బెయిల్‌ కోసం ముచ్చటగా మూడోసారి

0

లండన్‌: భారత్‌కు అప్పగింత విచారణను ఎదుర్కొంటున్న పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోడీ ఈ నెల 8న బ్రిటన్‌ కోర్టులో మరోసారి బెయిల్‌ పిటిషన్‌ను దాఖలు చేయనున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సంస్థ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ)ను రూ.13,500 కోట్ల మేరకు మేనమామ – రత్నాల వ్యాపారి మెహుల్‌ చోక్సీతో కలిసి మోసం చేసిన కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే.

మార్చి 19 నుంచి జైలులోనే నీరవ్‌ :

ఈ ఏడాది మార్చి 19న నీరవ్‌ను స్కాట్లాండ్‌ పోలీసులు అదుపులోకి తీసుకోగా, అప్పట్నుంచి జైలులోనే ఉంటున్నారు. ఇప్పటికే రెండుసార్లు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్న నీరవ్‌కు నిరాశే ఎదురవగా, ఇప్పుడు మూడోసారి ప్రయత్నిస్తున్నారు.

భారతదేశానికి అప్పగింత కేసులో కోర్టుకు హాజరు కానున్న నీరవ్‌ మోడీ :

ఈ నెల 8న లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ మేజిస్ట్రేట్స్‌ కోర్టు చీఫ్‌ మేజిస్ట్రేట్‌ ఎమ్మా ఆర్బుత్నట్‌ ఎదుట భారత్‌కు అప్పగింత విచారణార్థం నీరవ్‌ హాజరు కానున్నారు. ఈ సందర్భంగానే తన బెయిల్‌ పిటిషన్‌ను మరోసారి నీరవ్‌ దాఖలు చేయనున్నారు. భారత్‌ తరఫున క్రౌన్‌ ప్రాసిక్యూషన్‌ సర్వీస్‌ (సీపీఎస్‌) వాదిస్తున్నది. నీరవ్‌ మోడీ తరఫున క్లేర్‌ మాంట్గోమరి ఆఫ్‌ మాట్రిక్స్‌ చాంబర్స్‌ వాదిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here