వరుసగా మూడో రోజు

0

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ 138 పాయింట్లు నష్టపోయి 11,359 వద్ద, సెన్సెక్స్‌ 487 పాయింట్లు నష్టపోయి 37,789 వద్ద ముగిశాయి. వేదాంత, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు దాదాపు 3శాతం వరకు నష్టపోయాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ సూచీ 1శాతం పడిపోయింది. మీడియా రంగం, స్థిరాస్థి, ఫార్మా, ప్రభుత్వ రంగబ్యాంక్‌ల షేర్లు భారీగా నష్టపోయాయి. నేడు నూజెన్‌ కెమికల్స్‌ షేర్లు మార్కెట్లో లిస్టయ్యాయి. దాదాపు 16శాతం ప్రీమియం వీటికి లభించింది. గత నెల 24 నుంచి 26 మధ్యలో ఈ సంస్థ ఐపీవో కొనసాగింది. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడువుతున్నాయి. అమెరికా సూచీలు కూడా భారీగా నష్టపోవడం అనేది భారత మార్కెట్లను భయపెడుతోంది. జపాన్‌, కొరియా సూచీలు నష్టాల్లో ముగిశాయి. చైనా నుంచి అమెరికాకు వచ్చే వస్తువులపై కొత్తగా టారీఫ్‌లు విధించడంతో వాణిజ్య యుద్ధభయాలు సర్వత్రా పెరిగాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here