ఆదాబ్‌ మాట – కేటీఆర్‌ నోట

0

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

డిసెంబర్‌ 20న ‘కేసీఆర్‌ దెబ్బ – రిటైర్మెంట్‌ అబ్బ’ డిసెంబర్‌14న ‘ట్రక్కు టమారం’ అంటూ కొత్త కోణంలో పరిశీలనా కథనాలు ‘ము చ్చట’గా ఆదాబ్‌ హైదరాబాద్‌ అందించింది. అయితే ఆ కథనాల లోని మాటలను కేటీఆర్‌ తెలంగాణ

భవన్‌ల్లో నిర్వహించిన కార్యక్రమంలో యథాతథంగా చెప్పారు.

దిమ్మతిరిగింది:

ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్‌ నేతలకు దిమ్మతిరిగిందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు తెరాసలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఎవరూ గెలవలేదని, తమకూ వెళ్లొద్దని కొంతమంది సూచించారన్నారు. కానీ సీఎం కేసీఆర్‌..అలాంటి మాటలను పట్టించుకోకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లి చరిత్రను తిరగ రాశారన్నారు. నాలుగింట మూడొంతుల మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం ఉందంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్‌ రెడ్డి ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. ఆయన వ్యాఖ్యలు విని నవ్వుకున్నామని చెప్పారు.

రిటైర్మెంట్‌:

ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ నేతలు మంత్రి పదవుల పంపకాలను చేపట్టారని కేటీఆర్‌ దుయ్యబట్టారు.

ప్రజలిచ్చిన తీర్పుతో చాలా మంది కాంగ్రెస్‌ నేతలు రాజకీయాల నుంచి రిటైర్మెంట్‌

కానున్నారని,మరికొంతమంది ఇప్పటికే విూడియాకు ముఖం చాటేశారని ఆయన ఎద్దేవా చేశారు.

ట్రక్కు గుర్తుతో 2లక్షల ఓట్లు పోయాయి:

ఇటీవల జరిగిన ఎన్నికల్లో 47 శాతం ఓట్లు తెరాసకు పడ్డాయని కేటీఆర్‌ చెప్పారు. ట్రక్కు గుర్తుతో సుమారు 2 లక్షల ఓట్లు తెరాసకు దూరమయ్యాయని.. లేదంటే 50శాతం ఓట్లు వచ్చేవన్నారు.పంచాయతీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో పోలింగ్‌ శాతాన్ని పెంచాలని నేతలకు ఆయన సూచించారు. ప్రజల్లో నిరంతరం ఉంటూ వారి విశ్వాసాన్ని, అభిమానాన్ని చూరగొనాలని పిలుపు నిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here