Featuredస్టేట్ న్యూస్

పనులు పరిగెత్తాలి

కాళేశ్వరం, కన్నెపల్లిపై కేసీఆర్‌ అసంతప్తి మేడిగడ్డకు మార్చివరకు గడువు

భూపాలపల్లి (ఆదాబ్‌ హైదరాబాద్‌): కాళేశ్వరం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగడంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ అసంత ప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనుల్లో వేగాన్ని పెంచాలని కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల బాటలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ మంగళవారం నాడు మేడిగడ్డ వద్ద రిజర్వాయర్‌ పనులను పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీధర్‌ బాబు, గండ్ర వెంకటరమణరెడ్డి స్థానిక సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యలు వినతి పత్రం సమర్పించారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద ప్రాజెక్టు పురోగతిని తెలిపే ఫోటో ఎగ్జిబిషన్‌ను సీఎం పరిశీలించారు. అధికారులతో కేసీఆర్‌ చర్చించారు. పనులు జరుగుతున్న తీరుతెన్నులను కేసీఆర్‌ అధికారులను అడిగి తెలుసుకొన్నారు. పనుల్లో వేగాన్ని మరింత పెంచాలని కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఇవాళ రాత్రికి కేసీఆర్‌ కరీంనగర్‌ లోనే బస చేయనున్నారు.ఇప్పటికే రాష్ట్రంలోని ప్రాజెక్టు నిర్మాణాల పురోగతిపై రిటైర్డ్‌ ఇంజనీర్ల బందం ప్రాజెక్టులను పరిశీలించి సీఎం కేసీఆర్‌ కు నివేదికను సీఎంకు సమర్పించారు. రేపు ఉదయం కాళేశ్వరం నుండి ఎస్‌ఆర్‌ఎస్పీ ప్రాజెక్టుకు నీరందించే ప్రాంతాలను కేసీఆర్‌ పరిశీలించనున్నారు. ఈ నెల 3వ తేదీ లేదా నాలుగో తేదీన కేసీఆర్‌ ప్రాజెక్టు పురోగతిపై కేసీఆర్‌ సమీక్ష నిర్వహించనున్నారు.

మార్చికల్లా మేడిగడ్డ పూర్తికావాలి: కేసీఆర్‌.. కరీంనగర్‌: మార్చి నెలాఖరుకు మేడిగడ్డ పనులు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్‌ ఇంజినీర్లను ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా ఆయన మేడిగడ్డ పనులను ప్రారంభించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో బయల్దేరిన ముఖ్యమంత్రి.. విహంగ వీక్షణం ద్వారా మేడిగడ్డ బ్యారేజీ పనులను పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనలో భాగంగా తొలుత మేడిగడ్డకు వెళ్లారు. అక్కడ జరుగుతున్న ప్రాజెక్టు పనుల్లో పురోగతిపై ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పనులు ఏయే దశల్లో ఉన్నాయి, ఎప్పటిలోగా పూర్తవుతాయనే వివరాలపై ఆరా తీశారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల వివరాలను ఇంజినీర్లు సీఎంకు వివరించారు. రికార్డు స్థాయిలో కాంక్రీటు పనుల్ని పూర్తి చేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. పనుల్లో వేగం పెరిగేందుకు సీఎం పలు సూచనలు చేశారు. కాంక్రీటుతో పాటు మోటార్ల బిగింపు తదితర పనులు కూడా సమాంతరంగా జరిగేలా చూడాలని చెప్పారు. పనుల్లో మరింత వేగం పెంచాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సాగునీరు అందించాలంటే మేడిగడ్డ పూర్తికావడం కీలకమని సీఎం ఇంజినీర్లతో అన్నారు. కేసీఆర్‌ సూచనలు విన్న ఇంజినీర్లు ఏమేరకు పనుల్లో పురోగతిపై ఫొటో ప్రదర్శన ద్వారా వివరించారు. ప్రాజెక్టుపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నామని, దీనిపై భారీగా వ్యయం చేస్తున్నామన్న సీఎం.. గడువు లోపు పనులు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం సీఎం మేడిగడ్డ బ్యారేజీ వద్ద పంపు హౌస్‌ నిర్మాణం పనులను పరిశీలించారు. కేసీఆర్‌ వెంట సీఎస్‌ ఎస్కే జోషి, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.

కన్నెపల్లి పంపుహౌస్‌ పనులపై అసంతృప్తి …మేడిగడ్డ బ్యారేజీ పనులను పరిశీలించిన కేసీఆర్‌ అక్కడి నుంచి కన్నెపల్లి పంపుహౌస్‌ చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించిన కేసీఆర్‌ అధికారులను అడిగి పనుల పురోగతిపై ఆరా తీశారు. పంపుహౌజ్‌ పనుల పురోగతిపై కేసీఆర్‌ అసంత ప్తి వ్యక్తం చేశారు. మార్చికల్లా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచి ఆయన అన్నారం బ్యారేజీకి చేరుకున్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close