూర్ణ అనే మహిళ మెడలోంచి బంగారు గొలుసు ఎత్తుకెళ్లడం జరిగింది…

7.మానకొండూర్ పరిధిలోని పెద్దమ్మ గుడిలో దొంగతనం…

ఈ నెల 3న అర్ధరాత్రి సమయంలో మానకొండూర్ మండలంలోని కొండపలకల గ్రామ శివారులో గల పెద్దమ్మ గుడిలోని దేవతపై గల బంగారు ముక్కుపుడక, హుండీని పగలగొట్టి అందులోని దాదాపు 950/- ల నగదును దొంగిలించడం జరిగింది…

8.మానకొండూరు పరిధిలో కరెంట్ మోటార్ దొంగతనం…

ఈ నెల 4న మధ్యాహ్నం సమయంలో మానకొండూర్ మండలంలోని శివరాంపల్లి శివారులో గల మాచర్ల కోటేశ్వర్ కు చెందిన వ్యవసాయ బావిలోని కరెంట్ మోటార్ ని దొంగతనం చేయడం జరిగింది…

నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలు…

1.దాదాపు ఐదు తులాల బంగారు ఆభరణాలు…
2.నాలుగు దేవత విగ్రహాలు…
3.ఒక కరెంట్ మోటార్…
4.నగదు 6,150/-…

మొత్తం విలువ..1,93,150/-…

నిందితుల నుండి సీజ్ చేసిన వాహనాలు/మొబైల్స్ వివరాలు…

1.ఒక కార్..
2.నాలుగు బైక్స్..
3.ఒక ఎక్సెల్..
4.దొంగతనాలు చేయడానికి ఉపయోగించే వస్తువు..
5.ఐదు మొబైల్ ఫోన్స్…

నిందితుల యొక్క పూర్తి వివరాలు…

1. దురుముట్ల అనిల్ s/o రాజయ్య,23సం, ముదిరాజ్ r/o శ్రీనివాస నగర్,మానకొండూర్ మండలం,కరీంనగర్….
2. చెన్నబోయిన శ్రీనివాస్ s/o కనకయ్య,34సం, యాదవ్ r/o శివరామ్పల్లి,సైదాపూర్ మండలం,కరీంనగర్….
3. మియపురం ప్రణయ్ కుమార్ s/o లక్ష్మణాచారీ,22సం, వడ్రంగి r/o శ్రీనివాస నగర్,మానకొండూర్ మండలం,కరీంనగర్….
4. అనవేని రాజశేఖర్ s/o నర్సయ్య,25సం, ముదిరాజ్ r/o శ్రీనివాస నగర్,మానకొండూర్ మండలం,కరీంనగర్….
5. తుంగపెల్లి శంకర్ s/o వెంకటి,36సం, మాదిగ r/o #6-2-549/1,హుస్సేనిపురా,
కరీంనగర్….
6. శివరాత్రి కుమార్ s/o ఉప్పలయ్య,26సం, వడ్డెర r/o శ్రీనివాస నగర్,మానకొండూర్ మండలం,కరీంనగర్….

నిందితులను పట్టుకోవడంలో శ్రమించిన సిబ్బంది వివరాలు…

కె.శ్రీనివాస్,ఏసీపీ,సీసీఎస్ ఆధ్వర్యంలో

1.కిరణ్,ఇన్స్పెక్టర్,సీసీఎస్…
2.విజయ్,ఎస్సై,సీసీఎస్…
3.శ్రీనివాసరావు,ఎస్సై,సీసీఎస్…
4.మురళి,ఎస్సై,సైబర్ క్రైమ్…
5.వీరయ్య,ఏఎస్సై, సీసీఎస్…
6.శ్రీనివాస్,పిసి,సీసీఎస్…
7.సురేందర్ పాల్, పిసి,సీసీఎస్…
8.అంజయ్య,పిసి,సీసీఎస్…
మరియు సీసీఎస్ సిబ్బంది…

ఇట్టి నిందితులను పట్టుకోవడంలో శ్రమించిన అధికారులకు,సిబ్బందిని కమిషనర్ గారు ప్రత్యేకంగా అభినందించి,తగిన రివార్డ్ అందజేయబడునని తెలపడం జరిగింది….

వి.బి.కమలాసన్ రెడ్డి,
కమిషనర్ ఆఫ్ పోలీస్,
కరీంనగర్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here