పార్టీ బలోపేతం కోసం నిజనిర్ధాణ కమిటి

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఉత్తరాలను సీనియర్‌ బిజెపి నాయకులకు, ఆయా ప్రాంతాల జర్నలిస్టులకు లేఖల ద్వారా ప్రచారం చేస్తోంది. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో బిజెపి అభివృద్ది కోసం నిజనిర్ధారణ కమిటి అద్యయనం చేసిన అనంతరం అట్టి నివేధికలను జర్నలిస్టులకు, ఆ పార్టీ సీనియర్‌ నాయకులకు పోస్టుల ద్వారా అందించింది. పలు ప్రాంతాలలో చర్చనీయాంశమైన ఉత్తరాల రాయబారం వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్‌ జిల్లా బిజెపి అధ్యక్షుడి నాయకత్వమంటే పార్టీకి కృషి చేయడం కాదు, పార్టీ అడ్డు పెట్టుకుని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్న చందంగా మారిందని, కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్నప్పటికి కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది. అయితే అట్టి పథకాలను గాలికి వదిలేసి ఇస్టాను సారం చేయడం వల్ల అనేక మంది నాయకులు, కార్యకర్తలు పార్టీకి దూరం అవుతున్నారనే విమర్షలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ కంచుకోట అయిన మహబూబాబాద్‌ ప్రాంతంలో టిఆర్‌ఎస్‌, బిజెపిల ఎదిగిన ఆ నాయకుడు తన విద్యా సంస్థలను, సొం త వ్యాపారాలు పెంచుకున్నారే తప్పా పార్టీకి చేసిం దేమి లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే సామాజిక వర్గ బలాన్ని ఉపయోగించుకుని జిల్లా కేంద్రానికి మకాం మార్చి బినామి పేర్లలో వ్యాపా రాన్ని కొనసాగిస్తున్నాడనే విమర్శిలు బలంగా వినిపి స్తున్నాయని అట్టి నివేధిక పత్రాలలో పేర్కొన్నారు. అలాగే ప్రైవేటు కళాశాలల

యాజమాన్యాలలో వ్యాపారా విభేదాలు పరిష్కరించే పేరుతో యాజమాన్యాల మద్య చిచ్చు పెట్టి సెటిల్‌మెంట్లను చేస్తూ అక్రమ సంపాదనకు తెరలేపిన ఆ నాయకుడు పార్టీ కోసం ఎలాంటి పని చేశాడో బహిరంగాంగా చెప్పాలని ఆ లేఖలలో పేర్కొన్నారు. అలాగే జిల్లా పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం రాష్ట్ర పార్టీ పంపిన నిధులలో కొంత వరకే ఖర్చు పెట్టి మిగిలినదంతా మెక్కేశాడని, రాష్ట్ర పార్టీ నాయకులకు కూడా ఎర వేసి మాయమాటలతో పబ్బంగడుపుతున్న నాయకుడని విమర్శలు ఉన్నాయి. అలాగే పరకాల మున్సిపాటీకి జరిగిన అవిశ్వాస విషయంలో డబ్బులకు అమ్ముడు పోయి సొంత పార్టీ బిసి మహిళా వైస్‌ చైర్మన్‌ను దించడానికి ప్రయత్నించాడదని ఆరోపించారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో మావోయిస్టు పార్టీని ఎదిరించి పోరాడిన ఎబివిపి, హిందు వాహిని, సంఘ్‌ పరివార్‌ సంస్థల నుండి వచ్చిన నాయకులను బిసి, ఎస్సి, ఎస్టీ నేతలను