Featuredఅంతర్జాతీయ వార్తలు

గోడ నిర్మించి తీరుతాం

వాషింగ్టన్‌ : అమెరికాలోకి అక్రమ వలసలు, స్మగ్లింగ్‌ను నిరోదించేందుకే గోడ నిర్మాణాన్ని చేపట్టనున్నామని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా గోడ నిర్మాణాన్ని నిర్మించి తీరుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పష్టం చేశారు. ఆయన యుఎస్‌ కాంగ్రెస్‌లో జరిగిన ‘స్టేట్‌ ఆఫ్‌ ది యూనియన్‌ స్పీచ్‌’ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సరిహద్దుల్లో గోడ నిర్మిస్తానని ఆయన పునరుద్ఘాటించారు. గుడ్డుకు ఈకలు పీకే ధోరణితో అమెరికాలో శాంతిని డెమోక్రాట్లు దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. వారు గోడ నిర్మాణానికి నిధుల మంజూరుపై వ్యతిరేకతను వీడాలన్నారు. ఈ గోడ నిర్మాణంతో అమెరికాలోకి అక్రమ వలసలు, స్మగ్లింగ్‌ను నిరోధించ వచ్చని పేర్కొన్నారు. దేశంలోకి అక్రమ వలసలను ఆయన అత్యవసరంగా పరిష్కరించాల్సిన సమస్యగా అభివర్ణించారు. గతంలో ఈ సభలో ఉన్న చాలా మంది గోడ నిర్మాణానికి అనుకూలంగా ఓటు వేశారని.. కానీ, గోడ నిర్మాణం మాత్రం జరగలేదన్నారు. తాను దానిని కచ్చితంగా నిర్మిస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. నిరుద్యోగం ఐదు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత తక్కువగా ఉందని చెప్పారు. తమ దేశ ఉద్యోగుల్లో మహిళలు కూడా అత్యధికంగా ఉన్నారని పేర్కొన్నారు. దేశ కాంగ్రెస్‌లో కూడా వారి శాతం ఎక్కువగానే ఉందని గుర్తు చేశారు. రాజకీయ ఐక్యత అవసరం మని, అమెరికా శత్రువులను ఓడించాలంటే రాజకీయ ఐక్యత ముఖ్యమని ట్రంప్‌ హితవు పలికారు. అత్యున్నతమైన ఎంపిక ఉండాలని ఆయన సూచించారు. కొన్ని దశాబ్దాలుగా ఉన్న రాజకీయ వైషమ్యాలను వీడి కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. కోట్ల మంది ప్రజలు మనల్ని గమనిస్తున్నారంటూ ఆయన డెమోక్రాట్లకు గుర్తు చేశారు. రెండు పార్టీల వలే కాకుండా ఒక దేశం వలే పాలిద్దామని ట్రంప్‌ చెప్పారు.

27న కిమ్‌తో భేటీ అవుతున్నా..

ఉత్తరకొరియా అధినేత కిమ్‌తో ఫిబ్రవరి 27న వియత్నాంలో భేటీ కానున్నట్లు ట్రంప్‌ వెల్లడించారు. ఈ భేటీ రెండు రోజుల పాటు జరుగుతుందన్నారు. ఉత్తరకొరియా అణ్వాయుధాలను త్యజించేలా తన కృషి కొనసాగుతుందన్నారు. గతంలో సింగపూర్‌లో జరిగిన భేటీతో సుహృద్భావ వాతావరణం నెలకొందని తెలిపారు. కొరియా ద్వీపకల్పంలో శాంతిని స్థాపించేందుకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తామన్నారు. మన నాయకుల్ని అనాలి.. చైనాను కాదు..అమెరికాను అలుసుగా తీసుకొన్నందుకు చైనాను నిందించకూడదని ట్రంప్‌ చెప్పారు. దీనికి తమ దేశనాయకులదే తప్పని తేల్చారు. వారే చైనాకు ఆ అవకాశం ఇచ్చారని తెలిపారు. డ్రాగన్‌పై 250 బిలియన్‌ డాలర్ల మేరకు పన్నులు విధించడంతో ఖజానాకు బిలియన్ల కొద్ది నిధులు సమకూరుతున్నాయన్నారు. అమెరికాలో ఉద్యోగాలను, మేధోసంపత్తిని చైనా దొంగిలిస్తోందని మండిపడ్డారు. తాము దూకుడు వ్యవహరిస్తూ దీనికి అడ్డుకట్ట వేస్తున్నామని చెప్పుకొన్నారు. అమెరికాను దోచుకోవడం ఇక కుదరని పని అని చైనాకు తేల్చి చెప్పామన్నారు. వాస్తవ పరిస్థితిలో మార్పులు ఉంటేనే ఆ దేశంతో ఒప్పందం చేసుకొంటామన్నారు. అర్థిక వ్యవస్థలో అద్భుతాలు..తాను అధికారం చేపట్టాక ఆర్థిక వ్యవస్థ బాగా కోలుకొందని ట్రంప్‌ వెల్లడించారు.  తాలిబన్లతో చర్చలు..అఫ్గనిస్థాన్‌లో అన్ని వర్గాలతో నిర్మాణాత్మక చర్చలు కొనసాగిస్తామన్నారు. ఈ వర్గాల్లో తాలిబన్లు కూడా ఉంటారన్నారు. ఈ నిర్ణయం వల్ల దళాల ఉపసంహరణ సులభమై ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలపై దృష్టిపెట్టే అవకాశం లభిస్తుందన్నారు. ఈ క్రమంలో ఒప్పదం కుదురుతుందో లేదో చెప్పలేన్నారు. కానీ శాంతి స్థాపన తుది ప్రయత్నానికి సమయం ఆసన్నమైందన్నారు. అవినీతిపరులైన పాలకుల వద్ద అణ్వాయుధాలు ఉండకూడదని తాము 

ఇరాన్‌తో అణుఒప్పందాన్ని రద్దు చేసుకొన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు అమెరికా ఏదేశంపై విధించనంత కఠినమైన ఆంక్షలను విధించామన్నారు. అమెరికా ‘ఇరాన్‌ వ్యూహం’లో దీనిని విప్లవాత్మక మార్పుగా అభివర్ణించారు.

ప్రతిభ ఉన్నవారు తమదేశానికి రావాలి..

ప్రతిభ ఉన్నవారు తమ దేశానికి రావాలనే ఉద్దేశాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి బయటపెట్టారు. తమ దేశానికి వచ్చేవారు న్యాయపరంగా రావాలని కోరారు. అక్రమ వలసదారులు దేశానికి పెను ముప్పుగా ఆయన పేర్కొన్నారు. 'అమెరికన్ల ఉద్యోగాలు, వారి భవిష్యత్తుకు రక్షణ కల్పిస్తూ వలస వ్యవస్థను రూపొందించడం మా నైతిక బాధ్యత అన్నారు. మా చట్టాలను గౌరవిస్తూ నేడు లక్షల మంది వలసదారులు అమెరికాలో నివసిస్తున్నారని ట్రంప్‌ తెలిపారు. న్యాయపరంగా వచ్చే వలసదారులు మా దేశానికి ఎంతగానో ఉపయోగపడుతున్నారు. విదేశీయులు ఇంకా ఎక్కువ మంది మా దేశానికి రావాలనే నేనూ కోరుకుంటున్నానని, కానీ వారు న్యాయపరంగా రావాలని ట్రంప్‌ చెప్పుకొచ్చారు.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close