యూపిఎ అవినీతి వల్లనే ఆనాడు గెలిచాం

0

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): అనేక అవినీతి కార్యకలాపాల్లో యూపి మునిగి పోవడం వల్ల్నే ఆనాడు బిజెపి అధికారంలోకి రాగలిగిందని గత యూపీఏ పాలనపై రక్షణ శాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ విమర్శలు గుప్పించారు. భాజపా జాతీయ కౌన్సిల్‌ సమావేశంలో ఆమె మాట్లాడుతూ… ‘యూపీఏ పాలనలో అవినీతి ప్రబలిపోయింది. ఉగ్రవాద చర్యలకు అడ్డుకట్ట పడలేదు. పాలనలో విధానాలన్నీ పక్షపాత ధోరణితో ఉండేవి. పేదరికంపై ఆ ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. అందుకే 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోయింది. మేము భారీ మెజార్టీతో గెలిచాం. దేశంలో శాంతికి భంగం కలిగించేందుకు ఉగ్రవాదులకు ఎటువంటి అవకాశమూ ఇవ్వబోమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం నిరూపించింది. మోదీని గ్దదె దించేందుకు సాయం కోరడానికి.. ప్రతిపక్ష పార్టీల్లోని కొందరు పాకిస్థాన్‌కు వెళ్లారు. ఇది సిగ్గుచేటు’ అని వ్యాఖ్యానించారు.’పాకిస్థాన్‌, భారత్‌ పరస్పరం యుద్ధం చేసుకోకూడదని, మనం పోరాడాల్సింది పేదరికంపై అని మోదీ చెప్పిన మాటలను నేను మరోసారి గుర్తు చేస్తున్నాను. ఈ విధానాన్ని భారత్‌ పాటిస్తోంది. ప్రభుత్వం ఈ దిశగానే దేశంలో వ్యవసాయ, గృహనిర్మాణ రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చింది. 2014లో మేము అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో భారీ ఉగ్రదాడి ఒక్కటి కూడా జరగలేదు. ఈ ఐదేళ్లలో దేశం శాంతి, భద్రతలతో ఉందన్న విషయాన్ని ప్రజలకు మనం గుర్తు చేయాలి. ఎన్డీఏ పాలనలో ఒక్క అవినీతి కేసు కూడా నమోదు కాలేదు. సబ్‌ కా సాత్‌ సబ్‌ కా వికాస్‌ అనే నినాదంతో మోదీ పనిచేస్తున్నారు. మన ప్రభుత్వ సంస్కరణలు కొనసాగాలి. దేశంలో ఉగ్రదాడులు జరగకుండా చేయడం, అవినీతి లేకపోవడం అనే రెండు అంశాలు ఎన్డీఏ ప్రభుత్వ గొప్ప విజయాలుగా చెప్పుకోవచ్చు’ అని నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here