అనగతొక్కడంలో ఆయనకు ఆయనే సాటి అంటూ విమర్శణాస్త్రాలు ప్రయోగించారు. ములుగు ప్రాంతం నుండి గండ్రకోట కుమార్‌, పొరండ్ల చరణ్‌, భూపాలపల్లి నుండి మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఎరుకల గణపతి, పరకాల ప్రాంతం నుండి మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ దేవునూరి, రమ్యకృష్ణ మేఘనాధ్‌, మార్క సునీల్‌కుమార్‌, సంఘమేశ్వర్‌ తదితరులను పార్టీలో ఎదగకుండా చేశారని పేర్కొన్నారు. అలాగే మానుకోట ప్రాంతం నుండి గంగుల శ్రీధర్‌, కలసాని వేణుమాధవ్‌ రెడ్డి, కేసముద్రం నుండి బాలు నాయక్‌, గూడూరు నుండి ఎబివిపి విజయ్‌, కొత్తగూడ నుండి పొడిశెట్టి సురేశ్‌, ఉప సర్పంచ్‌ నరేశ్‌, నర్సంపేట నుండి సోల్తి రవి, రాజెందర్‌, ఠాకూర్‌ రవీందర్‌ సింగ్‌, బిజెపి సీనియర్‌ నాయకుడు తడక అశోక్‌ గౌడ్‌, ఎస్పీ నేత పృద్వీ, కోమల్‌రెడ్డి, దుగ్గొండి రమేస్‌, తొర్రూరు, పాలకుర్తి పి శ్రీనివాస్‌, అనుమల్ల ప్రదీప్‌రెడ్డి, పాకనూటి ఇంద్రకరణ్‌ కుమార్‌, మైస నరేందర్‌, దుబ్బ రాజశేఖర్‌, గడాల గోపి, అలాగే నక్సలైట్లచే చంపబడిన కోదండ రామిరెడ్డి కుటుంబ నుండి వచ్చిన కందూరు గోపాల్‌రెడ్డి, జనగాం నుండి పిట్టల సత్యం, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మాదారపు వెంకట్‌, ఎస్సీ నాయకులు చోడ రమేష్‌, కొంతం శ్రీనివాస్‌, కౌన్సిలర్లు, ఎల్లయ్య, స్టేషన్‌ ఘన్‌పూర్‌ నుండి గొడుగు నరేందర్‌, శివ, హరీష్‌, గోపినాద్‌, గోపినాయక్‌, మక్క అంజయ్య, మాజీ ఎంపిటిసి జంపాల బిక్షం, వర్దన్నపేట నుండి మాజీ సర్పంచ్‌లు యాకయ్య, కుమారస్వామి, ఎబివిపి సీనియర్‌ నేత పిట్టల రాజు,మచ్చ రాజు,బండి సాంబయ్యలే కాకుండా అనేక మంది బిజెపి జిల్లా అధ్యక్షుడి బాదితులేనని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇంత జరిగినప్పటికి పార్టీ పరిస్థితి కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందని పేర్కొన్నారు. అలాగే హసన్‌పర్తి నుండి వడ్లకొండ వేణుగోపాల్‌గౌడ్‌, మాజీ ఎంపిటిసి పావుశెట్టి శ్రీధర్‌, బిజెవైఎం మాజీ జిల్లా అధ్యక్షుడు కౌరిక రవికుమార్‌, కేయూ బిజెపి అనుబంధ సంస్థల జెఎసిని ఏర్పాటు చేసిన డాక్టర్‌ బుర్రి ఉమాశంకర్‌, తిరుపతి ,రంజిత్‌లు కూడా ఆ నాయకుడి బాధితులేనని నిజనిర్ధారణ కమిటి చేసిన అధ్యయనంలో తేలిందని ఉత్తరాలలో పేర్కొన్నారు. ఇలాంటి మేకవన్నె పులిలా ఉండే నాయకులను రాష్ట్ర పార్టీ నాయకత్వం గుర్తించి ఇలాంటి వారిని పార్టీ నుండి తొలగించాల్సిన అవసరం ఉన్నదని, పార్టీని ముందుకు తీసుకెళ్ళే వారికి పార్టీ పగ్గాలు కట్టబెట్టాల్సిన తరుణమిదని ఆ లేఖలో తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here