టిఆర్ఎస్ ప్రభుత్వంపై ఓటర్ల నిరాసక్తత

0

పోలింగ్‌ తగ్గడానికి అదేకారణం

కాంగ్రెస్‌ ఖాళీ అవుతోందన్న లక్ష్మణ్‌

హైదరాబాద్‌ : పార్లమెంట్‌ ఎన్నికల సరళి చూస్తే కల్వకుంట్ల కుటుంబ పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు బాగా నిరాసక్తత వ్యక్తం చేశారని అన్నారు. ఎన్నికలు ముగిసిన అనంతరం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. భవిష్యత్‌లో రాష్ట్రంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలే ఉంటాయని స్పష్టంచేశారు. మోదీ, అమిత్‌ షా పిలుపు అందుకుని కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌కు ప్రజలు నాందిపలుకుతున్నారని వెల్లడించారు. తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని చెప్పారు. జాతీయ, రాష్ట్ర నాయకులకు, కార్యకర్తల కృషికి కృతజ్ఞతలు తెలిపారు. పోలింగ్‌ శాతం అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువగా ఉండటం చూస్తే రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రజల్లో కనిపిస్తుందన్నారు. అన్ని లెక్కలతో పార్టీ డబ్బును డ్రా చేస్తే పోలీసులు అత్యుత్సాహంతో ప్రదర్శించారని లక్ష్మణ్‌ ధ్వజమెత్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here